![Tremendous Discipline Seen Among the Passengers in Chinas Metro](/styles/webp/s3/article_images/2024/05/12/china.jpg.webp?itok=jWbW0ge4)
మన దేశంలోని పలు నగరాల్లో మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉన్నాయి. మెట్రో రైలు ప్రయాణానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వీటిలో ఒకరిని ఒకరు తోసుకుంటూ మెట్రోలోనికి ఎక్కడం లాంటి వీడియోలను మనం చూసే ఉంటాం. అయితే ఇలాంటి తీరుకు భిన్నమైన వీడియోను చూసిన చాలామంది తెగ ఆశ్యర్యపోతున్నారు. ఎంతో క్రమశిక్షణతో మెట్రో ఎక్కుతున్నవారిని చూసి ముచ్చట పడిపోతున్నారు.
ఈ వీడియో చైనాలోని మెట్రోకు సంబంధించినది. వీడియోలో మెట్రో స్టేషన్‌లో రద్దీ అధికంగా ఉండటాన్ని మనం గమనించవచ్చు. అయితే అక్కడున్నవారంతా వరుసలో నిలుచుని, తమ వంతు వచ్చిన తరువాతనే మెట్రో లోనికి ఎక్కుతున్నారు. ఏమాత్రం తొందరపాటు లేకుండా క్రమశిక్షణ పాటిస్తూ రైలు ఎక్కుతున్నారు. రైలు ప్రయాణికుల క్రమశిక్షణను చూసినవారంతా మెట్రోలోకి ఇలా ఎక్కితో ఎంతో హాయిగా ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారం ఎక్స్‌లో @RVCJ_MEDIA పేరుతో షేర్ చేశారు. ఈ వీడియోకు లక్షకు మించిన వ్యూస్ దక్కాయి. వేయిమందికిపైగా యూజర్స్ దీనిని లైక్ చేశారు.
Scenes From China 😯pic.twitter.com/hetaLNXA9U
— RVCJ Media (@RVCJ_FB) May 9, 2024
Comments
Please login to add a commentAdd a comment