గాంధీనగర్: భారతీయ సంప్రదాయంలో చీరకున్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మహిళలను మెప్పిస్తూ ట్రెండీ దుస్తులు మార్కెట్లోకి ఎన్ని వచ్చినా అవి చీరకు పోటీనివ్వలేవు. ముఖ్యంగా వివాహాలు, పండుగలు కార్యక్రమాలలో మహిళలు చీరలు ధరించడానికే మొదటి ప్రాధాన్యత ఇస్తారు. అంతటి ప్రాధాన్యత కలిగిన ఈ చీరలను ధరించి తొలిసారిగా సూరత్‌లో శారీ వాకథాన్ నిర్వహించారు. ఏకంగా 15 వేలమంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదంతా ఎందుకంటే..
15 రాష్ట్రాలు నుంచి వచ్చిన మహిళలు
ఫిట్‌నెస్‌ను ప్రోత్సహించే లక్ష్యంతో దేశంలోని 15 రాష్ట్రాల నుంచి సుమారు 15,000 మంది మహిళలు ఆదివారం సూరత్‌లో తొలిసారిగా నిర్వహించిన ‘సారీ వాకథాన్’లో పాల్గొన్నారు. అథ్వా పార్టీ ప్లాట్ నుంచి ప్రారంభమై పార్లే పాయింట్ మీదుగా మూడు కిలోమీటర్ల కొనసాగింది. సూరత్ లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి యు-టర్న్ వరకూ ఈ సూరత్ శారీ వాకథాన్ జరిగింది. మహిళల పిట్‌నెస్‌గా అవగాహన కల్పించడమే కాకుండా ఈ కార్యక్రమం భారతీయ సంప్రదాయాలు, చీరకట్టు గొప్పదనం మరోసారి చాటిచెప్పిందని పలువులు ప్రశంసలు కురిపించారు. ఈ కార్యక్రమానికి చీర ధరించిన మహిళలు, బాలికలను మాత్రమే పాల్గొనడానికి అనుమతించారు.
సూరత్ మునిసిపల్ కమీషనర్ షాలినీ అగర్వాల్ ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలుపుతూ, “ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం జీ 20 అధ్యక్ష పదవిని పొందడం గర్వించదగ్గ విషయం. ఈరోజు ఇక్కడ చీర వాకథాన్ నిర్వహించారు. దాదాపు 15,000 మంది మహిళలు ఈ ఈవెంట్ కోసం నమోదు చేసుకున్నారు. ఇందుకోసం 15 రాష్ట్రాల నుంచి మహిళలు ఇక్కడకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ఆనందంగా ఉందన్నారు’. పౌరులలో ఫిట్‌నెస్‌తో పాటు ఆరోగ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్న ‘ఫిట్ ఇండియా మూవ్‌మెంట్’ సహకారంతో సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ (SMC), సూరత్ స్మార్ట్ సిటీ డెవలప్‌మెంట్ లిమిటెడ్ ఈ వాకథాన్‌ను నిర్వహించాయి.
Comments
Please login to add a commentAdd a comment