single line road
-
అత్యంత అందమైన రహదారి 'రోడ్ టు హెవెన్'..!
అత్యంత సుందరమైన ప్రకృతి దృశ్యాలకు భారతదేశం నిలయం. ఏ ప్రదేశానికైన సదరాగా వెళ్లే..అక్కడ పేరు గాంచిని జలపాతాలు, ప్రకృతి తదితరాలు ఆకర్షణీయంగా ఉంటాయి. అవేగాక ఇంకేమైన ప్రసిద్ధిగాంచిన ఉంటే చూసి అబ్బురపడతాం. అలా కాకుండా పయనించే మార్గమే అత్యంత రమణీయంగా ఉండే రహదారి గురించి విన్నారా. ఔను మీరు వింటుంది నిజమే..ఈ దారిలో నుంచి పయనిస్తే స్వర్గంలో విహరిస్తున్నంత ఫీల్ కలుగుతుందట. ఇంతకీ ఆ రహదారి ఎక్కడంటే..గుజరాత్‌లోని కచ్‌లో ఉన్న రహదారిని రోడ్ టు హెవెన్‌గా పిలుస్తారు. కచ్ రాజధాని భుజ్ నుంచి ధోలావిరాకు దూరం 240 కిలోమీటర్లు. దీన్ని తగ్గించడానికి 2019లో ఖవ్దానుంచి ధోలవీరాను కలుపుతూ రాన్ రహదారిని ప్రారంభించారు. ఈ 30 కిలో మీటర్ల విస్తీరణ 2024లో ప్రారంభించారు. సరిగ్గా జీ20 సమ్మిట్ సమయానికి ప్రారంభమయ్యింది. ఇది హరప్పా నాగరికత అవశేషాలకు నిలయం. అలాంటి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఖవ్దా నుంచి దోలవీర వరకు వన్ వేల లేన్ ఈ రహదారి. దీన్ని డ్రోన్ సాయంతో చూస్తే భారతదేశంలో ది బెస్ట్ రోడ్డు రహదారి ఇదే అనిపిస్తుంది. ఈ రహదారి ఘదులి నుంచి సంతాల్‌పూర్ వరకు 278 కి.మీ పొడవైన జాతీయ రహదారిలో భాగం. తెల్లటి ఎడారి గుండే సాగే జర్నీ. ఈ రాన్ రహదారి ఒకప్పుడూ అరేబియా సముద్ర నిస్సార భాదం. భౌగోళిక మార్పుల వల్ల సముంద్రంతో సంబంధాన్ని మూసివేయడంతో అది నేడు తెల్లటి ఉప్పు ఏడారిగా కనిపిస్తోంది. ఈ మార్గం ధోలవిరాకు వెళ్లేలా ఎక్కువమంది ప్రయాణికులును ఆకర్షిస్తుంది. ఇక్కడ ఈ ధోలవీర అనేది రాన్ ఆఫ్ కచ్ పరిధిలో ఉన్న పురాతన హరప్పా నగరం. బాగా సంరక్షింపబడినఈ పురావస్తు ప్రదేశం సింధూలోయ నాగరికతను మను మందు ప్రస్ఫుటం అయ్యేలా హైలెట్ ఉంటుంది. ఇక్కడ నాటి చరిత్రకు ఆలవలం అయిన కోట గోడలు, ధాన్యాగారం, నివాస ప్రాంతాలు, ఈ పురాతన సంస్కృతి పట్టణ ప్రణాళిక,సామాజిక నిర్మాణంపై విలువైన అంతర్దృష్టులను అందిస్తుంది. ఈ ధోలవీరతో గుజరాత్ పురావస్తు పర్యాటకాన్ని ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకుంది.(చదవండి: ఈసారి దసరా వెకేషన్‌కి కుట్రాలం టూర్..!) -
అనుమతి.. అదే గతి!
గద్వాల, న్యూస్‌లైన్: ఎన్నో ఏళ్లనాటి సమస్యలవి..నేటికీ వాటికి పరిష్కారం లభించడం లేదు. ప్రజల కష్టాలకు ప్రభుత్వం స్పందించినా ఫలితం లేకుండా పోయింది. నిధులు విడుదల చేసినా అందుకుతగ్గ అనమతులు నేటికీ రాలేదు. ఓ వైపు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటం.. మరోవైపు సమైక్య ఉద్యమం అభివృద్ధి పనులపై తీవ్ర ప్రభావం చూపింది. అధికారులు సమ్మెలో ఉండటంతో సంబంధిత ఫైళ్లకు మోక్షం కలగలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరో రెండు నెలల పాటు వీటిని పట్టించుకోకపోతే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చేదాకా ఎదురు చూడాల్సిందే. సమస్యలివీ.. గద్వాల నియోజకవర్గం పరిధిలోని కృష్ణానది మధ్యలో జీవనం కొనసాగిస్తున్న ప్రజలకు బ్రిడ్జి నిర్మించాలని ప్రభుత్వం 2009 జనవరిలో మంజూరు ఇచ్చింది. అయితే నేటికీ సర్వేలు పూర్తి కాలేదు. కృష్ణానది మధ్యలో ఉన్న గుర్రంగడ్డ దీవి ప్రజలకు రవాణా కల్పించాలనే లక్ష్యంతో 2009 జనవరిలో రోప్‌వే బ్రిడ్జికి మంజూరైంది, గత ఏడాది క్రితం రోప్‌వే బ్రిడ్జి కాకుండా కాజ్వే బ్రిడ్జి నిర్మాణం చేస్తే ఎలా ఉంటుందనే దానిపై సర్వేలు చేశారు. చివరకు మూడో ప్రతిపాదనగా నదిలో పిల్లర్స్‌ను ఏర్పాటు చేసి సింగిల్ లైన్ రోడ్డు బ్రిడ్జి నిర్మాణానికి తుది రూపు ఇచ్చారు. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంది. దీనికి సంబంధించిన ఫైల్ ఈఎన్సీ కార్యాలయంలో పెండింగ్‌లో ఉంది. గద్వాల మండల పరిధిలో కృష్ణానది మధ్యలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన గుర్రంగడ్డ దీవి 2100 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ దీవిలో దాదాపు 150 కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నాయి. కృష్ణానది నీటిని పొలాలకు తరలించి 850 ఎకరాల్లో మాగాణి పంటలను పండిస్తూ, దిగుబడిని బయటి ప్రాంతాలకు తరలించలేక వేసవి వరకు ఎదురు చూడాల్సి వస్తోంది. మార్చిలో పేబ్బేరు వైపున నది పాయ తగ్గాక ట్రాక్టర్లలో పంట ఉత్పత్తులను గద్వాల, ఇతర ప్రాంతాల వ్యవసాయ మార్కెట్లకు తరలించి అమ్ముకుంటున్నారు. పెండింగ్‌లో గట్టు లిఫ్టు ఫైల్... కృష్ణానదిపై జూరాల ప్రాజెక్టును గద్వాల డివిజన్‌లోనే నిర్మించినప్పటికీ ఈ ప్రాంతంలో కేవలం 37వేల ఎకరాల ఆయకట్టు మాత్రమే ఉంది. దీంతో నడిగడ్డను సస్యశ్యామలం చేసేందుకు నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాన్ని రెండు లక్షల ఎకరాల ఆయకట్టు సామర్థ్యంతో చేపట్టారు. ఈ పథకం ద్వారా కూడా అత్యంత వెనుకబడిన గట్టు మండల ప్రాంతానికి సాగునీరు అందని పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యను కూడా పరిష్కరించి మరో మినీ ఎత్తిపోతల ద్వారా గట్టుకు సాగునీటిని అందించాలన్న ప్రతిపాదన మేరకు ఇప్పటికే జూరాల అదికారులు ప్రాథమిక సర్వే చేశారు. ఈ సర్వే నివేదికను ప్రభుత్వానికి గతంలో పంపారు. ఇదీ లక్ష్యం.. ర్యాలంపాడు రిజర్వాయర్‌కు పడమర వైపున ఆలూరు గ్రామ శిశారులో రిజర్వాయర్ వద్ద ఇన్‌టేక్ వెల్‌ను నిర్మిస్తారు. అక్కడ కేవలం 0.3 మెగావాట్ విద్యుత్ వినియోగంతో నడిచే పంపింగ్ మోటారు ఏర్పాటు చేసి అక్కడి నుంచి గట్టు మండలలోని మల్లాపురం తాండ పక్కన ఉన్న గజ్జెలమ్మగుట్టపైకి నీటిని పంపింగ్ చేయాలన్నది ప్రతిపాదన. గుట్టపై నుంచి మండలంలోని చెరువులు, కుంటలకు నీళ్లు గ్రావిటిఫ్లో ద్వార వెళ్లేలా కాలువలను తవ్యుతారు. ఇలా మండలంలోని దాదాపు 30 నుంచి 40 చెరువుల కుంటలను నీటితో నింపుతారు. వీటితో పాటు లిప్టు ద్వార అదనంగా 3500 ఎకరాలకు సాగునీరు అందాలన్నది లక్ష్యం.