30న హైదరాబాద్‌కు దిగ్విజయ్‌సింగ్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్ ఈ నెల 30న హైదరాబాద్‌కు రానున్నారు. తెలంగాణపై పార్టీ వర్కింగ్ కమిటీ ఏకగ్రీవ తీర్మానం, దానికి వ్యతిరేకంగా సీమాంధ్రలో ఉవ్వెత్తున కొనసాగుతున్న సమైక్య ఉద్యమం నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై ఆయన సమీక్షించనున్నారు. ఇరుప్రాంతాల నేతలతోనూ ఆయన వేర్వేరుగా భేటీ కానున్నారు. ఇరు ప్రాంతాల్లో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏం చేయాలి? ప్రస్తుత పరిస్థితుల నుంచి పార్టీని ఏ విధంగా గట్టెక్కించాలన్న అంశాలపై ఆయన పార్టీ నేతలతో చర్చించనున్నారని తెలుస్తోంది.
30వ తేదీ సాయంత్రం హైదరాబాద్ చేరుకునే దిగ్విజయ్ 31న హైదరాబాద్ కేంద్రంగా వెలువడనున్న ‘మెట్రో ఇండియా’ అనే ఆంగ్ల దినపత్రిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నా రు. ఈ ప్రైవేటు కార్యక్రమంతో పాటు పార్టీ వ్యవహారాలపైనా ఆయన ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.