కోల్‌కతా : మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు మద్యంతర బెయిల్ ఇచ్చింది. సుప్రీం కోర్టు కేజ్రీవాల్‌కు అనుకూలంగా తీర్పు ఇవ్వడంపై ఇండియా కూటమి నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముందు సుప్రీం బెయిల్ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నారు.
కేజ్రీవాల్‌కు జూన్ 1 వరకు మద్యంతర బెయిల్ ఇస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు అనంతరం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎక్స్ వేదికగా స్పందించారు.
ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల సమయంలో కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు మద్యంతర బెయిల్ ఇవ్వడం తమకు ఉపకరిస్తుందని దీదీ అన్నారు. అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ లభించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ప్రస్తుత ఎన్నికల సందర్భంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని ఆమె ఎక్స్‌లో పోస్ట్‌లో పేర్కొన్నారు.
మద్యం పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు శుక్రవారం సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 1 వరకు ఆయనకు బెయిల్ వర్తించనుంది. అప్పటి వరకు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనవచ్చు. అయితే సీఎం హోదాలో ఎలాంటి ఫైళ్లపై అధికార సంతకాలు చేయకూడదని సుప్రీంకోర్టు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment