అత్యంత సుందరమైన ప్రకృతి దృశ్యాలకు భారతదేశం నిలయం. ఏ ప్రదేశానికైన సదరాగా వెళ్లే..అక్కడ పేరు గాంచిని జలపాతాలు, ప్రకృతి తదితరాలు ఆకర్షణీయంగా ఉంటాయి. అవేగాక ఇంకేమైన ప్రసిద్ధిగాంచిన ఉంటే చూసి అబ్బురపడతాం. అలా కాకుండా పయనించే మార్గమే అత్యంత రమణీయంగా ఉండే రహదారి గురించి విన్నారా. ఔను మీరు వింటుంది నిజమే..ఈ దారిలో నుంచి పయనిస్తే స్వర్గంలో విహరిస్తున్నంత ఫీల్ కలుగుతుందట. ఇంతకీ ఆ రహదారి ఎక్కడంటే..
గుజరాత్‌లోని కచ్‌లో ఉన్న రహదారిని రోడ్ టు హెవెన్‌గా పిలుస్తారు. కచ్ రాజధాని భుజ్ నుంచి ధోలావిరాకు దూరం 240 కిలోమీటర్లు. దీన్ని తగ్గించడానికి 2019లో ఖవ్దానుంచి ధోలవీరాను కలుపుతూ రాన్ రహదారిని ప్రారంభించారు. ఈ 30 కిలో మీటర్ల విస్తీరణ 2024లో ప్రారంభించారు. సరిగ్గా జీ20 సమ్మిట్ సమయానికి ప్రారంభమయ్యింది. ఇది హరప్పా నాగరికత అవశేషాలకు నిలయం.
అలాంటి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఖవ్దా నుంచి దోలవీర వరకు వన్ వేల లేన్ ఈ రహదారి. దీన్ని డ్రోన్ సాయంతో చూస్తే భారతదేశంలో ది బెస్ట్ రోడ్డు రహదారి ఇదే అనిపిస్తుంది. ఈ రహదారి ఘదులి నుంచి సంతాల్‌పూర్ వరకు 278 కి.మీ పొడవైన జాతీయ రహదారిలో భాగం. తెల్లటి ఎడారి గుండే సాగే జర్నీ. ఈ రాన్ రహదారి ఒకప్పుడూ అరేబియా సముద్ర నిస్సార భాదం. భౌగోళిక మార్పుల వల్ల సముంద్రంతో సంబంధాన్ని మూసివేయడంతో అది నేడు తెల్లటి ఉప్పు ఏడారిగా కనిపిస్తోంది. ఈ మార్గం ధోలవిరాకు వెళ్లేలా ఎక్కువమంది ప్రయాణికులును ఆకర్షిస్తుంది.
ఇక్కడ ఈ ధోలవీర అనేది రాన్ ఆఫ్ కచ్ పరిధిలో ఉన్న పురాతన హరప్పా నగరం. బాగా సంరక్షింపబడినఈ పురావస్తు ప్రదేశం సింధూలోయ నాగరికతను మను మందు ప్రస్ఫుటం అయ్యేలా హైలెట్ ఉంటుంది. ఇక్కడ నాటి చరిత్రకు ఆలవలం అయిన కోట గోడలు, ధాన్యాగారం, నివాస ప్రాంతాలు, ఈ పురాతన సంస్కృతి పట్టణ ప్రణాళిక,సామాజిక నిర్మాణంపై విలువైన అంతర్దృష్టులను అందిస్తుంది. ఈ ధోలవీరతో గుజరాత్ పురావస్తు పర్యాటకాన్ని ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
(చదవండి: ఈసారి దసరా వెకేషన్‌కి కుట్రాలం టూర్..!)
Comments
Please login to add a commentAdd a comment