కోల్‌కతా : బీజేపీ డబ్బులతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తోందంటూ పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఆరంబాగ్‌లో పార్టీ అభ్యర్ధి మితాలీ బాగ్‌కు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ.. రూ.5,000, రూ.10,000, రూ.15,000 వరకు డబ్బులు చెల్లించి బీజేపీ ఓట్లను కొనుగోలు చేస్తోందని అన్నారు.
తమపై తప్పుడు ప్రచారం చేసేలా మహిళలకు బీజేపీ డబ్బులిచ్చి ఉసిగొల్పిందని, సందేశ్‌ఖాలీలోని మహిళల పరువును ఎలా తీసిందో మీరో చూడండి అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని 26 వేల మంది టీచర్ల ఉద్యోగాలను బీజేపీ లాక్కుందని, సుప్రీం కోర్టు తీర్పుతో నిజం గెలిచిందని సంతోషం వ్యక్తం చేశారు.
100 రోజుల పనికి సంబంధించిన డబ్బును మా పార్టీ దొంగిలించిందని మోదీ అంటున్నారు. అవన్ని అవాస్తవాలే. రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల పని కింద రూ. 24 కోట్లు ఆదా చేసిందని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment