metro india
-
రూ.30 వేలకోట్ల ప్రాజెక్ట్‌లకు కేబినెట్ ఆమోదం
దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో మెట్రో ప్రాజెక్టుల విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బెంగళూరు, థానే, పుణెల్లోని మెట్రో ప్రాజెక్ట్‌ల కోసం రూ.30,000 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పింది. ఈ ప్రాజెక్ట్‌లను 2029 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దాంతోపాటు బగ్ద్గోరా, బిహ్తా, పాట్నా విమానాశ్రయాల పరిసరాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు దాదాపు రూ.3,000 కోట్లు కేటాయించేలా మంత్రివర్గం ఆమోదం లభించిందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.కేంద్ర కేబినెట్ సమావేశం తర్వాత ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..‘బెంగళూరు , థానే , పుణెల్లో దాదాపు రూ.30,000 కోట్ల విలువైన మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌లను 2029లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దాంతోపాటు బగ్ద్గోరా, బిహ్తా, పాట్నా విమానాశ్రయ పరిసరాల్లో మౌలిక సదుపాయాలు విస్తరించేందుకు దాదాపు రూ.3,000 కోట్లు కేటాయించేలా అనుమతులు వచ్చాయి. ఈ కీలక ప్రాజెక్టులు ఆయా నగరాల వృద్ధికి దోహదపడుతాయి. 2014కి ముందు దేశంలో కేవలం ఐదు నగరాల్లో మాత్రమే మెట్రో రైలు ఉండేది. కానీ ప్రస్తుతం 21 నగరాలకు మెట్రో విస్తరించింది. ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మౌలిక సదుపాయాల కల్పనకు రూ.2 లక్షల కోట్ల ఖర్చు చేసేలా ఆమోదం లభించింది’ అన్నారు.ఇదీ చదవండి: బ్యాంక్ ఖాతాలు క్లోజ్.. సమస్య పరిష్కారానికి చర్చలు‘బెంగళూరు మెట్రో రైలు ప్రాజెక్ట్ ఫేజ్-3లో రెండు కారిడార్లను అభివృద్ధి చేయాలని కేబినెట్ నిర్ణయించింది. దాంతో ప్రభుత్వ ఖజానాపై రూ.15,611 కోట్ల భారం పడబోతోంది. ఈ ఫేజ్-3 ప్రాజెక్ట్ 44.65 కిలోమీటర్లతో 31 స్టేషన్లను అనుసంధానం చేస్తుంది. మెట్రో విస్తరణలో భాగంగా మూడో దశ పనులు పూర్తయిన తర్వాత బెంగళూరు నగరంలో 220.20 కిలోమీటర్ల మెట్రో రైలు నెట్వర్క్ ఉంటుంది. థానేలో కొత్తగా 22 స్టేషన్లతో ఏర్పాటు చేసే 29 కిమీ కారిడార్ కోసం రూ.12,200 కోట్లు ఖర్చు అవుతుంది. మహారాష్ట్రలో మంత్రివర్గం ఆమోదించిన మరో ప్రాజెక్ట్ కోసం రూ.2,954.53 కోట్లు ఖర్చు అవుతాయి’ అని మంత్రి వివరించారు. -
మెట్రోకు ‘గ్రేట్ ప్లేస్ టు వర్క్’ సర్టిఫికెట్
సాక్షి, సిటీబ్యూరో: మహా నగరానికి తాగునీరు సరఫరా చేసే సింగూరు 3, 4 ఫేజ్‌లకు విద్యుత్ సరఫరా చేసే 132 కేవీ పెద్దాపూర్, కంది సబ్ స్టేషన్లలో మరమ్మతు పనుల నేపథ్యంలో ఈ నెల 4న గురువారం ఉదయం 7 గంటల నుంచి మరుసటి రోజు శుక్రవారం ఉదయం ఏడు గంటల వరకు పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని జలమండలి ఒక ప్రకటనలో తెలిపింది. 24 గంటల పాటు షేక్‌పేట్, జూబ్లీహిల్స్, సోమాజిగూడ, బోరబండ, మూసాపేట్, నల్లగండ్ల, చందానగర్, హుడా కాలనీ, హఫీజ్‌పేట్, మణికొండ, నార్సింగి, మంచిరేవుల, తెల్లాపూర్ తదితర ప్రాంతాల్లో పూర్తిగా అంతరాయం, భోజగుట్ట రిజర్వాయర్, బంజారా, ఎర్రగడ్డ, కేపీహెచ్‌బీ, హైదర్‌నగర్ తదితర ప్రాంతాల్లో లో–ప్రెజర్‌తో నీటి సరఫరా జరగుతుందని పేర్కొంది. అంతరాయం ఏర్పడే ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని జలమండలి సూచించింది. -
సూసైడ్ స్పాట్స్‌గా మెట్రో రైల్వే స్టేషన్లు !
సాక్షి బెంగళూరు: నమ్మ మెట్రో రైల్వే స్టేషన్లు సూసైడ్ హాట్స్పాట్లుగా మారుతున్నాయి. గడిచిన ఆరు నెలల్లో మెట్రో రైల్వే స్టేషన్లలో ఆరుగురు ఆత్మహత్య చేసుకున్నారు. పదేపదే మెట్రో ట్రాక్‌లపైకి దిగే ప్రయాణికుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. అయినప్పటికీ మెట్రో అధికారులు మాత్రం అవసరమైన భద్రత వ్యవస్థ కలి్పంచడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారని నగర వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెజిస్టిక్ మెట్రో స్టేషన్లో మాత్రమే బీఎంఆర్సీఎల్ సెక్యురిటీలు అలర్ట్ అవుతున్నారు. మిగిలిన చోట్ల భద్రత సిబ్బంది నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో భద్రతా నిర్లక్ష్యం కారణంగా మెట్రో రైల్వే పట్టాలపై ఆత్మహత్య కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీ, చెన్నై మెట్రోలల్లో పీఎస్డీ (ప్లాట్ఫారం స్క్రీన్ డోర్లు) అమర్చడం వల్ల అక్కడ అలాంటి ఘటనలకు తావులేకుండా ఉంది. అయితే నమ్మ మెట్రోలో అలాంటి చర్యలు ఇంతవరకు చేపట్టకపోవడం దురదృష్టకరం. దీంతో ప్రమాదాలు రోజురోజుకి ఎక్కువవుతున్నాయి. ఐటీ సిటీ బెంగళూరులో నమ్మ మెట్రో సేవలు ప్రారంభమై సుమారు 13 ఏళ్లు గడిచినా ఇప్పటివరకు పట్టాలపై ఎలాంటి రక్షణ లేకపోవడంతో ప్రయాణికుల రక్షణకు భద్రత కరువైంది. కొంతమంది ఉదాసీనంగా పట్టాలపై పడిపోతుండడం, మరికొంత మంది ఉద్ధేశపూర్వకంగా ఆత్మహత్య చేసుకునేందుకు నమ్మ మెట్రో పట్టాలను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో గడిచిన ఆరు నెలల్లో ఆరుగురు మెట్రో రైల్వే స్టేషన్లలో పట్టాలపైకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. -
ఢిల్లీ మెట్రోలో రాహుల్.. ఫొటో వైరల్
దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఐదు దశల ఎన్నికలు ఇప్పటికే ముగియగా, ఇంకా మరో రెండు దశల ఎన్నికలు మిగిలివున్నాయి. ఈ క్రమంలో మే 25న ఢిల్లీలో ఆరో దశలో ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సామాన్య ప్రజలకు చేరువయ్యేందుకు ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. రాహుల్ గాంధీ మెట్రోలో ప్రయాణిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తున్న రాహుల్ గాంధీ సామాన్య ప్రజలతో మమేకమై, వారితో ఫొటోలు కూడా దిగారు. రాహుల్ గాంధీ ఢిల్లీ మెట్రోలో మంగోల్‌పురిలో జరిగే ర్యాలీకి బయలుదేరారు. ఆయనతో పాటు ఈశాన్య ఢిల్లీ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్ కూడా ఉన్నారు. ఢిల్లీలో మే 25వ తేదీన ఓటింగ్ జరగనుంది. -
మెట్రో ఇలా ఎక్కితే ఎంతో హాయి..!
మన దేశంలోని పలు నగరాల్లో మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉన్నాయి. మెట్రో రైలు ప్రయాణానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వీటిలో ఒకరిని ఒకరు తోసుకుంటూ మెట్రోలోనికి ఎక్కడం లాంటి వీడియోలను మనం చూసే ఉంటాం. అయితే ఇలాంటి తీరుకు భిన్నమైన వీడియోను చూసిన చాలామంది తెగ ఆశ్యర్యపోతున్నారు. ఎంతో క్రమశిక్షణతో మెట్రో ఎక్కుతున్నవారిని చూసి ముచ్చట పడిపోతున్నారు.ఈ వీడియో చైనాలోని మెట్రోకు సంబంధించినది. వీడియోలో మెట్రో స్టేషన్లో రద్దీ అధికంగా ఉండటాన్ని మనం గమనించవచ్చు. అయితే అక్కడున్నవారంతా వరుసలో నిలుచుని, తమ వంతు వచ్చిన తరువాతనే మెట్రో లోనికి ఎక్కుతున్నారు. ఏమాత్రం తొందరపాటు లేకుండా క్రమశిక్షణ పాటిస్తూ రైలు ఎక్కుతున్నారు. రైలు ప్రయాణికుల క్రమశిక్షణను చూసినవారంతా మెట్రోలోకి ఇలా ఎక్కితో ఎంతో హాయిగా ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు.ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫారం ఎక్స్‌లో @RVCJ_MEDIA పేరుతో షేర్ చేశారు. ఈ వీడియోకు లక్షకు మించిన వ్యూస్ దక్కాయి. వేయిమందికిపైగా యూజర్స్ దీనిని లైక్ చేశారు. Scenes From China 😯pic.twitter.com/hetaLNXA9U— RVCJ Media (@RVCJ_FB) May 9, 2024 -
రెండక్షరాల పేరు కోసం 254 కోట్లు చెల్లించిన ముఖేష్ అంబానీ!
ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఓ కంపెనీ పేరు వాడుకోనేందుకు సదరు కంపెనీకి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ రూ.254 కోట్లు చెల్లించారు. గత ఏడాది డిసెంబర్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ తన ‘రిలయన్స్ రీటైల్ వెంచర్స్’ జర్మనీ చెందిన మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఇండియాను రూ.2,850 కోట్లకు కొనుగోలు చేసింది. క్రయ, విక్రయ సమయంలో జరిగిన ఒప్పందంలో భాగంగా మెట్రోకు చెందిన 31 హోల్‌సేల్ స్టోర్లు, 6 స్టోర్లలో ఉన్న స్థలాల్ని సైతం చేజిక్కించుకుంది. అయితే భారత్‌లో కొత్త యజమాని రిలయన్స్ వ్యాపారాన్ని నిర్వహించడానికి వీలుగా మెట్రో లైసెన్స్‌లు ఇచ్చింది. మెట్రో ఇండియా ఆస్తులతో పాటు ఆ పేరును వినియోగించుకునేందుకు రూ.254 కోట్లు చెల్లించింది. ఇకపై తన పేరును రియలన్స్ వాడుకోవచ్చని మెట్రో తన వార్షిక ఫలితాల విడుదల నివేదికలో తెలిపింది. 2003లో అడుగు పెట్టి జర్మనీ రీటైల్ సంస్థ మెట్రో ఇండియా 2003లో భారత మార్కెట్లోకి ప్రవేశించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 21 నగరాల్లో 31 హోల్‌సేల్ పంపిణీ కేంద్రాలున్నాయి. 3,500 మంది ఉద్యోగులు ఉన్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న రిటైలర్లు వంటి బిజినెస్ కస్టమర్లతో ఈ సంస్థ వ్యాపారం నిర్వహిస్తోంది. ‘క్యాష్-అండ్-క్యారీ’ వ్యాపార నమూనాతో భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన తొలి కంపెనీ ఇదే. ఈ పద్దతిలో ప్రస్తుత మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే ఈ మెట్రో స్టోర్‌లో కావాల్సిన వస్తువుల్ని కొనుగోలు చేయొచ్చు. -
చరిత్ర సృష్టించిన హైదరాబాద్ మెట్రో.. 40 కోట్ల మంది ప్రయాణం
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైల్ చరిత్ర సృష్టించింది. నగరంలో మెట్రో రైళ్లను ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రయాణికుల సంఖ్య 40 కోట్లకు చేరుకుంది. 2017 నవంబర్ 29న నగరంలో మెట్రో సేవలను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు రోజు రోజుకు ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. తొలుత నాగోల్ నుంచి అమీర్‌పేట్ వరకు మెట్రో రైలు పరుగులు తీసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎల్బీనగర్ నుంచి అమీర్‌పేట్ మీదుగా మియాపూర్ వరకు.. నాగోల్ నుంచి అమీర్‌పేట్ మీదుగా రాయదుర్గం వరకు మెట్రో రైళ్లు పరుగులు తీశాయి. అదేవిధంగా జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో అందుబాటులోకి వచ్చింది. దశలవారీగా ప్రయాణికుల రద్దీతో పాటే ట్రిప్పుల సంఖ్య సైతం పెరిగింది. ప్రస్తుతం ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సుమారు వెయ్యి ట్రిప్పులు తిరుగుతున్నట్లు అంచనా. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా వివిధ మార్గాల్లో ట్రిప్పుల సంఖ్యను పెంచేందుకు హెచ్ఎంఆర్ చర్యలు చేపట్టింది. అంచెలంచెలుగా.. నగరంలో మెట్రో రైళ్లను ప్రారంభించినప్పటి నుంచి ప్రయాణికుల నుంచి ఆదరణ లభించింది. ఐటీ కారిడార్లకు రాకపోకలు సాగించే సాఫ్ట్వేర్ ఉద్యోగులు మెట్రో సేవలను గణనీయంగా వినియోగించుకున్నారు. క్రమంగా విద్యార్థులు, వివిధ రంగాలకు చెందిన ఉద్యోగులు మెట్రో శాశ్వత ప్రయాణికులుగా మారారు. ప్రస్తుతం ప్రతి రోజు సుమారు 4.90 లక్షల మంది మెట్రో సేవలను వినియోగించుకుంటున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. త్వరలో ఈ సంఖ్య 5 లక్షలు దాటనున్నట్లు పేర్కొన్నారు. రోజుకు 6.70 లక్షల మంది ప్రయాణం చేసేందుకు అనుగుణంగా మెట్రో రైళ్లు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత ప్రయాణికుల్లో ప్రతిరోజూ 1.20 లక్షల మంది విద్యార్థులు ప్రయాణం చేస్తున్నారు. మరో 1.40 లక్షల మంది సాఫ్ట్వేర్ నిపుణులు, ఐటీ ఉద్యోగులు మెట్రో రైళ్లలో ప్రయాణం చేస్తున్నట్లు ఎండీ వెల్లడించారు. -
రిలయన్స్ - మెట్రో డీల్ పూర్తి.. వేల కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఇషా అంబానీ!
న్యూఢిల్లీ: భారత్‌లో తమ వ్యాపార విభాగాన్ని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్)కు విక్రయించే ఒప్పంద ప్రక్రియ పూర్తయినట్లు జర్మనీ రిటైల్ సంస్థ మెట్రో తెలిపింది. ఈ డీల్ కింద 31 హోల్‌సేల్ స్టోర్లు, మొత్తం రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియో ఉన్నట్లు వివరించింది. వ్యాపార బదిలీ ప్రక్రియ జరిగే సమయంలో మెట్రో ఇండియా స్టోర్లన్నీ అదే బ్రాండ్‌తో కొనసాగుతాయని, ఉద్యోగులు.. కస్టమర్ల విషయంలో పెద్ద మార్పులేమీ ఉండబోవని సంస్థ పేర్కొంది. భారత్‌లో మెట్రో కార్యకలాపాలను రూ. 2,850 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు ఆర్ఆర్వీఎల్ గతేడాది డిసెంబర్ 22న ప్రకటించింది. ఇప్పటికే భారీగా కార్యకలాపాలు విస్తరిస్తున్న ఆర్ఆర్వీఎల్.. తాజాగా మెట్రో కొనుగోలుతో దేశీయంగా రిటైల్ రంగంలో మరింత పట్టు సాధించనుంది. గత ఆర్థిక సంవత్సరంలో ఆర్ఆర్వీఎల్ రూ. 2.30 లక్షల కోట్ల ఆదాయం ఆర్జించింది. అటు మెట్రో ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో 29.8 బిలియన్ యూరోల అమ్మకాలు నమోదు చేసింది. మెట్రో కొనుగోలుతో.. ఇప్పటికే రిలయన్స్ జియో మార్ట్, రిలయన్స్ ట్రెండ్స్, స్మార్ట్ బజార్ పేర్లతో ఇప్పటికే రిటైల్ మార్కెట్లో ఉన్న రిలయన్స్ రిటైల్.. మెట్రో ఇండియా కొనుగోలుతో తన వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు దోహదపడనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు అంచనా. కాగా, మెట్రో కొనుగోలులో రిలయన్స్ రిటైల్ డైరెక్టర్ ఇషా అంబానీ చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. రిలయన్స్‌కు మూలస్తంభాల్లా.. రిలయన్స్ సామ్రాజ్యానికి ముగ్గురు వారసులు మూలస్తంభాల్లా నిలుస్తున్నారు. తండ్రి నుంచి పుణికి పుచ్చుకున్న వ్యాపార వారసత్వాన్ని తమదైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ఇక, గత ఏడాది రిలయన్స్ రిటైల్ బాధ్యతలు తన కూతురు ఇషా అంబానీకి,రిలయన్స్ జియో బాధ్యతలు తన పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీకి,సోలార్ ఎనర్జీకి సంబంధించిన విభాగం మరో కుమారుడు అనంత్ అంబానీకి ముఖేష్ అంబానీ దంపతులు అప్పగించిన విషయం తెలిసిందే. -
రిలయన్స్ చేతికి మెట్రో ఇండియా
న్యూఢిల్లీ: దేశీ రిటైల్ మార్కెట్లో స్థానాన్ని పటిష్టం చేసుకునే దిశగా రిలయన్స్ మరింతగా దృష్టి పెడుతోంది. ఇప్పటికే పలు సంస్థలను కొనుగోలు చేసిన కంపెనీ తాజాగా జర్మనీ దిగ్గజం మెట్రో ఏజీకి భారత్‌లో ఉన్న టోకు వ్యాపార విభాగాన్ని దక్కించుకుంటోంది. మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఇండియాలో 100 శాతం వాటాలను కొనుగోలు చేసేందుకు రిలయన్స్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్) మెట్రో ఏజీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ రూ. 2,850 కోట్లుగా ఉంటుందని ఇరు సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ డీల్ పూర్తి కానుంది. ‘చిన్న వ్యాపారస్తులు, సంస్థల క్రియాశీలక భాగస్వామ్యంతో విశిష్టమైన వ్యాపార వ్యూహాన్ని రూపొందించుకోవాలన్న మా లక్ష్యానికి మెట్రో ఇండియా కొనుగోలు తోడ్పడుతుంది‘ అని ఆర్ఆర్వీఎల్ డైరెక్టర్ ఈశా అంబానీ తెలిపారు. ‘వృద్ధి చెందుతున్న, లాభదాయక హోల్‌సేల్ వ్యాపారాన్ని సరైన సమయంలో విక్రయిస్తున్నాం. మెట్రోను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు రిలయన్స్ సరైన భాగస్వామి కాగలదని మేము విశ్వసిస్తున్నాం‘ అని మెట్రో ఏజీ సీఈవో స్టీఫెన్ గ్రూబెల్ పేర్కొన్నారు. రిలయన్స్ ఇప్పటిదాకా భారీ కిరాణా స్టోర్స్ వ్యవస్థపై ప్రధానంగా దృష్టి పెట్టిందని, మెట్రో హోల్‌సేల్ బిజినెస్ కొనుగోలు చేయడం దానికి ఉపయోగకరంగా ఉండగలదని కన్సల్టెన్సీ సంస్థ జేపీ మోర్గాన్ వెల్లడించింది. లాట్స్ హోల్‌సేల్ సొల్యూషన్స్ పేరిట కార్యకలాపాలు నిర్వహిస్తున్న సియామ్ మాక్రో వంటి సంస్థలు కూడా మెట్రోను కొనుగోలు చేసేందుకు పోటీపడినా చివరికి రిలయన్స్ దక్కించుకుంది. రూ. 7,700 కోట్ల అమ్మకాలు .. భారత్‌లో మెట్రో కార్యకలాపాలు 2003లో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 21 నగరాల్లో 31 స్టోర్స్‌ను కంపెనీ నిర్వహిస్తోంది. వీటిలో సగం స్టోర్స్ దక్షిణాదిలోనే ఉన్నాయి. 3,500 మంది ఉద్యోగులు ఉన్నారు. పండ్లు, కూరగాయలు మొదలుకుని ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, దుస్తుల వరకూ వివిధ ఉత్పత్తులను హోటల్స్, రెస్టారెంట్లు, ఆఫీసులు, కంపెనీలు, చిన్న రిటైలర్లు, కిరాణా స్టోర్స్ మొదలైన వర్గాలకు మెట్రో విక్రయిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ. 7,700 కోట్ల అమ్మకాలు నమోదు చేసింది. కంపెనీ భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చాక ఇవే అత్యధిక విక్రయాలు కావడం గమనార్హం. 30 లక్షల మంది వ్యాపార కస్టమర్లు ఉండగా 10 లక్షల కస్టమర్లు క్రమం తప్పకుండా కొనుగోళ్లు నిర్వహిస్తున్నారు. 16 వేల పైగా రిలయన్స్ స్టోర్స్.. ఆర్‌ఆర్‌వీఎల్‌కు 16,600 పైచిలుకు స్టోర్స్ ఉన్నాయి. 18 బిలియన్ డాలర్ల ఆదాయాలతో ప్రపంచంలో టాప్ రిటైలర్ల జాబితాలో 56వ స్థానంలో ఉంది. అత్యంత వేగంగా వృద్ధి చెందితున్న రిటైల్ సంస్థల లిస్టులో దక్షిణ కొరియాకు చెందిన కూపాంగ్ తర్వాత రెండో స్థానంలో ఉంది. జస్ట్ డయల్, డన్జోలను కొనుగోలు చేయడంతో పాటు ఇటీవలే ఇండిపెండెన్స్ పేరిట సొంత ఎఫ్ఎంసీజీ బ్రాండ్‌ను కూడా ఆవిష్కరించింది. దేశీ రిటైల్ మార్కెట్ పరిమాణం దాదాపు రూ. 60 లక్షల కోట్లుగాను, ఇందులో సంఘటిత రంగం వాటా 12%గా ఉంటుందని అంచనా. సంఘటిత రంగంలోని ఫుడ్, గ్రోసరీ విభాగంలో రిలయన్స్‌కు ఇప్పటికే 20 శాతం వాటా ఉంది. పోటీ సంస్థ ‘మోర్’తో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ స్టోర్స్ ఉన్నాయి. ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ వ్యాపారాన్ని కూడా రూ. 24,713 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు 2020లో రిలయన్స్ ప్రకటించింది. కానీ, రుణదాతల నుంచి మద్దతు లభించకపోవడంతో దాన్నుంచి విరమించుకుంటున్నట్లు ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రకటించింది. ఎగ్జిన్లో 23.3% వాటాలు న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఎగ్జిన్ టెక్నాలజీస్‌లో తమ అనుబంధ సంస్థ రిలయన్స్ స్ట్రాటెజిక్ బిజినెస్ వెంచర్స్ 23.3 శాతం వాటాలు కొనుగోలు చేసినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. ఇందుకోసం 25 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 207 కోట్లు) వెచ్చించినట్లు వివరించింది. జీపీఎస్ వంటి నేవిగేషన్ టెక్నాలజీ లేకపోయినా క్లిష్టమైన ప్రాంతాల్లోనూ డ్రోన్లు, రోబోలు తిరిగేందుకు ఉపయోగపడే అటానమీ సాంకేతికతను ఎగ్జిన్ అందిస్తుంది. -
'మెట్రో'కు భారీ షాక్, వేలకోట్ల లాభాలే లక్ష్యంగా!
న్యూఢిల్లీ: మెట్రో ఏజీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను ఉల్లంఘిస్తూ, నిధులు మళ్లించుకునే క్రమంలో ఉందని అఖిల భారత రిటైలర్ల సమాఖ్య (సీఏఐటీ) తీవ్రో ఆరోపణలు చేసింది. మెట్రో ఏజీ భారత వ్యాపార విభాగం మెట్రో క్యాష్ అండ్ క్యారీ అనుసరిస్తున్న వ్యాపార విధానాలపై అభ్యంతరాలు లేవనెత్తింది. ఇవి తప్పుడు ఆరోపణలు అని, హాని కలిగించే ఉద్దేశ్యంతో చేస్తున్నవిగా మెట్రో ఏజీ ఖండించింది. మెట్రో ఏజీ 2003లో భారత్‌లోకి ప్రవేశించింది. దేశవ్యాప్తంగా 31 మెట్రో క్యాష్ అండ్ క్యారీ స్టోర్లను నిర్వహిస్తోంది. భారత్‌లో వ్యాపారాన్ని విక్రయించి వెళ్లిపోయే సన్నాహాల్లో ఉంది. అమెజాన్, రిలయన్స్ రిటైల్, సీపీ గ్రూపు తదితర సంస్థలు బిడ్ వేసే యోచనతో ఉన్నాయి. ఈ క్రమంలో సీఏఐటీ ఆరోపణలు, అభ్యంతరాలను వ్యక్తం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘‘మీడియా కథనాల ప్రకారం మెట్రో జర్మనీ భారత వ్యాపారాన్ని విక్రయించి, తన పెట్టుబడులపై రూ.10,000 కోట్లకు పైగా లాభాలను పొందాలనుకుటోంది. భారత్‌లో గత సంవత్సరాల్లో భారీ లాభాలను సమకూర్చుకున్న మొత్తాన్ని దారి మళ్లించడమే ఇది. మెట్రో ఏజీ క్యాష్ అండ్ క్యారీ (హోల్‌సేల్) రూపంలో బీటుసీ (బిజినెస్ టు కస్టమర్/రిటైల్) వ్యాపారం నిర్వహిస్తోంది. ఇది ఫెమా, జీఎస్టీ చట్టాలను ఉల్లంఘించడమే. వ్యవస్థలను అపహాస్యం చేయడం. క్యాష్ అండ్ క్యారీ వ్యాపారం చేసే సంస్థలు కస్టమర్ల నుంచి పన్ను రిజిస్ట్రేషన్ ఆధారాన్ని తీసుకోవాలి. కానీ, మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఇండియా బోగస్ పన్ను రిజిస్ట్రేషన్ కార్డులను తన స్టోర్లకు వచ్చే కస్టమర్లకు జారీ చేసి నిబంధనలను పాతరేసింది’’అని సీఏఐటీ ప్రకటన విడుదల చేసింది. ఈడీ దర్యాప్తు దీనిపై మేము ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి ఫిర్యాదు చేసినట్టు సీఏఐటీ ప్రకటించింది. దీనిపై ఈడీ దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపింది. ఉల్లంఘనలు పెద్ద ఎత్తున ఉన్నాయని, ఈడీ త్వరలోనే తన దర్యాప్తు పూర్తి చేసి కనీసం మెట్రో ఇండియాపై రూ.12,000 కోట్ల వరకు జరిమానా విధించొచ్చని పేర్కొంది. సీఏఐటీ ఆరోపణలను మెట్రో ఏజీ ఖండించింది. సంస్థ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. ‘‘గత 19 ఏళ్ల భారత కార్యకలాపాల్లో నియంత్రణపరమైన నిబంధనల అమలు, ఎఫ్‌డీఐ, భారత చట్టాలను అనుసరించడంలో మాకు నిష్కళంకమైన ట్రాక్ రికార్డు ఉంది. కనుక స్వార్థ ప్రయోజనాల కోణంలో చేసిన తప్పుడు, హానికారక ఆరోపణలను ఖండిస్తున్నాం’’అని పేర్కొన్నారు. -
‘మెట్రో ఇండియా’ రేసులో రిలయన్స్, ప్రేమ్‌జీ
న్యూఢిల్లీ: మెట్రో ఇండియా ఆస్తుల కొనుగోలు రేసు ఆసక్తికరమైన మలుపులు తీసుకుంటోంది. థాయిలాండ్‌కు చెందిన చరోన్ పోక్పాండ్ (సీపీ) గ్రూపు సైతం రంగంలోకి వచ్చింది. అలాగే, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ (విప్రో ప్రేమ్‌జీ సొంత పెట్టుబడుల సంస్థ), ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ స్విగ్గీ కూడా రేసులో ఉన్నాయి. ప్రముఖ రిటైల్ సంస్థ, రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్ రిటైల్ కూడా పోటీ పడుతున్నట్టు ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు పేర్కొన్నాయి. జర్మనీకి చెందిన రిటైలర్ మెట్రో ఏజీ.. భారత్‌లోని తన ఆస్తులను విక్రయానికి పెట్టడం తెలిసిందే. ఇక 1–1.5 బిలియన్ డాలర్లతో మెట్రో ఇండియా ఆస్తుల కొనుగోలు అవకాశాలను టాటా గ్రూపు, ప్రైవేటు ఈక్విటీ ఫండ్ బెయిన్ క్యాపిటల్ మదింపు వేస్తున్నట్టు సమాచారం. ఫ్లిప్‌కార్ట్–వాల్‌మార్ట్, డీమార్ట్, అమెజాన్ ఈ రేసు నుంచి దాదాపు తప్పుకున్నట్టేనని తాజా సమాచారం. ఈ వారంలోనే నాన్‌బైండింగ్ ఆఫర్లను సమర్పించాల్సి ఉంటుంది. నాన్ బైండింగ్ ఆఫర్లు వచ్చిన తర్వాత ఆయా సంస్థలతో మెట్రో ఏజీ చర్చలు నిర్వహించనుంది. ఇందుకు రెండు నెలల సమయం పడుతుందని తెలుస్తోంది. భారత్‌లో కార్యకలాపాలు అనుకున్నంత ఆశావహంగా లేకపోవడంతో మెట్రో ఏజీ తన ఆస్తులను విక్రయించి వెళ్లిపోవాలని అనుకుంటుండడం తెలిసిందే. పదికి పైగా సంస్థలు తొలుత ఆసక్తి చూపించగా.. అధిక పోటీ కారణంగా కొన్ని సంస్థలు ముందే తప్పుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ సహా సుమారు పది సంస్థలు పోటీ పడుతున్నట్టు తొలుత పేర్లు వినిపించడం గమనార్హం. ‘‘మా విధానం ప్రకారం మీడియాలో వచ్చే ఊహాజనిత వార్తలపై స్పందించం. కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త అవకాశాలను మదింపు వేస్తూనే ఉంటుంది’’అని రిలయన్స్ రిటైల్ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. -
ఇండియాలో వ్యాపారానికి ‘మెట్రో’ గుడ్‌బై ?
జర్మన్‌కి చెందిన ప్రముఖ రిటైల్ బిజినెస్ సంస్థ మెట్రో స్టోర్స్ ఇండియాలో తన వ్యాపార కార్యకలాపాలకు పులిస్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. 19 ఏళ్ల పాటు ఇండియాలో కొనసాగిన ఆ సంస్థ చివరకు ఇక్కడ ఫలితాలు ఆశజనకంగా లేకపోవడంతో వీడి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. వంద శాతం విదేశీ పెట్టుబడులతో దేశంలోని ప్రధాన నగరాల్లో మెట్రో స్టోర్లు ఏర్పాటయ్యాయి. 2003లో ఇండియాలో మెట్రో బిజినెస్ మొదలు కాగా.. దేశంలోని 21 నగరాల్లో 31 స్టోర్లు ఆ సంస్థకు ఉన్నాయి. హైదరాబాద్‌లో కూకట్‌పల్లిలో తొలిసారి మెట్రో స్టోరు ఏర్పాటు కావడం అప్పట్లో సంచనలంగా మారింది. మెట్రో తర్వాత అనేక సంస్థలు ఇదే మోడల్‌ను అనుసరిస్తూ రిటైల్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఇండియాలో ఇండియాలో రిటైల్ స్టోర్లతో పాటు కర్నాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, వెస్ట్బెంగాల్లలో ఐదు కలెక్షన్ సెంటర్లు ఉన్నాయి. ఏడు వేల రకాలకు పైగా వస్తువులు మెట్రో స్టోర్లలో అమ్ముతున్నారు. 2025 నాటికి ఇండియాలో మెట్రో బిజినెస్ అంచనా 1.25 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక చాలు పందొమ్మిదేళ్లు గడిచినా ఇండియాలో మెట్రో వృద్ధి ఆశించిన స్థాయిలో లేదు. పైగా మెట్రో తరహాలోనే అనేక సంస్థలు రిటైల్ బిజినెస్‌లోకి వచ్చాయి. ఇంత పోటీలో ఇక్క భవిష్యత్తు మరింత కష్టంగా ఉండవచ్చనే అంచనాలు మెట్రో యజమాన్యానికి ఉన్నాయి. దీంతో ఇండియాలో తమ బిజినెస్‌కి పులిస్టాప్ పెట్టాలని నిర్ణయించింది. జేపీ మోర్గాన్ ఇండియాలో ఆ సంస్థకు ఉన్న 31 స్టోర్లు, 5 కలెక్షన్ సెంటర్లు ఇతర స్థిర, చర ఆస్తులను కొనేందుకు అనువైన బయ్యర్‌ను వెతికి పెట్టాల్సిందిగా జేపీ మోర్గాన్ సంస్థను మెట్రో కోరింది. ఈ మేరకు 1.5 నుంచి 1.75 బిలియన్ డాలర్ల రేంజ్లో అమ్మేందుకు రెడీ అయ్యింది మెట్రో. రిలయన్స్, అమెజాన్, డీ మార్ట్ వంటి ప్రముఖ సంస్థలు మెట్రో డీల్ పట్ల ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. ఎందుకంటే ‘ప్రపంచ వ్యాప్తంగా మెట్రోకు వ్యాపారాలు ఉన్నాయి. ప్రతీ ఏడు మేము నిర్ధేశించుకున్న లక్ష్యాలు వాటిని చేరుకున్న తీరును మదింపు చేసుకుని వ్యూహాలు అమలు చేస్తుంటాం. అందులో భాగంగానే ఇండియా విషయంలో నిర్ణయం తీసుకుంటాం తప్పితే ప్రత్యేక కారణాలు ఏమీ లేవు’ అంటూ మెట్రో గ్లోబల్ హెడ్ జెర్డ్ కోస్లోవ్స్కీ అన్నారు. అక్కడ కూడా మెట్రో స్టోర్స్ అనేక దేశాల్లో ఉన్నాయి. అయితే గత కొంత కాలంగా ఆ సంస్థ పలు దేశాల్లో ఆశించిన మేరకు ఫలితాలు సాధించలేకపోయింది. దీంతో ఇప్పటికే రష్యా, జపాన్, మయన్నార్ల నుంచి వైదొలగింది. తాజాగా ఈ జాబితాలో ఇండియా కూడా చేరింది. చదవండి: ధన్యవాదాలు.. కానీ మేము ఆ పని ఇక్కడ చేయలేం.. -
ఆంధ్రప్రదేశ్‌లో మెట్రో మూడవ స్టోర్, ఎక్కడంటే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హోల్‌సేల్ వ్యాపార దిగ్గజం మెట్రో క్యాష్ అండ్ క్యారీ తాజాగా గుంటూరులో స్టోర్‌ను ఏర్పాటు చేసింది. 44,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇది నెలకొంది. 9,000 పైచిలుకు రకాల ఆహార, ఆహారేతర ఉత్పత్తులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో సంస్థకు ఇది మూడవ కేంద్రం కాగా, దేశవ్యాప్తంగా 30వ ఔట్లెట్. ఈ కేంద్రం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 500 మందికి ఉపాధి లభిస్తుందని కంపెనీ తెలిపింది. ఏపీలో ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో స్టోర్స్ ఉన్నాయి. దక్షిణాదిన కంపెనీ ఔట్లెట్ల సంఖ్య 14కు చేరుకుంది. దేశవ్యాప్తంగా 30 లక్షల పైచిలుకు కస్టమర్లు ఉన్నారు. -
బీజేపీలోకి మెట్రోమ్యాన్ ఆఫ్ ఇండియా
సాక్షి, న్యూఢిల్లీ : కేరళ అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న తరుణంలో కేంద్రంలోని అధికార బీజేపీ వడివడిగా అడుగులు వేస్తోంది. కమ్యూనిస్ట్ పాలనను అంతంచేసి.. దైవభూమిలో కాషాయ జెండాపాతాలని భావిస్తోంది. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటములకు చెరమగీతం పాడి కేరళలో పాగావేయాలని ఊవ్విళ్లూరుతోంది. దీనికి అనుగుణంగానే ప్రణాళికలు వేస్తోంది. దీనిలో భాగంగానే ప్రముఖ వ్యక్తులను, ఆర్థికంగా బలంగా ఉన్న పారిశ్రామికవేత్తలను పార్టీలోకి అహ్వానిస్తోంది. ఈ క్రమంలో మెట్రోమ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన శ్రీధరన్‌ను బీజేపీకి చేర్చుకునేందుకు కమళనాథులు సిద్ధమయ్యారు. రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న విజయ యాత్రలో భాగంగా శ్రీధరన్ పార్టీలో చేరతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేందరన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. పార్టీలో చేరేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. ఫ్రిబవరి 21న నుంచి కేరళలో విజయ యాత్ర ప్రాంభవుతున్న నేపథ్యంలో పార్టీని బలోపేతం చేయాలన్న కేంద్ర పెద్దల ఆదేశాల మేరకు ఆయన్ని ఆహ్వానించామని తెలిపారు. సురేందరన్ ప్రకటనపై స్పందించిన 89 ఏళ్ల మెట్రోమ్యాన్ శ్రీధరన్.. తాను బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో దశాబ్దాలుగా పాలన చేస్తున్న యూడీఎఫ్, ఎల్డీఎఫ్ కూటమికి విధానాలకు వ్యతిరేకంగా తాను బీజేపీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. రెండు పార్టీలూ సొంత లాభాల కోసమే అధికారంలోకి వస్తున్నాయని, ప్రజలను ఉద్దరించే ఏ ఒక్క కార్యక్రమం కూడా చేపట్టడంలేదని ఆరోపించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే కేరళ అభివృద్ధిపథంలో దూసుపోతుందనే నమ్మకం తనకుందన్నారు. కాగా 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలలో మరో ఐదునెలల్లో ఎన్నికలు జరుగనున్నాయి. 2016లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒకే చోట విజయం సాధించింది. ఈ సారి జరిగే ఎన్నికల్లో పార్టీ గణనీయమైన స్థానాల్లో విజయం సాధించి తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పట్టుదలతో ఉంది. ఇక 2011 డిసెంబర్ 21న ఢిల్లీ మెట్రో చీఫ్‌గా శ్రీధరన్ పదవీ విరమణ చేశారు. కొంకణ్ రైల్వే, ఢిల్లీ మెట్రోల నిర్మాణంలో ఆయన పాత్ర కీలకమైంది. భారతదేశంలో ప్రజా రవాణా ముఖాన్ని మార్చిన ఘనత శ్రీధరన్‌కే దక్కుతుంది. దేశంలో తొలి మెట్రో ప్రాజెక్ట్ అయిన కోల్‌కతా మెట్రో రైల్ రూపశిల్పి ఆయనే కావడంతో మెట్రోమ్యాన్‌గా గుర్తింపబడ్డారు. అంతేకాకుండా భారీప్రాజెక్టులు నత్తనడక నడిచే ఈ రోజుల్లో ఆయన తన క్రమశిక్షణతో మెట్రో ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేసి ఢిల్లీ నుంచి హర్యానా, యూపీ వరకూ దాదాపు అన్ని మార్గాల్లో మెట్రోను విస్తరించారు. దేశంలో చాలా రాష్ట్రాల్లో మెట్రో ప్రాజెక్టులకు ఆయన సలహాదారుడిగా వ్యవహరిస్తున్నారు. కీలక సర్వే: దీదీ హ్యాట్రికా.. కమల వికాసమా? -
ఆ ఇంటర్వ్యూతో నాకు సంబంధం లేదు
మెట్రో ఇండియా కథనంపై మైసూరారెడ్డి స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: ‘ఇక రాయలసీమ రాష్ట్రం కోసం పోరాటం’ అన్న శీర్షికన మెట్రో ఇండియా అనే ఆంగ్ల పత్రిక తనను ఇంటర్వ్యూ చేసినట్లుగా ప్రచురించిన వార్తతో తనకు ఏ మాత్రం సంబంధం లేదని వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి వెల్లడించారు. అసలు తాను ఆ పత్రికకు చెందిన ఏ విలేకరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఆ ఆంగ్ల పత్రికలో తనను ఇంటర్వ్యూ చేసినట్లుగా ప్రచురితమైన కథనాన్ని చూసి విస్మయం చెందానని, అందుకే వివరణ ఇవ్వాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఆ పత్రికకు చెందిన ఏ విలేకరీ తనను ఇంటర్వ్యూ చేయలేదని, తనతో మాట్లాడకుండానే అంత పెద్ద ఇంటర్వ్యూను ఎలా ప్రచురించిందో చెప్పాలని నిలదీశారు. తనను సంప్రదించకుండా ఆ కథనం ప్రచురించినందుకు ఆ పత్రిక క్షమాపణలు చెప్పాలని మైసూరారెడ్డి డిమాండ్ చేశారు -
నిజమైన కథనాలతో మీడియా విశ్వసనీయత కాపాడాలి
మీడియా నిజమైన కథనాలు మాత్రమే వెల్లడించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి శనివారం హైదరాబాద్‌లో అభిప్రాయపడ్డారు. దీని ద్వారా మీడియా విశ్వసనీయతను పరిరక్షించవచ్చని ఆయన పేర్కొన్నారు. శనివారం 'మెట్రో ఇండియా' ఆంగ్ల పత్రిక మొదటి సంచికను సీఎం కిరణ్ ఇక్కడ ఆవిష్కరించారు. ఆ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాజకీయాలు, బిజినెస్‌కు సంబంధించిన ఆసక్తికర కథనాలను సాధారణ వార్తలతో కలిపి వెల్లడించవద్దని భారతీయ జనతాపార్టీ సీనియర్ నాయకుడు ఎం.వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా మీడియాకు హితవు పలికారు. 'మెట్రో ఇండియా' ఇంటెర్నెట్ ఎడిషన్‌ను ఆయన ప్రారంభించారు. 'మెట్రో ఇండియా' ఆంగ్ల పత్రికను న్యూఢిల్లీ, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, నగరాల నుంచి ప్రచురించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆ పత్రిక చైర్మన్ సీ.ఎల్.రాజం వెల్లడించారు. సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి డి.కే.అరుణ, సీపీఎం పాలిట్ బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు, ఎంఐఎం చీఫ్ అసద్దుదీన్ ఓవైసీ, లోక్‌సత్తా పార్టీ అధినేత ఎన్.జయప్రకాశ్ నారాయణ, టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు, టీడీపీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
30న హైదరాబాద్‌కు దిగ్విజయ్‌సింగ్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్ ఈ నెల 30న హైదరాబాద్‌కు రానున్నారు. తెలంగాణపై పార్టీ వర్కింగ్ కమిటీ ఏకగ్రీవ తీర్మానం, దానికి వ్యతిరేకంగా సీమాంధ్రలో ఉవ్వెత్తున కొనసాగుతున్న సమైక్య ఉద్యమం నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై ఆయన సమీక్షించనున్నారు. ఇరుప్రాంతాల నేతలతోనూ ఆయన వేర్వేరుగా భేటీ కానున్నారు. ఇరు ప్రాంతాల్లో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏం చేయాలి? ప్రస్తుత పరిస్థితుల నుంచి పార్టీని ఏ విధంగా గట్టెక్కించాలన్న అంశాలపై ఆయన పార్టీ నేతలతో చర్చించనున్నారని తెలుస్తోంది. 30వ తేదీ సాయంత్రం హైదరాబాద్ చేరుకునే దిగ్విజయ్ 31న హైదరాబాద్ కేంద్రంగా వెలువడనున్న ‘మెట్రో ఇండియా’ అనే ఆంగ్ల దినపత్రిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నా రు. ఈ ప్రైవేటు కార్యక్రమంతో పాటు పార్టీ వ్యవహారాలపైనా ఆయన ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.