
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హోల్‌సేల్ వ్యాపార దిగ్గజం మెట్రో క్యాష్ అండ్ క్యారీ తాజాగా గుంటూరులో స్టోర్‌ను ఏర్పాటు చేసింది. 44,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇది నెలకొంది. 9,000 పైచిలుకు రకాల ఆహార, ఆహారేతర ఉత్పత్తులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్‌లో సంస్థకు ఇది మూడవ కేంద్రం కాగా, దేశవ్యాప్తంగా 30వ ఔట్‌లెట్. ఈ కేంద్రం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 500 మందికి ఉపాధి లభిస్తుందని కంపెనీ తెలిపింది. ఏపీలో ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో స్టోర్స్ ఉన్నాయి. దక్షిణాదిన కంపెనీ ఔట్‌లెట్ల సంఖ్య 14కు చేరుకుంది. దేశవ్యాప్తంగా 30 లక్షల పైచిలుకు కస్టమర్లు ఉన్నారు.