
దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఐదు దశల ఎన్నికలు ఇప్పటికే ముగియగా, ఇంకా మరో రెండు దశల ఎన్నికలు మిగిలివున్నాయి. ఈ క్రమంలో మే 25న ఢిల్లీలో ఆరో దశలో ఎన్నికలు జరగనున్నాయి.
ఈ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సామాన్య ప్రజలకు చేరువయ్యేందుకు ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. రాహుల్ గాంధీ మెట్రోలో ప్రయాణిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తున్న రాహుల్ గాంధీ సామాన్య ప్రజలతో మమేకమై, వారితో ఫొటోలు కూడా దిగారు. రాహుల్ గాంధీ ఢిల్లీ మెట్రోలో మంగోల్‌పురిలో జరిగే ర్యాలీకి బయలుదేరారు. ఆయనతో పాటు ఈశాన్య ఢిల్లీ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్ కూడా ఉన్నారు. ఢిల్లీలో మే 25వ తేదీన ఓటింగ్ జరగనుంది.