ఆరు నెలల్లో ఆరు ఆత్మహత్యా ఘటనలు
నమ్మ మెట్రో సిబ్బంది నిర్లక్ష్యంపై ప్రయాణికుల ఆగ్రహం
ప్లాట్‌ఫారం స్క్రీన్ డోర్‌లు ఏర్పాటు చేయాలని డిమాండ్
సాక్షి బెంగళూరు: నమ్మ మెట్రో రైల్వే స్టేషన్లు సూసైడ్ హాట్‌స్పాట్లుగా మారుతున్నాయి. గడిచిన ఆరు నెలల్లో మెట్రో రైల్వే స్టేషన్లలో ఆరుగురు ఆత్మహత్య చేసుకున్నారు. పదేపదే మెట్రో ట్రాక్‌లపైకి దిగే ప్రయాణికుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. అయినప్పటికీ మెట్రో అధికారులు మాత్రం అవసరమైన భద్రత వ్యవస్థ కలి్పంచడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారని నగర వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మెజిస్టిక్ మెట్రో స్టేషన్‌లో మాత్రమే బీఎంఆర్‌సీఎల్ సెక్యురిటీలు అలర్ట్ అవుతున్నారు. మిగిలిన చోట్ల భద్రత సిబ్బంది నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో భద్రతా నిర్లక్ష్యం కారణంగా మెట్రో రైల్వే పట్టాలపై ఆత్మహత్య కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీ, చెన్నై మెట్రోలల్లో పీఎస్డీ (ప్లాట్‌ఫారం స్క్రీన్ డోర్‌లు) అమర్చడం వల్ల అక్కడ అలాంటి ఘటనలకు తావులేకుండా ఉంది.
అయితే నమ్మ మెట్రోలో అలాంటి చర్యలు ఇంతవరకు చేపట్టకపోవడం దురదృష్టకరం. దీంతో ప్రమాదాలు రోజురోజుకి ఎక్కువవుతున్నాయి. ఐటీ సిటీ బెంగళూరులో నమ్మ మెట్రో సేవలు ప్రారంభమై సుమారు 13 ఏళ్లు గడిచినా ఇప్పటివరకు పట్టాలపై ఎలాంటి రక్షణ లేకపోవడంతో ప్రయాణికుల రక్షణకు భద్రత కరువైంది. కొంతమంది ఉదాసీనంగా పట్టాలపై పడిపోతుండడం, మరికొంత మంది ఉద్ధేశపూర్వకంగా ఆత్మహత్య చేసుకునేందుకు నమ్మ మెట్రో పట్టాలను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో గడిచిన ఆరు నెలల్లో ఆరుగురు మెట్రో రైల్వే స్టేషన్లలో పట్టాలపైకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment