
సాక్షి, సిటీబ్యూరో: మహా నగరానికి తాగునీరు సరఫరా చేసే సింగూరు 3, 4 ఫేజ్‌లకు విద్యుత్ సరఫరా చేసే 132 కేవీ పెద్దాపూర్, కంది సబ్ స్టేషన్లలో మరమ్మతు పనుల నేపథ్యంలో ఈ నెల 4న గురువారం ఉదయం 7 గంటల నుంచి మరుసటి రోజు శుక్రవారం ఉదయం ఏడు గంటల వరకు పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని జలమండలి ఒక ప్రకటనలో తెలిపింది. 24 గంటల పాటు షేక్‌పేట్, జూబ్లీహిల్స్, సోమాజిగూడ, బోరబండ, మూసాపేట్, నల్లగండ్ల, చందానగర్, హుడా కాలనీ, హఫీజ్‌పేట్, మణికొండ, నార్సింగి, మంచిరేవుల, తెల్లాపూర్ తదితర ప్రాంతాల్లో పూర్తిగా అంతరాయం, భోజగుట్ట రిజర్వాయర్, బంజారా, ఎర్రగడ్డ, కేపీహెచ్‌బీ, హైదర్‌నగర్ తదితర ప్రాంతాల్లో లో–ప్రెజర్‌తో నీటి సరఫరా జరగుతుందని పేర్కొంది. అంతరాయం ఏర్పడే ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని జలమండలి సూచించింది.