![ఆ ఇంటర్వ్యూతో నాకు సంబంధం లేదు - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/71447214143_625x300.jpg.webp?itok=0_2WCha9)
ఆ ఇంటర్వ్యూతో నాకు సంబంధం లేదు
మెట్రో ఇండియా కథనంపై మైసూరారెడ్డి స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: ‘ఇక రాయలసీమ రాష్ట్రం కోసం పోరాటం’ అన్న శీర్షికన మెట్రో ఇండియా అనే ఆంగ్ల పత్రిక తనను ఇంటర్వ్యూ చేసినట్లుగా ప్రచురించిన వార్తతో తనకు ఏ మాత్రం సంబంధం లేదని వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి వెల్లడించారు. అసలు తాను ఆ పత్రికకు చెందిన ఏ విలేకరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఆ ఆంగ్ల పత్రికలో తనను ఇంటర్వ్యూ చేసినట్లుగా ప్రచురితమైన కథనాన్ని చూసి విస్మయం చెందానని, అందుకే వివరణ ఇవ్వాల్సి వస్తోందని పేర్కొన్నారు.
ఆ పత్రికకు చెందిన ఏ విలేకరీ తనను ఇంటర్వ్యూ చేయలేదని, తనతో మాట్లాడకుండానే అంత పెద్ద ఇంటర్వ్యూను ఎలా ప్రచురించిందో చెప్పాలని నిలదీశారు. తనను సంప్రదించకుండా ఆ కథనం ప్రచురించినందుకు ఆ పత్రిక క్షమాపణలు చెప్పాలని మైసూరారెడ్డి డిమాండ్ చేశారు