Metrotrain
-
గడుసు పిల్లే..! మొత్తానికి తాళి కట్టించుకుంది! వైరల్ వీడియో
పెళ్లిళ్లలో ఉండే హడావిడి అంతా ఇంతాకాదు. పెళ్లి పనులు మొదలు పెట్టినదగ్గర్నుంచి ఆ మూడు ముళ్లు పడేదాకా అదొక యజ్ఞంలా లాంటిదే. అందులోనూ అమ్మాయి తరపువారికి అయితే ఈ టెన్షన్ మరీ ఎక్కువ. ఈక్రమంలో బెంగళూరులో జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్రాఫిక్‌లో ఇరుక్కున్న ఒక పెళ్లి కూతురు ముహూర్తం దగ్గరపడుతున్న సమయంలో తెలివైన నిర్ణయం తీసుకుంది.. అసలు ఏం జరిగిందంటే.. మూడుముళ్ల వేడుక కోసం అందంగా ముస్తాబైన, బెంగళూరుకు చెందిన పెళ్లి కూతురు పెళ్లి మండపానికి బయలు దేరింది. తీరా భయంకరమైన ట్రాఫిక్‌లో చిక్కుకుంది. అసలే బెంగళూరులో ట్రాఫిక్ రద్దీ. దీనికి పెళ్లిళ్ల సీజన్. ఎటూ కదల్లేని పరిస్థితి. ఇలా అయితే.. ఇక పెళ్లి అయినట్టే అనుకుందో ఏమోగానీ, కారు దిగి తన సన్నిహితులతో మెట్రోలో ఎంచక్కా వివాహ మండపానికి చేరింది. సమయానికి తాళి కట్టించుకుంది. పెళ్లి ముస్తాబు, పట్టుచీర నగలతో వధువు నిశ్చింతగా మెట్రోలో ప్రయాణిస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అమ్మాయి గడుసుదే అంటే ప్రశంసలు దక్కించుకుంటోంది. అయితే ఇందులో కొసమెరపేంటి అంటే ఈ వీడియో ఇప్పటిది కాదు.. గత ఏడాది నాటిది. సోషల్ మీడియా పుణ్యమా అంటూ మళ్లీ వైరల్ అవుతోంది. Whatte STAR!! Stuck in Heavy Traffic, Smart Bengaluru Bride ditches her Car, & takes Metro to reach Wedding Hall just before her marriage muhoortha time!! @peakbengaluru moment 🔥🔥🔥 pic.twitter.com/LsZ3ROV86H — Forever Bengaluru 💛❤️ (@ForeverBLRU) January 16, 2023 -
మెట్రో రైలు డోర్లో చీర ఇరుక్కుని.. మహిళ మృతి
ఢిల్లీ: ఢిల్లీలో దారుణం జరిగింది. మెట్రో రైలు డోర్లో చీర ఇరుక్కుని ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఢిల్లీలోని ఇంద్రలోక్ రైల్వే స్టేషన్లో ఈ ఘటన జరిగింది. తీవ్ర గాయాలపాలైన మహిళను ఢిల్లీలోని సఫ్జర్‌జంగ్ ఆస్పత్రిలో చేర్చారు. కానీ పరిస్థితి విషమించి బాధిత మహిళ మరణించిటు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. రీనా(35) అనే మహిళ ఇంద్రలోక్ రైల్వే స్టేషన్లో మెట్రో రైలు దిగే క్రమంలో ఆమె చీర డోర్లో ఇరుక్కుంది. కానీ రైలు ముందుకు వెళ్లడంతో మహిళ రైలు కింద పడిపోయింది. ఈ ఘటనలో బాధిత మహిళ తీవ్ర గాయాలపాలైంది. తీవ్ర గాయాలపాలైన రీనాను ఢిల్లీలోని సఫ్జర్‌జంగ్ ఆస్పత్రిలో చేర్చారు. కానీ పరిస్థితి విషమించి ఆమె ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ ఢిల్లీలోని నాంగ్లోయ్ నుంచి మోహన్ నగర్‌కు వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు మహిళ బంధువు విక్కీ తెలిపారు. రీనా భర్త ఏడేళ్ల క్రితం చనిపోయాడు. ఆమెకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారని విక్కీ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపడతామని మెట్రో రైల్వే సేఫ్టీ కమిషనర్ దయాళ్ తెలిపారు. ఇదీ చదవండి: రాజస్థాన్ బీజేపీ కొత్త చీఫ్‌గా కైలాష్ చౌదరి -
వైరల్: మెక్సికోలో కూలిన మెట్రో ఫ్లైఓవర్, 23 మంది మృతి
మెక్సికో సిటీ: మెక్సికో సిటీలో మెట్రోలైన్పై రైలు వెళుతుండగా ఎలివేటెడ్ కారిడార్ (పిల్లర్లపై నిర్మించిన మెట్రో మార్గం) కుప్పకూలిన దుర్ఘట నలో 23 మంది మరణించగా, మరో 70 మంది గాయపడ్డారు. మెట్రో మార్గం కుప్పకూలే సమయంలోనే ఓ కారు అక్కడ ఉండటంతో ఫ్లైఓవర్ దానిపై పడింది. కారులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.మొత్తం 49 మందిని ఆస్పత్రిలో చేర్చామని నగర మేయర్ క్లౌడియా షీన్బౌమ్ తెలిపారు. మరణించిన వారిలో పిల్లలు సైతం ఉన్నారని, ఇది చాలా దురదృష్టకర ఘటన అని పేర్కొన్నారు. కొనసాగుతున్న సహాయకచర్యలు.. ప్రమాదం గురించి తెలియగానే వందలాది మంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మెక్సికోలో కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా ఆంక్షలు ఉన్నప్పటికీ, ప్రజలు భారీగా ప్రమాద స్థలానిక చేరుకున్నారు. ప్రమాదం జరగడానికి కారణమైన బాధ్యులను గుర్తించి శిక్ష విధించాలంటూ మెక్సికో విదేశాంగ కార్యదర్శి మార్సెలో ఎబ్రార్డ్ డిమాండ్ చేశారు. అయితే ఆయన 2006 నుంచి 2012 వరకు మెక్సికో సిటీ మేయర్‌గా పని చేశారు. ఆ సమయంలోనే ఈ మెట్రో రైల్ లైన్ నిర్మాణం జరిగింది. 2024లో దేశాధ్యక్ష పదవికి మెర్సెలో పోటీపడనున్న నేపథ్యంలో ఈ ఘటన ఆయనకు ప్రతికూలంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. నిర్మాణంలో సరైన ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే 2017లో రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో ఓ భూకంపం సంభవించింది. అది ఈ మెట్రోమార్గాన్ని దెబ్బతీసిందనే అభిప్రాయాలు కూడా వెల్లడవుతున్నాయి. From moments ago, the collapse of the elevated #Linea12 #MetroCDMX railway that crashed the subway. Many are blaming current Foreign Affairs Secretary, Marcelo Ebrard, who was Mayor of Mexico City when this line was built, with allegations of poor construction and money issues. pic.twitter.com/LkCl6gfKG6 — David Wolf (@DavidWolf777) May 4, 2021 A tragedy occurred, the metro on line 12 with the bridge in Mexico City fell, there are many injured and people trapped in the wagons, I hope their relatisituation.ot in that situation #MetroCDMX #Linea12 pic.twitter.com/zxVZ05iVp6 — Yessi 🇲🇽 (@HamiltonYessica) May 4, 2021 చదవండి: వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్న మిలిందా- బిల్ గేట్స్ -
మెట్రోరైల్లో టీకెట్ లేని ప్రయాణం
-
ఆ బస్సులో 1200 మంది ప్రయాణించొచ్చు
రోడ్డుకు మధ్యలో వేసిన పిల్లర్ల సాయంతో పైనుంచి మెట్రోట్రైన్లు వెళ్లడం మనం చూశాం. కానీ పిల్లర్ల సాయం లేకుండా రోడ్డుకు ఇరువైపులా ఉన్న ట్రాక్ సాయంతో ట్రాన్సిట్ ఎలివేటెడ్ బస్ (టీఈబీ) వెళుతుంది. టీఈబీని సొంత టెక్నాలజీతో చైనా ఇంజినీర్లు రూపొందించారు. రోడ్డుపై ఉన్న వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా ఈ ఎలివేటెడ్ బస్ ప్రయాణిస్తుంది. 19వ చైనా బీజింగ్ అంతర్జాతీయ హైటెక్-ఎక్స్‌పోలో దీని బ్లూప్రింట్‌ను ప్రదర్శించారు. టీఈబీలో ప్రయాణికులకోసం పైభాగంలో ప్రత్యేకంగా ఓ కంపార్ట్మెంట్ ఉంటుంది. కింది భాగాన రోడ్డుపై వెళ్లే వాహనాలు వెళ్లడానికి అవకాశం ఉంటుంది. ట్రాన్సిట్ ఎలివేటెడ్ బస్‌ను రోడ్డును పూర్తి స్థాయిలో వాడుకునే అవకాశం ఉంటుంది. ‘ఎలివేటెడ్ బస్‌లో 1200 మంది ప్రయాణించే అవకాశం ఉంది. మెట్రో రైలులో ఉండే అన్ని సదుపాయాలు ఇందులో ఉంటాయి. దీని నిర్మాణానికి అయ్యే ఖర్చు, మెట్రో నిర్మాణానికి అయ్యే ఖర్చులో కేవలం ఐదోవంతు మాత్రమే అవుతుంది. దీని నిర్మాణ పనులు కూడా వేగంగా చేయొచ్చు’ అని టీఈబీ ప్రాజెక్ట్ ఇంచార్జ్ ఇంజనీర్ జిమింగ్ అంటున్నారు. ఉత్తర చైనాలోని క్విన్ హువాంగడో సిటీలో 2016 ఏడాది చివరి కల్లా ట్రాన్సిట్ ఎలివేటెడ్ బస్ ట్రయల్ రన్‌ను చేసి పని తీరును చూడనున్నారు.