maisura reddy
-
ఆ ఇంటర్వ్యూతో నాకు సంబంధం లేదు
మెట్రో ఇండియా కథనంపై మైసూరారెడ్డి స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: ‘ఇక రాయలసీమ రాష్ట్రం కోసం పోరాటం’ అన్న శీర్షికన మెట్రో ఇండియా అనే ఆంగ్ల పత్రిక తనను ఇంటర్వ్యూ చేసినట్లుగా ప్రచురించిన వార్తతో తనకు ఏ మాత్రం సంబంధం లేదని వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి వెల్లడించారు. అసలు తాను ఆ పత్రికకు చెందిన ఏ విలేకరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఆ ఆంగ్ల పత్రికలో తనను ఇంటర్వ్యూ చేసినట్లుగా ప్రచురితమైన కథనాన్ని చూసి విస్మయం చెందానని, అందుకే వివరణ ఇవ్వాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఆ పత్రికకు చెందిన ఏ విలేకరీ తనను ఇంటర్వ్యూ చేయలేదని, తనతో మాట్లాడకుండానే అంత పెద్ద ఇంటర్వ్యూను ఎలా ప్రచురించిందో చెప్పాలని నిలదీశారు. తనను సంప్రదించకుండా ఆ కథనం ప్రచురించినందుకు ఆ పత్రిక క్షమాపణలు చెప్పాలని మైసూరారెడ్డి డిమాండ్ చేశారు -
ఏకపక్ష నిర్ణయం వద్దు
రాజధానిపై అఖిలపక్ష సమావేశం అభిప్రాయం హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు విషయంలో అన్ని పక్షాలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని అఖిల పక్ష సమావేశం అభిప్రాయపడింది. ఏపీ రాజధాని ఏర్పాటుపై సిటిజన్స్ ఫోరం శనివారం హైదరాబాద్‌లో అఖిల పక్ష సమావేశం నిర్వహించింది. ఏకపక్షంగా, ఏ కొందరికో ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలు చేయడంవల్ల భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని సమావేశం హెచ్చరించింది. ఈ సమావేశంలో ఫోరం ప్రతినిధులు, పలు పార్టీల నేతలు హాజరై అభిప్రాయాలను వ్యక్తీకరించారు. ఎం.వి. మైసూరారెడ్డి( వైఎస్సార్ సీపీ) : రాజధాని ఏర్పాటుపై అన్ని పార్టీలతో చర్చించాకే నిర్ణయం తీసుకోవాలి. ఒంటెత్తుపోకడలతో ముందుకెళ్లడం రాష్ట్ర అభివృద్ధికి మంచిది కాదు. ప్రభుత్వ భూములు ఎక్కువ ఉన్నచోటే రాజధాని నిర్మాణం చేపట్టాలి. సి.రామచంద్రయ్య (కాంగ్రెస్): విభజన వల్ల ఏ ప్రాంతానికి అన్యాయం జరిగిందో అక్కడే రాజధాని నిర్మాణం చేపట్టాలి. గడికోట శ్రీకాంత్‌రెడ్డి( వైఎస్సార్సీపీ): గతంలో రాజధానిని కోల్పోయిన కర్నూలును పరిగణలోకి తీసుకోవాలి. ఈ ప్రాంత అభివృద్ధికి ఎటువంటి ఒప్పందాలు చేసుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం తగదు. చింతామోహన్, మాజీ ఎంపీ : కాంగ్రెస్ అధికారంలో ఉంటే తిరుపతిని రాజధానిగా ఎంపిక చేసేవారు. సి.ఆంజనేయరెడ్డి, మాజీ ఐపీఎస్ అధికారి: రాజధాని కర్నూలులోనే ఏర్పాటు చేయాలి. లేకుంటే ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్న ప్రకాశం జిల్లా దొనకొండ పరిసర ప్రాంతాలను ఎంపిక చేయాలి. జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి, రిటైర్డ్ న్యాయమూర్తి: అన్నింటా అన్యాయానికి గురవుతున్నామని రాయలసీమ వాసుల్లో ఆవేదన ఉంది. అందుకే రాజధాని ఎంపికపై ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవద్దు. హన్మంతరెడ్డి, సిటిజన్స్ ఫోరం: శ్రీబాగ్ ఒప్పందం మేరకు సీమలోనే రాజధాని ఏర్పాటు చేయాలి. వీఎల్‌ఎన్‌రెడ్డి, నిపుణుడు: దొనకొండ ప్రాంతంలో 68,741 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. 14 కిలోమీటర్ల దూరంలో నాగార్జున సాగర్ కుడి కాల్వ, 25 కిలోమీటర్ల పరిధిలో వెలిగొండ ప్రాజెక్టులు ఉన్నాయి. జీఆర్ రెడ్డి, సిటిజన్స్ ఫోరం: రాష్ట్ర విభ జించే సమయంలో సమన్యాయం పాటించలేదని విమర్శిస్తున్న చంద్రబాబు రాజధాని ఏర్పాటు విషయంలో మాత్రం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు. -
అలా చేస్తే.. సింగపూర్ కలలు కల్లలే..
-
నెల్లూరు చైర్మన్ ఎన్నిక వాయిదా!
-
'ఇంతకంటే అప్రజాస్వామికం మరోటి లేదు'
-
ఎటు పోతున్నాయి ప్రజాస్వామ్య విలువలు?
-
'ఆ టీడీపీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేయండి'
-
'ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేయమని కోరతాం'
-
'రాష్ట్రపతి పాలనను విధించమని కోరతాం'
-
వైఎస్సార్సీపీ విప్ వంద శాతం చెల్లుతుంది
మైసూరా, అంబటి స్పష్టీకరణ హైదరాబాద్ : జూలై 3, 4, 5 తేదీల్లో జరిగే ‘స్థానిక’ పరోక్ష ఎన్నికలు పురస్కరించుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జారీ చేసే విప్ నూ టికి నూరు శాతం చెల్లుతుందని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యు డు ఎంవీ మైసూరారెడ్డి, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఈ విషయంలో టీడీపీ నేతల మాటలు, చేస్తున్న ప్రచారం అభూత కల్పనలని వారు పేర్కొన్నారు. విప్ ఉల్లంఘించే సభ్యులపై వేటు తప్పదని హెచ్చరించారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద వారు మీడియాతో వేర్వేరుగా మాట్లాడారు. వైఎస్సార్సీపీ తరఫున ఎన్నికైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లను అనైతికంగా తన వైపునకు తిప్పుకునేందుకు టీడీపీ రాజకీయ దిగజారుడుతనానికి పాల్పడుతోందని మైసూరా, అంబటి మండిపడ్డారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తన (27.06.2014) నోటిఫికేషన్లో సైతం వైఎస్సార్ సీపీని రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన పార్టీగా పేర్కొన్నందున.. విప్ చెల్లుతుందని వారు తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులకు విప్ వర్తించదు: సోమిరెడ్డి నెల్లూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరుపున గెలుపొందిన ప్రజాప్రతినిధులకు ఆ పార్టీ జారీ చేసే విప్ వర్తించదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం నెల్లూరులో విలేకరులతో మాట్లాడారు. స్థానిక ఎన్నికలు జరిగే నాటికి వైఎస్సార్ కాంగ్రెస్ ఎన్నికల కమిషన్‌లో రిజిస్టర్డ్ పార్టీ మాత్రమేనని, ఎన్నికలు ముగిశాకే ఆ పార్టీకి గుర్తింపు లభించిందని తెలిపారు. -
'ఇదేనా చంద్రబాబు నైతికత..?'
-
'దేవాలయాల పరిరక్షణను మేనిఫెస్టోలో చేర్చండి'
హైదరాబాద్ : హిందూ దేవాలయాల పరిరక్షణ, అర్చకుల సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రస్తావిస్తామని ఆపార్టీ సీనియర్ నేత మైసూరారెడ్డి తెలిపారు. దేవాదాయ, ధర్మాదాయ చట్టాన్ని అమలు చేస్తామని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అర్చక సమాఖ్య ప్రతినిధుల హామీని...పరిగణలోకి తీసుకున్నామని మైసూరారెడ్డి తెలిపారు. అంతకు ముందు ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య ప్రతినిధుల బృందం శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మ్యానిఫెస్టో కమిటీ ప్రతినిధులను కలిశారు. ఈ సందర్భంగా వారు దేవాదాయ, ధర్మాదాయ చట్టం అమలును...వైఎస్ఆర్ సీపీ మ్యానిఫెస్టోలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ చట్టాన్ని అమలు చేశారని ఏపీ అర్చక సమాఖ్య ఉపాధ్యక్షుడు సౌందర రాజన్ గుర్తు చేశారు.