Star Fruits
-
కర్నూలులో స్టార్ ఫ్రూట్స్
కర్నూలు (ఓల్డ్‌సిటీ): నగరానికి కొత్త ఫలం వచ్చింది. బెంగళూరులో మాత్రమే లభించే స్టార్ ఫ్రూట్స్‌ను కడప జిల్లా బద్వేల్‌కు చెందిన పండ్ల వ్యాపారి హబీబుల్లా కర్నూలుకు తెచ్చి విక్రయిస్తున్నారు. దీంతో పాటు గ్రీన్ ఆపిల్‌ను కూడా తెచ్చారు. స్థానిక పెద్దమార్కెట్ సమీపంలో బండిపై విక్రయిస్తుండగా వినియోగదారులు ఆశ్చర్యంగా తిలకించారు. స్టార్ ఫ్రూట్ మానవ శరీరంలోని కొలెస్ట్రాల్, గ్యాస్ట్రబుల్ వంటి సమస్యలను నివారిస్తుందని, గ్రీన్ ఆపిల్ షుగర్ పేషెంట్లకు మంచిదని వ్యాపారి పేర్కొన్నారు. వాటిని కేజీ రూ. 200 చొప్పున విక్రయిస్తున్నారు. -
తింటే పులుపు... చూస్తే చుక్కలు!
సాధారణంగా ఎప్పుడూ చూసే పండ్లకు భిన్నంగా ‘స్టార్ ఫ్రూట్స్’ కొత్తగా అమ్మకానికి వచ్చాయి. మానుకోటకు చెందిన చిరువ్యాపారి ముత్యాల సంపత్‌కుమార్ సీజన్ల వారీగా వివిధ రకాల పండ్లను తీసుకువచ్చి అమ్ముతుంటారు. ఇందులో భాగంగా కొద్ది రోజుల నుంచి స్టార్ ఫ్రూట్స్ అమ్ముతున్నాడు. తూర్పుగోదావరి జిల్లా కడియం నుంచి ఖమ్మంకు, అక్కడి నుంచి మానుకోటకు ఈ పండ్లను తీసుకురాగా, రూ.200కు కేజీ చొప్పున అమ్ముతున్నారు. కేజీకి 20 పండ్లు వస్తున్నాయి. ఈ పండ్లు చూడడానికి నక్షత్రం ఆకారం, ఆకుపచ్చని రంగులో ఉండగా.. తింటే వగరు, పులుపుగా ఉంటాయని సంపత్ తెలిపారు. వెరైటీగా ఉండడంతో స్టార్ ఫ్రూట్స్ కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. - మహబూబాబాద్ రూరల్