
ఢిల్లీ: ఢిల్లీలో దారుణం జరిగింది. మెట్రో రైలు డోర్‌లో చీర ఇరుక్కుని ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఢిల్లీలోని ఇంద్రలోక్ రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. తీవ్ర గాయాలపాలైన మహిళను ఢిల్లీలోని సఫ్జర్‌జంగ్ ఆస్పత్రిలో చేర్చారు. కానీ పరిస్థితి విషమించి బాధిత మహిళ మరణించిటు ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
రీనా(35) అనే మహిళ ఇంద్రలోక్ రైల్వే స్టేషన్‌లో మెట్రో రైలు దిగే క్రమంలో ఆమె చీర డోర్‌లో ఇరుక్కుంది. కానీ రైలు ముందుకు వెళ్లడంతో మహిళ రైలు కింద పడిపోయింది. ఈ ఘటనలో బాధిత మహిళ తీవ్ర గాయాలపాలైంది. తీవ్ర గాయాలపాలైన రీనాను ఢిల్లీలోని సఫ్జర్‌జంగ్ ఆస్పత్రిలో చేర్చారు. కానీ పరిస్థితి విషమించి ఆమె ప్రాణాలు కోల్పోయారు.
పశ్చిమ ఢిల్లీలోని నాంగ్లోయ్ నుంచి మోహన్ నగర్‌కు వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు మహిళ బంధువు విక్కీ తెలిపారు. రీనా భర్త ఏడేళ్ల క్రితం చనిపోయాడు. ఆమెకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారని విక్కీ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపడతామని మెట్రో రైల్వే సేఫ్టీ కమిషనర్ దయాళ్ తెలిపారు.
ఇదీ చదవండి: రాజస్థాన్ బీజేపీ కొత్త చీఫ్‌గా కైలాష్ చౌదరి
Comments
Please login to add a commentAdd a comment