Brain activity
-
Health: డొక్క శుద్ధి.. బుర్రకు బుద్ధి!
బలమైన అభిప్రాయాన్ని చెప్పేటప్పుడు ‘గట్ ఫీలింగ్’ అంటుంటారు. అభిప్రాయాలూ, ఆలోచనలు కలగడం మెదడు పని కాబట్టి ఆ మాట మెదడునూ సూచిస్తుంది. గట్ అనే కడుపు (జీర్ణాశయ) భాగాన్ని మెదడుకు ముడిపెట్టే మాటలు ఎందుకోగానీ తెలుగులోనూ చాలానే ఉన్నాయి. ఉదాహరణకు... ‘కడుపులోంచి దుఃఖం తన్నుకువస్తోంది’... ‘కడుపులో ఎంత బాధ దాచుకున్నాడో’... ‘కడుపులో పెట్టుకుని చూసుకుంటాడు’... ‘ఆ అమ్మకడుపు చల్లగా’... వంటి ప్రయోగాలతో పాటు, నేర్పు, విద్యకు సంబంధించి... చదువు, లెక్కలు వంటివి వస్తే ‘డొక్కశుద్ధి’ ఉందనీ, విద్య లేకపోతే ‘పొట్టకోస్తే అక్షరం ముక్క రాద’నీ... ఇలా ఎన్నో. జీర్ణవ్యవస్థకూ, మెదడు చేసే పనులకూ ప్రత్యక్ష పరోక్ష సంబంధాలతో పాటూ కడుపు ఆరోగ్యం బాగుంటేనే మెదడు ఆలోచనలూ, పూర్తి ఆరోగ్యమూ బాగుటుందని ఆధునిక వైద్యనిపుణులూ పేర్కొంటున్నారు. ఆ ఉదాహరణలను చూద్దాం..కడుపు–మెదడు కనక్షన్ ఇలా..– కడుపు ఖాళీ అవ్వగానే ఖాళీ అయ్యిందంటూ కడుపు మెదడుకు చెబుతుంది. మెదడు ‘గ్రెలిన్’ అనే హార్మోన్ విడుదల చేయగానే ఆకలేస్తుంది – కడుపు నిండగానే ‘జీఎల్పీ–1’ అనే మరో హార్మోన్ విడుదలై ఇక భోజనం చాలనిపిస్తుంది.– తిన్న వెంటనే పేగులకు రక్త ప్రసరణ పెరుగుతుంది.అందుకే తిన్న వెంటనే మందకొడిగా, స్థబ్దంగా మారడానికి ఈ కనెక్షనే కారణం.– ఒత్తిడికీ, లేదా ఆందోళనకూ లోనైనప్పుడు పెద్ద మెదడు నుంచి భిన్నమైన సిగ్నళ్లు వెలువడి రెండో మెదడులా పనిచేసే గట్ బ్రెయిన్ ప్రభావితమవుతుంది.ఇలా ఎందుకు జరుగుతుందంటే..మెడడు నుంచి వేగస్ నర్వ్ ద్వారా న్యూరోట్రాన్స్ మీటర్లు పేగులకు వెళ్తాయి. వేగస్ నాడి మెదడుకు కడుపునకూ (గట్కూ) మధ్య టెలిఫోన్ తీగలా పని చేస్తూ ఉంటుంది. దీనికి తోడు పేగులకు కూడా ‘ఎంటెరిక్ నెర్వస్ సిస్టమ్’ అనే సొంత నాడీ వ్యవస్థ ఉంటుంది. కాబట్టి మెదడు నుంచి అందుకునే సమాచారంతో పేగుల్లోని నాడీ వ్యవస్థ ప్రభావితమవుతూ ఉంటుంది. అందుకునే మానసిక ఒత్తిళ్లు, ఆందోళనలకు గురైనప్పుడు జీర్ణ సమస్యలైన ‘ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్’, వాంతులు, నీళ్లవిరేచనాలూ, కడుపు ఉబ్బరం (బ్లోటింగ్) లాంటి సమస్యలు తలెత్తుతాయి.గట్ హెల్త్ దెబ్బతింటే..పేగుల్లో కోటానుకోట్ల బ్యాక్టీరియా నివసిస్తూ ఉంటుంది. ఉజ్జాయింపుగా చెప్పాలంటే పది పక్కన పధ్నాలుగు సున్నాలు (టెన్ టు ద పవర్ ఆఫ్ ఫోర్టీన్) సంఖ్య ఎంత పెద్దదో అన్ని సూక్ష్మజీవులుంటాయి. కడుపులోని ఈ సూక్ష్మజీవుల సముదాయాన్నే ‘గట్ మైక్రోబియం’ అంటారు. ఈ గట్ మైక్రోబియమే రోగనిరోధక వ్యవస్థ మొదలు మెటబాలిజం వరకూ శరీరంలోని పలు జీవక్రియావ్యవహారాలను ప్రభావితం చేస్తుంది. ఈ సూక్ష్మజీవులు సమృద్ధిగా ఉన్నంత కాలం ఎంతటి తీవ్రమైన రుగ్మతలతోనైనా పోరాడటం సాధ్యమవుతుంది. పేగుల్లోని మైక్రోబియం హెచ్చుతగ్గులకు లోనైతే చాలా రకాల వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకు ఇన్ఫ్లమేటరీ సమస్యలు మొదలుకొని మధుమేహం, ఉబ్బసంలాంటి వాటితో పాటు... చివరకు మానసిక వ్యాధుల బారిన పడతారు. అయితే గట్ హెల్త్ దెబ్బతిని మంచి బ్యాక్టీరియా తగ్గిపోయి ఆలోచనలూ, మానసికారోగ్యాలూ, భావోద్వేగాలు ప్రభావితం అవ్వడానికి చాలా కారణాలుంటాయి. అవేమిటంటే...– యాంటీబయాటిక్స్: వీటితో దేహానికి హాని చేసే చెడు బ్యాక్టీరియాతో పాటు మంచి బ్యాక్టీరియా కూడా నశిస్తుంది.– ఒత్తిడి: వృత్తిపరమైన, వ్యక్తిగతమైన ఒత్తిడులు, ఆఫీసుల్లో సహోద్యోగుల వల్ల తలెత్తే ఒత్తిడులు, సామాజిక ఒత్తిళ్లు.. వీటన్నింటి ప్రభావం నుంచి తప్పించుకోవాలంటే మానసికంగా దృఢంగా ఉండాలి.– ఆందోళన: మానసిక ఆందోళన కలగగానే... గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్‌కు రక్త సరఫరా సక్రమంగా జరగదు. మానసికాందోళనలు మాటిమాటికీ తలెత్తే వాళ్లలో కొందరిలో పేగుల్లోని గోడలు చిట్లుతాయి. ఈ పరిస్థితినే ’లీకీ గట్’ అంటారు. ఆందోళనలు లోనైనప్పుడు విడుదలయ్యే రసాయనాలు (స్ట్రెస్ కెమికల్స్) వ్యాధినిరోధక వ్యవస్థ సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. ఫలితంగా దేహానికి హాని చేసే చెడు బ్యాక్టీరియాతో వ్యాధినిరోధకశక్తి పోరాడలేదు. ఆందోళనలకు గురయ్యేవారిలో కడుపులో యాసిడ్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది అదేపనిగా కొనసాగుతుంటే కడుపు, పేగుల్లో పుండ్లు (అల్సర్స్) రావచ్చు. ఒక్కోసారి అక్కడ అల్సర్ మరింతగా పెరిగి కడుపులో రంధ్రం పడవచ్చు.– ఇతర మానసిక ఆరోగ్య సమస్యలు:సెరటోనిన్ ఉత్పత్తి తగ్గడం మూలంగా డిప్రెషన్, యాంగై్జటీ మొదలవుతాయి. మెదడులోనే ఉత్పత్తి అవుతుందని అందరూ అనుకునే సెరటోనిన్‌లో 95 శాతం పేగుల్లోనే తయారవుతుంది. అంతేకాదు... సెరటోనిన్, డోపమైన్ అనే ఈ హ్యాపీ హార్మోన్ల తయారీకి తోడ్పడే విటమిన్లు, అమినో యాసిడ్లను... నిజానికి పేగుల్లోని మంచి బ్యాక్టీరియానే ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి పేగుల్లో మంచి బ్యాక్టీరియా తగ్గితే, సెరటోనిన్ కూడా తగ్గి మానసిక సమస్యలూ మొదలవుతాయి.గట్ రక్షణకు పరిష్కార మార్గాలివి..ఆహారపరమైనవి: పెరుగు తినడం వల్ల పేగుల్లోని మేలు చేసే బ్యాక్టీరియా పెరుగుతుంది. అందుకే మజ్జిగ, పెరుగు వంటి వాటిని ‘్రపో–బయోటిక్స్’ అంటుంటారు. వీటితో పాటు పీచు పుష్కలంగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు తినడం వల్ల మలబద్దకం ఉండదు. పొద్దున్నే సుఖవిరేచనం అవుతుంది. దాంతో రోజంతా ఉల్లాసంగా ఉంటుంది. ఇందుకోసం ప్రతి భోజనంలో మూడింట ఒక వంతు కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. పండ్లు, డ్రైఫ్రూట్స్‌లో కివి, ఆఫ్రికాట్లతో పాటు బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ వంటివి తరచూ తింటూ ఉండాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా తీసుకోవడం మూడ్స్‌ను బాగు చేస్తుంది. ఇందుకోసం చేపలు తినాలి. ∙వ్యాయామం ఎండార్ఫిన్స్‌ను వెలువరించడం వల్ల హాయి, సంతోషం లాంటి ఫీలింగ్స్ కలిగించడమే కాకుండా కడుపును తేలిగ్గా ఉంచుతుంది. ఈ జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా ఎసిడిటీ, కడుపుబ్బరం, మలబద్దకంతో మూడ్స్ చెడిపోతుంటే వైద్యులను సంప్రదించాలి.ఇవి చదవండి: Health: చీకటి పొర చీల్చండి.. -
మనిషి బ్రెయిన్ వేవ్స్‌తో..ఏకంగా "పాట"..
మనిషి తన టాలెంట్‌ని వెలకితీసి మరీ రకరకాలుగా సంగీతాన్ని సృష్టిస్తున్నాడు. తన గాత్రంతో లేదా తన అవయవాలతో రకరకాల విన్యాసాలు చేసి మరి సృష్టించడం చూశాం. మనిషిలోని మెదడు తరంగాల ఆధారంగా మ్యూజిక్‌ని సృష్టించడం గురించి విన్నారా!. ఔను తాజాగా సైంటిస్టులు ఆ కొత్త విషయాన్ని కనిపెట్టారు. కేవలం మనిషిలోని మెదడు తరంగాల ఆధారంగా సంగీతాన్ని పునర్నిర్మించారు. అందుకు అమెరికాలోని బర్కలీలో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకుల బృందం మూర్చ రోగులపై పరిశోధనలు జరిపారు. 1979 నాటి పింక్ ఫ్లాయిడ్ మూవీలోని క్లాసిక్ పాట "అనదర్ బ్రిక్ ఇన్ ది వాల్" పాటను మూర్చ రోగులకు వినిపించారు. ఆ సమయంలో వారి మెదడులో ఉత్ఫన్నమయ్యే సంకేతాల ను పదాలుగా అర్థమయ్యేలా ప్రసంగంగా మార్చి పునర్నిర్మించడంలో విజయవంతమయ్యారు పరిశోధకులు. తొలిసారిగా శాస్త్రవేత్తలు బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్‌ఫేస్‌లను(బీసీఐ) ఉపయోగించి సంగీతాన్ని పునః సృష్టించారు. 2009 నుంచి 2015 మధ్య న్యూయార్క్‌లోని అల్బానీ మెడికల్ సెంటర్లో చికిత్స పొందిన దాదాపు 29 మంది మూర్చ రోగులపై పరిశోధనలు జరిపారు. గాయకుడు వాల్టర్స్ పాడిన "అనదర్ బ్రిక్ ఇన్ ది వాల్" పాటను ఆ రోగుల ముందు ప్లే చేసేటప్పుడే వారి మెదడులకు ఎలక్ట్రోడ్లను అమర్చారు. అవి బ్రెయిన్లో సంగీతానికి స్పందించే సంకేతాలను ఎన్కోడింగ్ చేసింది. ఆ తర్వాత డేటాను అర్థ చేసుకునేందుకి రిగ్రెషన్ ఆధారిత నమునాలను ఉపయోగించారు. తద్వారా స్పెక్ట్రోగ్రామ్(పాట)ను పునః సృష్టిచగలిగారు. మెదడు సంకేతాలు ఎలా ఫ్రీక్వెన్సీలుగా మారతాయో తెలుపుతోంది ఈ ఆడియో ఫైల్. మెదడు సంగీత శ్రావ్యత, లయ, ఒత్తిడి, స్వరం, ధ్వని వంటి అంశాలన్నింటినికి మెదడు నుంచి వచ్చే తరంగాలను ఎలా అర్థవంతమైన పదాలుగా మలిచి పాటను పునర్నిర్మించొచ్చు అనేది ఈ అధ్యయనంలో వెల్లడైందన్నారు శాస్తవేత్తలు. ఇది భవిష్యత్తులో జరిగబోవు మెదడు ఇంప్లాంటేషన్ శస్త్రచికిత్సలకు సంగీతం ఉపకరిస్తుందని ఈ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయన్నారు శాస్త్రవేత్తలు. అయినా ఇప్పటికే వైద్యులు కొంతమంది రోగులకు బ్రెయిన్‌కి సంబంధించిన శస్త్ర చికిత్సల కోసం వారికి నచ్చిన మ్యూజిక్‌ని ప్లే చేసి మరి ఆపరేషన్లు చేసిన ఉందంతాలను చూశాం. (చదవండి: పూజారి కమ్ బైక్ రేసర్.. ఒకేసారి రెండు విభిన్న రంగాల్లో..) -
ఈ ప్రాంత ఆహారంతో మీ మెదడు వయస్సు తగ్గిపోతుంది..!
కూరగాయలు ఎక్కువగా తీసుకుంటూ..జంక్ ఫుడ్‌ను తగ్గిస్తే మన మెదడు మెరుగ్గా పనిచేస్తుందని ఎన్నో నివేదికలు తెలిపాయి. కానీ ప్రస్తుతం ఓ నివేదిక మెదడు వయస్సును తగ్గించే విషయాలను వెల్లడించింది. మధ్యదరా ప్రాంతంలోని ఆహారంతో మెదడు వయస్సు తగ్గుతుందని ఇజ్రాయెల్‌లోని నెగేవ్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ నివేదిక స్పష్టం చేసింది. ఆ ప్రాంతంలో సాధారణంగా తీసుకునే కూరగాయలు,సీఫుడ్, తృణధాన్యాల కారణంగా శరీరంలో ఒక శాతం కొవ్వు తగ్గడమే కాకుండా మెదడు పనితీరు మెరుగుపడిందని తెలిపారు. మెదడుకు సాధారణంగా ఉండే వయస్సు కంటే తొమ్మిది నెలలు తగ్గుతుందని పరిశోధనలో తేలినట్లు వెల్లడించారు. 102 మందితో 18 నెలలపాటు ఆ ఆహారాన్ని ఇచ్చి శరీర భాగాల పనితీరును పరిశీలించినట్లు నివేదిక పేర్కొంది. ఈ ఆహారంతో కొత్తగా వచ్చి చేరుతున్న కొవ్వు, బాడీ మాస్ ఇండెక్స్, కాలెయ పనితీరును పరిశీలించగా.. మెదడు పనితీరుపై మెరుగైన ఫలితాలు కనిపించినట్లు వెల్లడించారు. శరీర బరువు కూడా 2.3కిలోగ్రాములు తగ్గినట్లు చెప్పారు. ఆరోగ్యకరమైన జీవనవిధానం వల్ల మెదడుపై మెరుగైన ఫలితాలు ఉంటున్నాయని బెన్ గ్యురియన్ యూనివర్సిటీకి చెందిన న్యూరోసైంటిస్టు గిడోన్ లెవకోవ్ తెలిపారు. ప్రాసెసింగ్ ఫుడ్‌ను తగ్గించడం, స్వీట్లు, జంక్ ఫుడ్స్ మెదడు పనితీరును దెబ్బతీయడమే కాకుండా.. బయోలాజికల్ వయస్సును కూడా పెంచుతున్నట్లు తెలిపారు. ఇదీ చదవండి:భూమి లోతుల్లో మరో అద్భుత ప్రపంచం -
చలికాలం మెదడుకు ముప్పు.. జాగ్రత్త..!
చలికాలంలో చాలా ముప్పులు ΄పొంచి ఉంటాయి. దెబ్బ చిన్నగా తగిలినా నొప్పి ఎక్కువగా అనిపిస్తుంది. అలర్జీలు కనిపిస్తాయి. చర్మం ΄పొడిబారి పగులుతుంటుంది. కీళ్లనొప్పులు పెరుగుతాయి. నిజానికివన్నీ చాలా చిన్న సమస్యలు. కానీ చాలా పెద్ద సమస్య... అందునా మెదడుకు సంబంధించిన ముప్పు ఒకటి ΄పొంచి ఉంటుంది. అదే మెదడుకు కలిగే రిస్క్. దాని పేరే ‘సెరెబ్రో వాస్కులార్ యాక్సిడెంట్’, సంక్షిప్తంగా దీన్ని ‘సీవీఏ’గా చెబుతారు. సెరిబ్రో వాస్కులార్ యాక్సిడెంట్ (సీవీఏ) అంటే ఏమిటి, అదెందుకు వస్తుంది, దాని వల్ల వచ్చే అనర్థాలు, దాని నివారణ వంటి అనేక అంశాలపై అవగాహన కోసమే ఈ కథనం. చలికాలంలో కొన్ని సమస్యలు బాగా పెరుగుతాయి. ఉదాహరణకు వాతావరణంలో తేమ తగ్గడం... చర్మం నుంచి ఆ తేమను వాతావరణం లాక్కోవడంతో చర్మం పగుళ్లు, అలర్జీలు ఎక్కువ. అలాగే చలి కారణంగా చర్మం ఉపరితలంలో రక్తనాళాలు కుంచించుకుపోయి రక్తప్రసరణ తగ్గడం (వాసో కన్‌స్ట్రిక్షన్) మాత్రమే కాదు... చర్మంలో ఉండే నాడీ కణాలు బాగా ఎక్కువగా పనిచేయాల్సి రావడంతో చిన్న చిన్న దెబ్బలకు సైతం నొప్పి తీవ్రంగా తెలుస్తుంటుంది. ఇవన్నీ ప్రాణాలకు ముప్పు తెచ్చిపెట్టని మామూలు సమస్యలు. కానీ సెరెబ్రో వాస్కులార్ యాక్సిడెంట్స్ అనే ముప్పు వల్ల మాత్రం పక్షవాతం (బ్రెయిన్ స్ట్రోక్), మెదడులో రక్తస్రావం (బ్రెయిన్ హెమరేజ్) వంటి తీవ్రమైన సమస్యలు వచ్చి అరుదుగా కొన్ని సందర్భాల్లో ప్రాణాలకూ ప్రమాదం తెచ్చిపెట్టవచ్చు. సెరెబ్రో–వాస్కులార్ యాక్సిడెంట్స్ ఎందుకంటే...? ముందుగా చెప్పుకున్నట్లుగా వాతావరణంలో తేమ (హ్యుమిడిటీ) తగ్గిపోవడంతో దాన్ని భర్తీ చేసుకునేందుకు పర్యావరణం మన దేహాల్లోని తేమను లాగేస్తుంది. (ఈ కారణంగానే చర్మం΄పొడిబారినట్లుగా కనిపించడం, గీరితే చారలు పడటం వంటివి సంభవిస్తాయి). అంతేకాదు వాతావరణం చల్లగా ఉండటంతో నీళ్లు తాగడమూ తగ్గిపోతుంది. ఇంకా సాయంత్రాలు, రాత్రుళ్లు, తెల్లవారుఝామున బాగా చల్లగా ఉండటంతో రక్తం వేగంగా ప్రవహించాల్సి వస్తుంది. దాంతో రక్తపోటు పెరుగుతుంది. ఇది మెదడులో రక్తస్రావానికి (బ్రెయిన్ హెమరేజ్)కి కారణం కావచ్చు. ఇక శీతకాలం బాగా చల్లగా ఉండటం వల్ల మనం నీళ్లు తాగడం బాగా తగ్గిపోతుంది. దాంతో రక్తం పలుచగా కాకుండా, చిక్కగా మారడంతో΄ాటు రక్తనాళాల్లో రక్తపు ఉండలు (క్లాట్స్) పెరుగుతాయి. ఫలితంగా ఈ క్లాట్స్ రక్తప్రవాహాన్ని అడ్డుకోవడం వల్ల కొన్నిసార్లు మెదడులో రక్తస్రావం (బ్రెయిన్ హెమరేజ్), మరికొన్ని సార్లు మెదడులో కీలకమైన భాగాలకు రక్తం అందక పక్షవాతం రావచ్చు. (ఇవే క్లాట్స్ గుండెకు సరఫరా చేసే రక్తనాళాల్లో వస్తే గుండెపోటు వచ్చే ప్రమాదమూ ఉంటుంది). ముప్పును మరింత పెంచే అంశాలు... దీనికి తోడు ‘సీవీఏ’ ప్రమాదాన్ని మరింత పెంచడానికి కొన్ని అంశాలు దోహదం చేస్తాయి. అవి... డయాబెటిస్, హైబీపీ, హై కొలెస్ట్రాల్, మూత్రపిండాల జబ్బులు, ΄పొగతాగే అలవాటు వంటివి ఈ ముప్పును మరింత పెంచే అంశాలని చెప్పవచ్చు. రెండు రకాలుగా ‘సీవీఏ’ అనర్థాలు... మెదడులో ఏయే ప్రాంతాల్లో, ఏ రకంగా అనర్థాలు ఏర్పడ్డాయనే అంశం ఆధారంగా ‘సీవీఏ’ని రెండు రకాలుగా చెప్పవచ్చు. మెదడులో రక్తస్రావమైతే దాన్ని ఇంట్రాసెరెబ్రల్ హేమరేజ్ (ఐసీహెచ్) అని, మెదడులోని రక్తనాళాల్లో రక్తపు ఉండలు ఏర్పడటం వల్ల పక్షవాతం వస్తే దాన్ని ఇస్కిమిక్ స్ట్రోక్ అని అంటారు. నివారణ / చికిత్స : ఇంతటి ప్రాణాపాయం తెచ్చిపెట్టే ఈ ‘సీవీఏ’కు నివారణ చాలా తేలిక. ఈ సీజన్లో అన్నిటికంటే ముఖ్యంగా చేయాల్సింది నీళ్లు బాగా తాగుతూ ఉండటమే. దీనివల్ల దేహానికి హైడ్రేషన్ సమకూరుతుంది. వాటితో ΄ాటు... ∙గదిలో వెచ్చని వాతావరణంలో ఉండటం (ఒంటిని వెచ్చగా ఉంచుకోవడం) ∙సమయానికి టాబ్లెట్లు (డయాబెటిస్, హైబీపీ, కొలెస్ట్రాల్, గుండెజబ్బుకు వాడే మందులు) తీసుకోవడం ∙ పొగతాగే అలవాటును పూర్తిగా మానేయడం ∙అన్ని పోషకాలు ఉన్న సమతులాహారం తీసుకోవడం ∙చక్కెరలు చాలా తక్కువగా తీసుకోవడం ∙ఉప్పు చాలా చాలా పరిమితంగా మాత్రమే వాడటం ∙క్రమం తప్పకుండా డాక్టర్ ఫాలో అప్‌కు వెళ్తుండటం ∙మెదడుకు సంబంధించిన ఏ లక్షణం కనిపించినా తక్షణం హాస్పిటల్‌కు వెళ్లాలి. అక్కడ లక్షణాలను గమనించి, అవసరాన్ని బట్టి వైద్యులు తగిన చికిత్స అందిస్తారు. లక్షణాలు: తలలో తీవ్రమైన నొప్పి, వాంతులు∙ తల తిరగడం (డిజ్జీనెస్)∙ పూర్తిగా స్పృహ కోల్పోవడం. ఇవేగాక మరికొన్ని లక్షణాలను (బీఈఎఫ్ఏఎస్టీ) అనే ఇంగ్లిష్ అక్షరాల కలబోతతో ‘బీఫాస్ట్’ గా చెప్పవచ్చు. అంటే... ∙‘బీ’ ఫర్ బ్యాలెన్స్ అంటే సరిగ్గా నడవలేక బ్యాలెన్స్ కోల్పోవడం ∙‘ఈ’ ఫర్ ఐస్ (కళ్లు) అంటే కళ్లు మసకలు బారడం ∙‘ఎఫ్ ఫర్ ఫేస్ అంటే... ముఖంలో ఏదో ఒక వైపు జారిపోయినట్లుగా కావడం (పక్షవాతం లక్షణాల్లో ఒకటి) ∙‘ఏ’ ఫర్ ఆర్మ్స్ (భుజాలు) అంటే రెండు చేతుల్లో ఏదో ఒకటి బలహీనంగా మారడం పనిచేయకపోవడం ∙‘ఎస్’ ఫర్ స్పీచ్ అంటే మాట్లాడలేకపోవడం లేదా మాట ముద్దగా రావడం ∙‘టీ’ ఫర్ టైమ్ అంటే... అది ఆంబులెన్స్ అవసరమైన సమయం (టైమ్) అని అర్థం. -డా‘. ఎస్.పి.మాణిక్ ప్రభు సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్ -
Covid-19: దిమాక్ ఖరాబ్ చేస్తున్న కరోనా
లండన్: కరోనా వచ్చి పోయింది, మానసికంగా ఒడిదుడుకులకు గురైనా పర్వాలేదుగానీ ఓ గండం దాటేశాం అనుకుంటున్న వాళ్లకు.. కొత్త కొత్తగా వస్తున్న నివేదికలు మరింత ఆందోళన రేకెత్తిస్తున్నాయి. శ్వాస కోశ వ్యవస్థ.. అంతర్గత అవయవాల పని తీరును డ్యామేజ్ చేయడం వరకే వైరస్ ప్రభావం ఆగిపోలేదు. పోస్ట్ కొవిడ్ ఎఫెక్ట్.. మెదడుపైనా దీర్ఘకాలం ప్రభావం చూపెడుతోందని తాజా అధ్యయనాల ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు వివిధ దేశాల నుంచి సుమారు పన్నెండున్నర లక్షల మంది పేషెంట్ల ఆరోగ్య నివేదికల ఆధారంగా.. లాన్సెట్ సైకియాట్రీ జర్నల్ తాజాగా ఓ కథనాన్ని ప్రచురించింది. ఇంత భారీ సంఖ్యలో ఫీడ్ బ్యాక్ తీసుకోవడం ఇదే మొదటిది. వీళ్లలో శ్వాస కోశ, హృదయ, ఎముకల సంబంధిత సమస్యల కంటే.. మెదడు మీదే కరోనా తీవ్ర ప్రభావం చూపుతోందని గుర్తించారు. COVID-19 మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి, ప్రాణాలతో బయటపడినవారు నాడీ సంబంధిత, సైకియాట్రిక్ సమస్యల బారినపడుతున్న ప్రమాదం ఎక్కువగా ఉందని ఆధారాలు అంతకంతకు పెరుగుతూ వస్తున్నాయి. బ్రెయిన్ ఫాగ్.. ఇబ్బందికర పరిస్థితి. పనుల మీద దృష్టిసారించకపోవడం. విషయాల్ని గుర్తుంచుకోకపోవడం. చుట్టూ ఉన్న విషయాలను పట్టించుకోకపోవడం.. మీ మీద మీకే విరక్తి కలగడం. ఎపిలెప్సీ.. బ్రెయిన్ యాక్టివిటీ అబ్నార్మల్గా ఉండడం. అసాధారణ ప్రవర్తన. వీటితో పాటు మూర్ఛ సంబంధిత సమస్యలూ వెంటాడుతున్నాయి. డిప్రెషన్, యాంగ్జైటీ రూపంలో స్థిమితంగా ఉండనివ్వడం లేదు. వైరస్ బారినపడి కోలుకున్నవాళ్లలో.. ఆరు నెలల నుంచి రెండేళ్లపాటు మానసిక రుగ్మతలు కొనసాగడం గుర్తించినట్లు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పౌల్ హారిసన్ వెల్లడించారు. కొవిడ్-19 తర్వాతే ఎందుకిలా జరుగుతుంది?.. ఇది ఇంకెంత కాలం సాగుతుంది?.. సమస్యలను అధిగమించడం ఎలా? అనే వాటిపై మరింత అధ్యయనం జరగాల్సి ఉందని ఆయన అంటున్నారు. ఇదీ చదవండి: షియోమి వారి కుంగ్ ఫూ రోబో! -
మెదడు వేడెక్కుతుంటుంది... ఎందుకలా!
ఏదైనా సంక్లిష్టమైన పెద్ద సమస్య వచ్చినప్పుడు పరిష్కారాలు ఆలోచిస్తుంటే... ‘మెదడు వేడెక్కిపోతోంది’ అనడం మామూలే. అదేదో చమత్కారం కోసం అనే మాట కాదంటున్నారు నిపుణులు. చాలాసేపట్నుంచి వాడుతున్న ల్యాప్‌టాప్ లాగా, ఎంతోసేపట్నుంచి నడిచిన ఇంజన్ లాగే మెదడూ వేడెక్కుతుందంటున్నారు పరిశోధకులు. ఈ మెదడు వేడికీ, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కోలుకునే తీరుకు సంబంధం ఉందని గుర్తించడంతో... దీనిపై ఇంకా ముమ్మరంగా పరిశోధనలు జరుగుతున్నాయి. మామూలుగా మనుషుల నార్మల్ ఉష్ణోగ్రత 98.6 డిగ్రీల ఫారెన్‌హీట్. కానీ నిరంతరం మెదడు చేసే పనుల కారణంగా దాని ఉష్ణోగ్రత దాదాపు 104 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉంటుందని తేలింది. ఇలా జరగడం ఏ లోపాన్నీ సూచించదనీ, నిజానికి ఇదో ఆరోగ్యకరమైన సూచిక అని వెల్లడించారు. ఈ ఉష్ణోగ్రతను చూసి కొన్నిసార్లు పరిశోధకులే ఆశ్చర్యపోతున్నారు. ఉదాహరణకు... ‘మెదడుకు ఏదైనా గాయమైనప్పుడు... దాని కారణంగా ఇలా జరుగుతుందేమోనంటూ గతంలో ఇలాంటి ఉష్ణోగ్రతలను చూసినప్పుడు భావించేవారు. ఒకవేళ ఇదే ఉష్ణోగ్రత దేహంలోని ఏ భాగంలోనైనా నమోదైతే దాన్ని తప్పక జ్వరంగా పరిగణిస్తార’ని వ్యాఖ్యానించారు ఇంగ్లాండ్‌లోని మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ లాబోరేటరీ ఆఫ్ మాలెక్కులార్ బయాలజీకి చెందిన పరిశోధకుడు జాన్–ఓ–నీల్. మెదడు ఉష్ణోగ్రత తెలిపే ఎమ్మారెస్ అనే టెక్నిక్ మెదడు ఉష్ణోగ్రతలను తెలుసుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన కొంతమంది వలంటీర్లపై ఈ పరిశోధనలు చేశారు. వీరంతా 20 – 40 ఏళ్ల మధ్యవారు. ఇలా కొలవడానికి ‘మాగ్నెటిక్ రెసోనెన్స్ స్పెక్ట్రోస్కోపీ (ఎమ్ఆర్ఎస్) అనే టెక్నిక్‌ను ఉపయోగించారు. అంతేకాదు... ఈ డాటాను వారు సర్కేడియన్ రిథమ్తోనూ సరిపోల్చారు. ఉష్ణోగ్రత ఫలితాలనూ, సర్కేడియన్ రిథమ్‌తో పోల్చుతూ మరిన్ని అధ్యయనాలు జరుగుతున్నాయి. మెదడు ఉష్ణోగ్రత ఎంత? సాధారణంగా మెదడు ఉష్ణోగ్రత 101.3 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉంటుంది. ఇది నాలుక కింది ఉష్ణోగ్రత కంటే రెండు డిగ్రీలు ఎక్కువ. మళ్లీ ఈ కొలతల్లో కూడా వ్యక్తి వయసు, జెండర్, మహిళ అయితే రుతుసమయం... ఇలాంటి అంశాలన్నీ బ్రెయిన్ టెంపరేచర్‌ను ప్రభావితం చేస్తున్నాయని గుర్తించారు. కీలకమైన విషయం ఏమిటంటే... పురుషుల మెదడు ఉష్ణోగ్రతల కంటే మహిళల్లో ఎక్కువ. ఈ ఉష్ణోగ్రతలకూ... ఏదైనా ప్రమాదం జరిగి మెదడుకు దెబ్బ (ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజ్యూరీ) తగిలితే కోలుకునే తీరుకు సంబంధం ఉందని చెబుతున్నారు. అంతేకాదు... ఈ టెంపరేచర్ ఆధారంగానే ఇలా ప్రమాదం జరిగి కోలుకున్నాక... భవిష్యత్తులో మెదడుకు రాబోయే ముప్పు వివరాలూ తెలుస్తాయనీ, అందుకే 24 గంటల పాటు ఉష్ణోగ్రత వివరాలతో మరిన్ని పరిశోధనలు జరగాలంటున్నారు మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ లాబోరేటరీ ఆఫ్ మాలెక్కులార్ బయాలజీ విభాగంలోని న్యూరాలజిస్ట్ / మహిళా సైంటిస్ట్ నీనా జెకోర్జెక్. -
బ్రెయిన్ షార్ప్‌గా ఉండాలంటే.. ఏం చేయాలి?
మనిషికి శారీర ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం. శారీరక శ్రమ ముఖ్యంగా మెట్లు ఎక్కడం ద్వారా అధిక కొవ్వును కరిగించుకోవచ్చు. అలాగే మెట్లు ఎక్కితే మెదడువికాసానికి, మెదడు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని పరిశోధకులు వెల్లడించారు. జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే వ్యాయామాల తోపాటు మెట్లు ఎక్కడం లాంటివి ఎక్సర్సైజ్ చేయడం బ్రెయిన్ ఫిట్‌నెస్‌కు చాలా మంచిదట. ముఖ్యంగా వయసు పెరుగుతున్నవారు క్రమం తప్పకుండా చిన్నగా మెట్లు ఎక్కుతూ మెదడుని చురుగ్గా ఉంచుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. వృద్ధాప్యంలో వేధించే అల్జీమర్స్ లాంటి బారిన పడకుండా ఈ వ్యాయామం అద్భుతమైన మేలు చేస్తుందని చెబుతున్నారు. మెట్లు ఎక్కితే శరీరానికి మంచిదని, చక్కని వ్యాయామం అందుతుందని మనకు తెలుసు. మెట్లు ఎక్కడం వలన మెదడుకి కూడా చాలా మేలు కలుగుతుందట. తక్కువ వ్యవధిలో, తేలికగా మెట్లు ఎక్కడంవల్ల బాడీ, మైండ్ ఫిట్‌నెస్‌కు చాలా మంచిదని ఒక స్టడీలో తేలింది. జర్మనీలోని కార్ల్ శ్రహే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ పరిశోధకులు తమ అధ్యయనంలో పేర్కొన్నారు. ప్రతిరోజూ మెట్లు ఎక్కడం వలన చురుగ్గా ఉండటం తోపాటు, క్తితో నిండిన అనుభూతిని కలిగిస్తుందని, ఇది మన ఆరోగ్యాన్ని మరింత ఉత్తేజితం చేస్తుందని సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌లో అధ్యయన వేత్తలు వెల్లడించారు. అలాగే చిన్నచిన్న తేలిక పాటి ఇతర వ్యాయామాల ద్వారా వృద్ధులు తమ మెదడును యవ్వనంగా ఉంచుకోవచ్చని తెలిపారు. అనేక రకాల ఇతర శారీరక శ్రమలతో పోల్చితే, రోజుకు కనీసం ఒక్కసారైనా మెట్లు ఎక్కడం చాలా మంచిదని కెనడా పరిశోధకులు న్యూరోబయాలజీ ఆఫ్ ఏజింగ్ జర్నల్‌లో వెల్లడించారు. 19 నుండి 79 సంవత్సరాల వయస్సు గల 331 మంది ఆరోగ్యవంతమైన పెద్దల భౌతిక మెదడుపై వారం రోజులపాటు పరిశోధన నిర్వహించారు. ఈ స్టడీలో వారి బ్రెయిన్ ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి ఎంఆర్ఐ స్కాన్లను పరిశీలించారు. క్రమం తప్పకుండా మెట్లు ఎక్కినవారి మెదడు చురుకుగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. బాగా చదువుకున్న వారిలో భౌతిక మెదడు వయస్సు దాదాపు ఒక సంవత్సరం తక్కువగానూ, రోజు మెట్లు ఎక్కే వారి భౌతిక మెదడు వయస్సు అర సంవత్సరం తగ్గినట్టు పరిశోధకులు తెలిపారు. మెట్లు ఎక్కడం వలన చదువుకుంటున్న వారిలో మెదడులోని నాడీ కణజాలం సంకోచించకుండా కాపాడి, మెదడు చురుగ్గా, మరింత యవ్వనంగా తయారువుతుందట. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమయానికి భోజనం చేయడం, మానసిక ఒత్తిడికి దూరంగా ఉండటం, పుస్తకాలు, చదవడం, సామాజికంగా చురుగ్గా ఉండటం రోజుకు కనీసం ఏడు గంటల నిద్ర మెదడు ఆరోగ్యానికి చాలా అవసరం. అలాగే షుగర్, బీపీ లాంటి వ్యాధులను బారిన పడకుండా ముందునుంచీ జాగ్రత్త పడాలి. థైరాయిడ్, షుగర్, బీపీ వ్యాధులను నియంత్రణలో ఉంచుకోవడం చాలా కీలకం. మెదడు ఆరోగ్యంగా, చురుగ్గా పనిచేయాలంటే.. రోజువారీ జీవితంలో లిఫ్ట్‌లకు, ఎలివేటర్స్కు సాధ్యమైనంత వరకు బైబై చెప్పేసి మెట్టు ఎక్కితే మెదడు పదిలంగా ఉంటుంది. మన మెదడు నిత్య యవ్వనంగా, ఆరోగ్యంగా ఉండాలంటే.. మెదడును ఎంత ఉల్లాసంగా ఉంచితే అంత మంచిదన్నమాట. -
పాలకూర, టీ.. ఇంకా.. వీటితో బ్రెయిన్ పవర్ పెంచుకోవచ్చు!
బుర్రకు పదును పెట్టే కొన్ని రకాల ఆహార పదార్థాల గురించి వినే ఉంటారు. ఇవి తీసుకుంటే మేధస్సు వికసిస్తుందని, తెలివితేటలు పెరుగుతాయని, ఈ ఆహారం తీసుకుంటే చాలు మీకిక తిరుగులేని జ్ఞాపకశక్తి లభిస్తుందనీ సామాజిక మాధ్యమాలలో చాలా రకాల ఆహార పానీయాలు చక్కర్లు కొడుతుంటాయి. వాటిలో ఎంత వరకు నిజముంటుందో తెలియదు కానీ, మెదడుకు మేత పెట్టే కొన్ని రకాల ఆహారాల గురించి హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రొఫెసర్, మాసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ డైరెక్టర్ ఆఫ్ న్యూట్రిషనల్ అండ్ లైఫ్‌స్టైల్ సైకియాట్రీ డాక్టర్ ఉమానాయుడు మెదడుకు పదును పెట్టే కొన్ని రకాల ఆహార పదార్థాల గురించి చెబుతున్నారు. పండ్లు, కూరగాయలు, హోల్ గ్రెయిన్స్, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, తక్కువ మొత్తంలో తీసుకునే రెడ్ మీట్ అల్జీమర్స్ అనే ఒక విధమైన మతిమరపు వ్యాధిని నిరోధిస్తాయని తెలిసిందే. వీటితో కూడా బ్రెయిన్ పవర్ పెంచుకోవచ్చు. పాలకూర: ఏకాగ్రతను పెంచడంతో పాటు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.. కాఫీ/ టీ: రోజూ రెండు నుంచి మూడు కప్పులకు మించకుండా తాగే కాఫీ లేదా టీ వల్ల మెమరీ పెరుగుతుంది. చురుకుగా ఉండేందుకు దోహదపడుతుంది. చేపలు: ఆహారపుటలవాట్లను బట్టి,ఇష్టాయిష్టాలను బట్టి వారానికి ఒకటి లేదా రెండుసార్లు చేపలు తింటే ఏకాగ్రత పెరుగుతుంది.. క్యారట్: వయసు పెరగడం వల్ల వచ్చే మెమరీ సమస్యలను తగ్గిస్తుంది.. వాల్ నట్స్: జ్ఞాపకశక్తి పెరగడంతోపాటు స్కిల్స్ మెరుగుపడుతాయి. ఇవి మనం తీసుకునే ఆహారం... వీటితోపాటు పజిల్స్ పూరించడం, చెస్ ఆడటం, చిన్నప్పుడు విన్న పద్యాలు, ఇష్టమైన పాటలు గుర్తు చేసుకుంటూ వాటిని రాయడం వంటి మెదడుకు పెట్టే మేత వల్ల కూడా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చదవండి: ఉడికించిన పచ్చి మామిడికాయ రసంలో ఉప్పు , జీలకర్ర కలిపి రోజూ తాగితే.. -
మతిమరుపు నివారణకు మందులు లేవు..ఇలా చేస్తే మాత్రం..
అల్జైమర్స్... ఓ చిత్రమైన మరపు. సాధారణ మతిమరపుగా చెప్పలేని విచిత్రమైన మరపు. పలకపై తుడిచేసిన అక్షరాలు అలా కనిపించీ.. కనిపించకుండా పలుచగా అల్లుకుపోయినట్టుగా అనిపించినట్టుగానే... మెదడు ఫలకంపైన ఉండే జ్ఞాపకాలూ, అనుభవాలూ, నేర్పులూ, నైపుణ్యాలూ, శక్తులూ, సామర్థ్యాలూ... అన్నీ క్రమంగా చెరుపుకుపోయినట్టుగా చెరిగిపోయే రుగ్మత ‘అల్జైమర్స్’. బైక్ లేదా కారు తాళాలు మరచిపోవడం సాధారణ మతిమరపు. కానీ నేర్చుకున్న ‘డ్రైవింగ్’నే మరచిపోవడం... అల్జైమర్స్. కిచెన్‌లో అగ్గిపెట్టె ఎక్కడో పెట్టి మరిపోవడం మతిమరపు. కానీ అగ్ని లేదా మంట అనే జ్ఞానాన్నే పూర్తిగా మరచిపోవడం... అల్జైమర్స్. మన అందరిలోనూ ఏదో ఒక దశలో కనిపించే సాధారణ అంశం ‘మతిమరపు’. కానీ దాని తారస్థాయిలా... ఓ రుగ్మతగా కొందరిలో కనిపించే మెదడు సమస్య ఈ ‘అల్జైమర్స్’! గతంలో ఈ రుగ్మతతో చాలా కొద్దిమందిమాత్రమే బాధపడేవారు. ఇటీవల ఈ సంఖ్య చాలా ఎక్కువగా పెరుగుతోంది. ఈనెల 21న అల్జైమర్స్ డే. ఈ సందర్భంగా అల్జైమర్స్ అంటే ఏమిటి, ఎందుకొస్తుంది, దానికి నివారణ, పరిష్కారాలను తెలుసుకోవడం కోసమే ఈ కథనం. ఏమిటీ అల్జైమర్స్... అలాయ్ అల్జైమర్స్ అనే ఓ జర్మన్ సైకియాట్రిస్ట్ ఈ రుగ్మతను కనుగొన్నారు. దాంతో అతడి పేరే ఈ వ్యాధికి పెట్టారు. పురుషులతో పోలిస్తే మహిళలు మూడు రెట్లు ఎక్కువగా అల్జైమర్స్‌కు గురవుతారు. దీనికి గురైన మెడికల్ హిస్టరీఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. వయసు పైబడటం ప్రారంభమయ్యాక అన్ని కణాలతో పాటు మెదడు కణాలూ అంతో ఇంతో శిథిలమైపోతుంటాయి. కానీ కొందరిలో మాత్రం మెదడు కణాలు మరీ ఎక్కువగా నశించిపోతుంటాయి. వారి మెదడు క్రమంగా కుంచించుకుపోతుంటుంది. అందునా ప్రధానంగా ఫ్రంటల్, టెంపోరల్, పెరైటల్ అనే భాగాల్లోని కణాలు కుంచించుకుపోవడం వల్ల మెదడు తన బరువులో 20% కోల్పోతుంది. ఇది బయటకు కనిపించేది. కానీ అత్యంత నిశితంగా (మైక్రోస్కోపిక్ స్థాయిలో) పరిశీలించినప్పుడు ‘న్యూరో ఫైబ్రిలేటరీ టాంజిల్స్’ అనే అమైలాయిడ్ ప్రోటీన్లు మెదడు మీద కనిపిస్తాయి. ఆ ఆధారంగానే అల్జైమర్స్ ను నిర్ధారణ చేస్తారు. కారణాలు.. సాధారణంగా చాలావరకు జన్యుపరమైన కారణాలూ, ఆ తర్వాత కొంతవరకు పర్యావరణ అంశాలూ ఈ రుగ్మతకు కారణం కావచ్చని నిపుణుల అంచనా. దశలు ఇవీ... అల్జైమర్స్‌ను తొలిదశల్లో గుర్తుపట్టడం చాలా కష్టం. దాంతో అటు కుటుంబసభ్యులూ, కొన్ని సందర్భాల్లో ఇటు డాక్టర్లు కూడా దీన్ని తేలిగ్గా గుర్టుపట్టలేరు. తొలుత మతిమరపులా కనిపించే ఇది మూడు దశల్లో తన తీవ్రత చూపుతుంది. తొలిదశలో... రోజువారీ చిన్న చిన్న విషయాలు కూడా మరపునకు వస్తుంటాయి. తాము చేయాల్సిన రొటీన్ పనులూ మరచిపోతుంటారు. చాలా విలువైన వస్తువులను ఎక్కడో పెట్టేసి, పెట్టిన విషయాన్నీ, చోటునూ మరుస్తుంటారు. చాలా దగ్గరి స్నేహితుల పేర్లనూ... అంతెందుకు పొద్దున్న చదివిన న్యూస్పేపర్లోని అంశాలూ మరిచిపోతుంటారు. గతంలో జరిగిన బలమైన సంఘటనలుగాక... ప్రస్తుత (రీసెంట్ పాస్ట్) అంశాలను తొలుత మరుస్తుంటారు. రెండో దశలో... తాము ఎక్కడున్నామన్న విషయాన్ని మరచిపోతుంటారు. ఆరోజు తేదీ ఏమిటి, ఆ రోజు ఏ వారం అన్న విషయం గుర్తుండదు. మూడీగా ఉంటూ, ముడుచుకుపోతుంటారు. మూత్రం, మలవిసర్జనలపై అదుపు ఉండకపోవచ్చు. పగలంతా నిద్రపోతూ ఉండి, రాత్రంతా మెలకువతో, అస్థిమితంగా ఉంటారు. మూడో దశలో... తాము రోజూ ఉపయోగించే రేజర్ వంటి వాటినీ గుర్తించలేరు. సరిగా గడ్డం కూడా గీసుకోలేరు. తలుపు గడేసుకోవడం వంటి సాధారణ అంశాల్నీ మరచిపోవచ్చు. దుస్తులు ధరించడం, షేవింగ్, స్నానం చేయాలన్న విషయాలేవీ వారి గమనంలో ఉండకపోవచ్చు. నిలబడలేకపోవడం, నడవలేకపోవడంతో పడక మీద అలా పడి ఉంటారు. అంతకు మునుపు తామంతట తాము రోజూ చేసే అన్ని పనుల్లోనూ ఇతరుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి రావచ్చు. కొందరైతే జీవించి ఉండి కూడా, పూర్తి స్పృహలో ఉండికూడా... ఏదీ చేయలేని ఓ దుంపలా (వెజిటేటివ్ స్టేట్‌లో) పడి ఉంటారు. నిర్ధారణ పరీక్షలు : సీటీ / ఎమ్మారై స్కాన్ నిర్ధారణకు ఉపయోగపడతాయి. కానీ నిర్దిష్టంగా వాటితోనే తెలుస్తుందని చెప్పడానికి లేదు. ఇక స్పెక్ట్, పెట్ స్కాన్ వంటివి కొంతవరకు ఉపయోగపడతాయి. చికిత్స: ఇప్పటికీ ఫలానా మందులే పనిచేస్తాయని నిర్ధారణగా చెప్పడానికి వీల్లేదు. అలాగే ఫలానా మందుల ద్వారా రాకుండా చేసేందుకు వీలూ లేదు. అయితే ఇలా వచ్చేందుకు అవకాశాలున్నవారిలో మాత్రం కొన్ని మందుల ద్వారా దాని తీవ్రతను తగ్గించేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతానికి డొనేజిపిల్, గాలాంటమైన్, రివాస్టిగ్మయిన్ వంటి అసిటైల్ కోలిన్ ఔషధాలతో పరిస్థితిని చాలావరకు మెరుగుపరచవచ్చు. వీటన్నింటిలోనూ రివాస్టిగ్మయిన్ ప్రస్తుతానికి చాలా మంచి మందు. అలాగే మామాంటైన్ అనే మందు ద్వారా అల్జైమర్స్‌ను మరింత ఆలస్యంగా వచ్చేలా చేయవచ్చు. ఇక ‘అడ్యుకాన్యుమాబ్’ అనే మందు మెదడుపై ఏర్పడి అంటుకుపోయినట్లుగా ఉండే ‘అమైలాయిడ్’ వంటి ప్రోటీన్ ప్లాక్ (పాచి వంటిదాన్ని) తొలగించి శుభ్రపరుస్తుంది. ఈ ఏడాది జూన్‌లో ఈ ఔషధాన్ని ‘ఎఫ్‌డీఏ’ ఆమోదించింది. ఇక మన ఆహారంలో అల్జైమర్స్‌కు మంచి ఔషధంగా పనిచేసేవీ ఉన్నాయి. అవే... విటమిన్–ఈ, ఒమెగా ఫ్యాటీ–3 యాసిడ్స్, కర్క్యుమైన్, రెస్వెరటాల్ వంటివి. ఇందులో కర్క్యుమైన్ అనేది మనం రోజూ వంటలో వాడే పసుపులోనూ, రెస్వెటరాల్ పోషకం ద్రాక్షగింజల్లో పుష్కలంగా ఉంటుంది. ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్ చేపల్లో ఎక్కువ. విటమిన్–ఈ పసుపురంగు పండ్లలో పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు... క్యారట్లో ఉండే ‘బీటా కెరోటిన్’, ఆపిల్స్‌లో ఉండే ‘యాంథోసయనిన్’, బెర్రీ పండ్లలో ఉండే ‘ఫ్లేవోన్స్’లో కూడా అల్జైమర్స్‌ను నివారించే అంశాలున్నాయి. నివారణ... మంచి పోషకాలను ఇచ్చే సమతుల ఆహారం, ఆకుపచ్చని ఆకుకూరలు, తాజా కూరగాయలు, తాజా పండ్లు, చేపలు, పసుపు, క్యాటర్, బెర్రీ, రేగుపండ్లు, ద్రాక్ష, దానిమ్మ, అవకాడో (బటర్ ఫ్రూట్), వాక్కాయ (కలిమకాయ/కలెంకాయ) వంటివి అన్నీ అల్జైమర్స్‌ను చాలావరకు నివారిస్తాయి. ∙ పైవాటికి తోడు పొగతాగడం, ఆల్కహాల్ వంటి అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండటం, కనీసం రోజుకు 20 నిమిషాలకు పైబడి చేసే వ్యాయామాలు (శరీరాన్ని శ్రమకు గురిచేయకుండా నడక వంటి వ్యాయామాలు), కంటినిండా నిద్రపోవడం వంటి ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు డయాబెటిస్, హైబీపీ వంటి జీవనశైలి రుగ్మతలను నియంత్రణలో పెట్టుకోవడం వంటివి అల్జైమర్స్ నివారణకు తోడ్పడతాయి. ∙మంచి మంచి పుస్తకాలు చదవడం లేదా కొత్త భాషలనూ, విద్యలను నేర్చుకోవడం, కొత్త నైపుణ్యాలను పెంచుకోవడం, మెదడును చురుగ్గా ఉంచేలా చేసే పజిల్స్ (ప్రహేళికలను) పరిష్కరించడం వంటి ఆరోగ్యకరమైన హాబీలు అల్జైమర్స్‌ను దూరంగా ఉంచుతాయి. ∙ఫ్రెండ్స్, బంధువులతో ఆరోగ్యకరమైన సంబంధాలను నెరపడం, మంచి చురుకైన సామాజిక జీవనాన్ని గడపటం వంటి అంశాలన్నీ అల్జైమర్స్‌ను నివారిస్తాయి... లేదా వీలైనంత ఆలస్యం చేస్తాయి. మన దేశంలో... ప్రస్తుతం యూఎస్ వంటి దేశాలతో పోలిస్తే మన దేశంలో ‘అల్జైమర్స్’తో బాధపడేవారి సంఖ్య ఇప్పటికి ఒకింత తక్కువే గానీ వీరి సంఖ్య క్రమంగా విపరీతంగా పెరుగుతోంది. 2031 నాటికి మన దేశంలోని జనాభాలో సీనియర్ సిటిజెన్ల సంఖ్య 19.4 కోట్లు ఉండవచ్చనీ... వీరిలో దాదాపు 4.4% – 5% వరకు అలై్జమర్స్ బాధితులు ఉండవచ్చని ఒక అంచనా. అచ్చం అల్జైమర్స్ లాంటివే... అచ్చం అల్జైమర్స్లాగే అనిపించేవీ, అలాంటి లక్షణాలే కనిపించేవీ మరికొన్ని కండిషన్స్ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో వాటిని అల్జైమర్స్గా పొరబడే ప్రమాదం కూడా ఉంటుంది. కాకపోతే అల్జైమర్స్‌కు న్యూరో ఫిజీషియన్ల ఆధ్వర్యంలో చికిత్స జరగాల్సి ఉండగా... అవే లక్షణాలతో వ్యక్తమయ్యే వీటికి న్యూరోసర్జన్ ఆధ్వర్యంలో శస్త్రచికిత్స నిర్వహించాల్సి ఉంటుంది. అవి... ∙నార్మల్ ప్రెషర్ హైడ్రోసెఫాలస్ : ఈ కండిషన్లో మెదడు కుహరంలోని అదనపు ‘సెరిబ్రో స్పైనల్ ఫ్యూయిడ్’ అనే ద్రవాన్ని షంట్ శస్త్రచికిత్స ద్వారా దారి మళ్లించి నార్మల్‌గా మారుస్తారు. ∙క్రానిక్ సబ్డ్యూరల్ హిమటోమా: హిమటోమా అంటే రక్తం పేరుకుపోయి గడ్డకట్టినట్లుగా కావడం. మెదడులో ఇలా జరిగినప్పుడు ‘లోకల్ అనస్థీషియా’ ఇచ్చి తలకు రెండు చిన్న రంధ్రాల ద్వారా పరిస్థితిని చక్కబరుస్తారు. ∙ట్యూమర్స్: అంటే గడ్డలు అన్న విషయం తెలిసిందే. మెదడులోని ఫ్రంటల్, టెంపోరల్ అనే భాగాల్లో గడ్డలు వచ్చిన సందర్భాల్లోనూ శస్త్రచికిత్స ద్వారా వాటిని తొలగిస్తారు. ఇలాంటివే ‘అల్జైమర్స్’ను పోలిన మరికొన్ని కండిషన్లూ ఉన్నాయి. వాటిని శస్త్రచికిత్స ద్వారా సరిచేయాల్సి ఉంటుంది. -డాక్టర్ పి. రంగనాథం సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ -
ఒత్తిడితో మెదడుపై పెనుప్రభావం..
లండన్ : మధ్యవయస్కుల్లో ఒత్తిడితో మెదడు కుచించుకుపోయి జ్ఞాపక శక్తి దెబ్బతినే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. 40 ఏళ్లు దాటిన వారిలో ఒత్తిడి హార్మోన్ కార్టిసోల్ ప్రభావంతో మెదడు కుచించుపోతున్నట్టు గుర్తించారు. ఒత్తిడి హార్మోన్ అత్యధికంగా విడుదల కావడం మున్ముందు డిమెన్షియా ముప్పుకు దారితీస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఒత్తిడి ప్రజల ఆలోచనా ధోరణిని కూడా ప్రభావితం చేస్తుందని జర్నల్ న్యూరాలజీలో ప్రచురితమైన హార్వర్డ్ మెడికల్ స్కూల్ అథ్యయనం వెల్లడించింది. పరిశోధన కోసం 49 ఏళ్ల సగటు వయసు కలిగిన 2231 మందిని డాక్టర్ జస్టిన్ నేతృత్వంలో శాస్త్రవేత్తలు పరీక్షించారు. తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటూ డిమెన్షియా ప్రారంభ లక్షణాలైన మెదడు కుచించుకుపోవడం, జ్ఞాపకశక్తి మందగించడాన్ని ఆయా వ్యక్తుల్లో తమ పరిశోధనలో భాగంగా గుర్తించామని డాక్టర్ జస్టిన్ వెల్లడించారు. తగినంత నిద్ర, సరైన వ్యాయామం, ఆహ్లాదంగా గడపటం వంటి చర్యలతో ఒత్తిడిని తగ్గించుకునేందుకు ప్రజలు చొరవ చూపాలని సూచించారు. అవసరమైతే ఒత్తిడిని పెంచే కార్టిసోల్‌ను నియంత్రించే మందులను వైద్యులను సంప్రదించి తీసుకోవాలన్నారు. కార్టిసోల్ అధికంగా విడుదలయ్యే రోగుల పట్ల వైద్యులు తగిన శ్రద్ధ చూపాలని సూచించారు. -
తేలికపాటి వ్యాయామంతోనూ మెదడుకు ఉత్తేజం
లండన్ : వ్యాయామంతో మెదడులో కొత్త కణాలు ప్రేరేపితమవుతాయని పలు అథ్యయనాలు వెల్లడించగా, తాజాగా రోజుకు కేవలం పదినిమిషాల పాటు తేలికపాటి వ్యాయామంతోనూ త్వరతగతిన ఫలితాలు అందుతాయని తేలింది. కొద్దిపాటి వ్యాయామంతోనూ మెదడు సత్వరమే ఉత్తేజితమవుతుందని కాలిఫోర్నియా, జపాన్ పరిశోధకులు గుర్తించారు. రోజుకు కేవలం పదినిమిషాల పాటు వ్యాయామం చేసినా మెదడులో జ్ఞాపకశక్తి సహా చురుకుదనం ప్రేరేపిస్తుందని తాజా అథ్యయనం స్పష్టం చేసింది. యోగా, థైచీ వంటి తేలికపాటి వ్యాయామాలతోనూ మెదడులో జ్ఞాపకాలను నిక్షిప్తం చేసే భాగం ఉత్తేజితమవుతుందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, జపాన్‌కు చెందిన సుకబా యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. గతంలో వ్యాయామంతో మెదడుకు మేలు చేకూరుతుందని పలు అథ్యయనాలు వెల్లడించగా, తాజా అథ్యయనం వ్యాయామంతో మెదడుకు తక్షణ ఫలితాలు చేకూరుతాయని స్పష్టం చేసింది. నిత్యం వ్యాయామం చేయడం ద్వారా శారీరకంగా, మానసికంగా చురుకుగా ఉండవచ్చని పరిశోధకులు సూచించారు. -
వ్యాయామంతో మెదడుకు ఉత్తేజం
లండన్ : వ్యాయామంతో శారీరక చురకుదనంతో పాటు మెదడు ఉత్తేజితమై ఎదుగుదల సంతరించుకుంటుందని తాజా అథ్యయనం వెల్లడించింది. శరీరానికి మేలు చేసే ఏ పనైనా మెదడుకూ మేలు చేస్తుందని ఇప్పటికే పలు సర్వేలు స్పష్టం చేయగా వ్యాయామం మెదడుపై సానుకూల ప్రభావం చూపుతుందని తాజా అథ్యయనంలో విస్పష్టంగా తేలింది. బ్రైన్ పజిల్స్, క్రాస్‌వర్డ్స్ పూరించడంతో పోలిస్తే శారీరక చురుకుదనంతోనే మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ కాన్బెర్రా పరిశోధకులు పేర్కొన్నారు. ప్రతిరోజూ ఏరోబిక్ ఎక్సర్‌సైజులతో ఆలోచనా విధానం, చదవడం, రీజనింగ్ వంటి సామర్థ్యాలు మెరుగుపడతాయని గుర్తించారు. వ్యాయామంతో కండరాలు పటిష్టమవడం జ్ఞాపకశక్తి, మెదడు సామర్థ్యం పెరిగేందుకు దోహదపడుతుందని పరిశోధకులు వెల్లడించారు. వేగంగా నడవడం, తోటపని, స్విమ్మింగ్, మెట్లు ఎక్కడం వంటి శారీరక కదలికలు అధికంగా ఉండే వ్యాయామాలతో మెదడు ఉత్తేజితమవుతుందని గుర్తించారు. శారీరక వ్యాయామంతో పాటు అభిరుచుల మేరకు సంగీతం, నృత్యం వంటి వ్యాపకాల్లో మునిగితేలితే డిమెన్షియా ముప్పును ఎదుర్కోవచ్చని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు వెల్లడించారు. -
కొలెస్ర్టాల్‌తో మెదడుకు రిస్క్..
లండన్ : పొత్తికడుపులో కొవ్వుతో మెదడు సంబంధిత వ్యాధులు, శరీరంలో వాపు నెలకొనే ముప్పు అధికంగా ఉందని తాజా అథ్యయనం వెల్లడించింది. పొట్ట మినహా ఇతర శరీర భాగాల్లో కొవ్వు పేరుకుపోయిన వారితో పోలిస్తే పొట్టభాగంలో కొలెస్ర్టాల్ అధికంగా ఉన్న వారికి ఈ వ్యాధుల ముప్పు అధికమని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, రివర్సైడ్ అథ్యయనంలో వెల్లడైంది. మహిళలతో పోలిస్తే పొట్టభాగంలో కొవ్వు పేరుకుపోయిన పురుషుల్లోనే మెదడులో వాపు ముప్పు అధికమని పరిశోధకులు గుర్తించారు. రోజూ తీసుకునే ఆహారంపై కన్నేసి ఉంచాలని, ముఖ్యంగా పొత్తికడుపు చుట్టూ కొవ్వు పేరుకుపోకుండా చూసుకోవాలని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ప్రొఫెసర్ డుడికా కాస్ సూచించారు. పొత్తికడుపులో పేరుకుపోయే కొవ్వు రక్త ప్రసరణకు అడ్డంకిగా మారుతుందని, మెదడుకు రక్తసరఫరాను కూడా ఇది ప్రభావితం చేస్తుందని పరిశోధకులు హెచ్చరించారు. -
వ్యాయామంతో అల్జీమర్స్‌కు చెక్
లండన్ : రోజూ వ్యాయమంతో అల్జీమర్స్‌ను నియంత్రించవచ్చని తాజా అథ్యయనం వెల్లడించింది. మసాచుసెట్స్ జనరల్ ఆస్పత్రి పరిశోధకులు ఎలుకలపై చేపట్టిన ప్రయోగంలో ఈ ఫలితాలు రాబట్టారు. నిత్యం వ్యాయామం చేయడం ద్వారా శరీరంలోని వాపు ప్ర్రక్రియను నివారించవచ్చని అథ్యయన రచయిత రుడీ తాంజి పేర్కొన్నారు. వ్యాయామంతో మెదడు పనితీరు మెరుగైన క్రమంలో అల్జీమర్స్‌కు దారితీసే కారకాలు తగ్గుముఖం పట్టినట్టు అథ్యయనంలో గుర్తించారు. ఎలుకలపై చేసిన ప్రయోగంలో వ్యాయామంతో ఉత్తేజితమమ్యే మెదడులో కొత్త న్యూరాన్లు ఏర్పడ్డాయని తేలిందన్నారు. మానవుల్లోనూ వ్యాయామంతో ఇలాంటి ఫలితాలు చేకూరతాయని అథ్యయనం అంచనా వేసింది. మెదడు కణాలను ఉత్తేజితం చేసే మందులను రూపొందించే దిశగా పరిశోధన బాటలు వేస్తుందని చెప్పారు. రోజూ 30 నిమిషాల పాటు వేగంగా నడవడం, జాగింగ్, సైక్లింగ్ల ద్వారా మెదడుకు రక్తసరఫరా, ఆక్సిజన్ మెరుగ్గా అందుతాయని, ఫలితంగా మెదడు పనితీరు సామర్ధ్యం మెరుగుపడుతుందని పరిశోధకులు డాక్టర్ సె హున్ చోయ్ తెలిపారు. అల్జీమర్స్‌తో బాధపడే రోగులు నిత్యం వ్యాయామం చేయడం ద్వారా మంచి ఫలితాలు రాబట్టవచ్చన్నారు. -
బేబీ బ్రెయిన్ అంటే?
గర్భిణీ స్త్రీలు ఎదుర్కొనే ‘బేబీ బ్రెయిన్’ సమస్య గురించి తెలియజేయగలరు. ఈ సమస్యకు సంబంధించిన లక్షణాలను ఎలా తెలుసుకోవాలి? – విజీ, జగిత్యాల సాధారణంగా బేబీ బ్రెయిన్ సమస్యను ప్రెగ్నెన్సీ బ్రెయిన్, అలాగే మొమ్మోసియా అని కూడా అంటారు. ఇది యాభైశాతం గర్భిణీలలో ఉండే అవకాశం ఉంటుంది. ఇది ఎందుకు జరుగుతుందనే దానికి చాలా కారణాలు ఉంటాయి. ఇంకా తెలియని కారణాల కోసం పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ సమయంలో వచ్చే కొత్త మార్పులు, ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ హార్మోన్లు అధికంగా ఉండటం, ఇంకొక జీవం వస్తుందన్న ఆందోళన, ఒత్తిడి, ఆనందం, అలసట, నిద్ర సరిగా లేకపోవడం, వారిని ఎలా పెంచాలి, ఎలా ఉండాలి అనే సందేహాలు, అలా వాటి గురించే ఆలోచిస్తూ ఉండటం వల్ల ఏకాగ్రత లేకపోవడం జరుగుతుంది. కొన్ని విషయాలను మరచిపోవడం వంటిది కూడా జరుగుతుంది. ఈ సమస్యను అధిగమించడానికి కుటుంబ సభ్యుల సహకారం ఎంతో అవసరం. అలాగే ధ్యానం, యోగా, నడక వంటి చిన్నచిన్న వ్యాయామాలు చెయ్యడం వల్ల కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ∙గర్భిణీ స్త్రీలలో spontaneous subarachnoid hemorrhage సమస్య పెరుగుతుందని ఇటీవల చదివాను. దీని గురించి వివరంగా తెలియజేయగలరు. – ఆర్.రజిత, వరంగల్ spontaneous subarachnoid hemorrhage అంటే మెదడుకి, స్కల్బోన్ (పుర్రె ఎముక)కి మధ్యలో ఉండే Arachnoid పొర కింద ఉన్నట్టుండి బ్లీడింగ్ అవ్వడం. ఈ సమస్య గర్భిణీ స్త్రీలకు మాత్రమే కాకుండా ఎవరికైనా రావచ్చు. ఇది ఈ మధ్యకాలంలో నాలుగు శాతం నుంచి ఆరు శాతానికి పెరిగింది. Arachnoid పొర కింద ఉండే రక్తనాళాల్లోని కొన్నింటిలో aneurysm (అంటే రక్తనాళాల్లో కొంతభాగం వ్యాకోచించి కొద్దిగా ఉబ్బి ఉండటం) ఉండి, అది ప్రెగ్నెన్సీలో జరిగే హార్మోన్ల మార్పుల వల్ల, బీపీలో మార్పుల వల్ల ఇంకా బాగా ఉబ్బి, ఉన్నట్టుండి పగిలి రక్తస్రావం అవ్వడం జరుగుతుంది. అలాగే కొందరిలో arteriovenous malformationsఅంటే మంచి రక్తం, చెడు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాలు కలవడం) ఉండి, అవి పగలడం, ఇంకా కొన్ని తెలియని కారణాల వల్ల spontaneous subarachnoid hemorrhage జరుగుతుంది. ఇది ఉన్నట్టుండి జరుగుతుంది కాబట్టి ముందుగానే గుర్తించడం చాలా కష్టం. తలకి దెబ్బ తగలడం వల్ల Arachnoid పొర కింద జరిగే బ్లీడింగ్‌ను Subarachnoid Hemorrhage అంటారు. ఉన్నట్టుండి విపరీతమైన తలనొప్పి, కళ్లు తిరగడం, వికారం, వాంతులు, కళ్లు కనిపించకపోవడం, స్పృహ కోల్పోవడం, ఫిట్స్ రావటం వంటి ప్రమాదకరమైన లక్షణాలు ఉంటాయి. బ్లీడింగ్ వల్ల మెదడుకి రక్త సరఫరా తగ్గడం, రక్తం గడ్డకట్టి మెదడుని అదిమెయ్యడం, మెదడు మీద ఒత్తిడి పెరిగి పైన చెప్పిన లక్షణాలు ఏర్పడతాయి. ఈ సమస్యను గుర్తించడానికి సీటీ స్కాన్, ఎమ్ఆర్ఐ, ఆంజియోగ్రామ్ వంటి పరీక్షలు చేయవలసి ఉంటుంది. ఇది ఎమర్జన్సీ కండీషన్ కాబట్టి వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేసి, చికిత్స చేయవలసి ఉంటుంది. ఎంత జాగ్రత్తగా చికిత్స అందించినా కొందరిలో పరిస్థితి విషమించి ప్రాణాంతకం అయ్యే అవకాశాలు ఉంటాయి. ∙వేసవికాలంలో గర్భిణీ స్త్రీలు తీసుకునే జాగ్రత్తలు, ఆహారం గురించి వివరంగా తెలియజేయగలరు. – జెఎల్, హైదరాబాద్ వేసవి కాలంలో మామూలు వారికే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇక గర్భవతులకైతే ఇబ్బంది ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో వారిలో ఉండే నీరసం, చిన్నచిన్న నొప్పులు, ఆయాసం వంటి ఇబ్బందులు వేసవి కాలంలో ఇంకా ఎక్కువగా ఉంటాయి. డీహైడ్రేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మంచి నీరు ఎక్కువగా తీసుకోవాలి (కనీసం 2–3 లీటర్లు). అలాగే మజ్జిగ, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు కూడా తీసుకోవాలి. ఆహారంలో వేపుళ్లు, నూనె, మసాలా పదార్థాలు ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. ఆకుకూరలు, కూరగాయలు, తాజా పండ్లు తీసుకోవాలి. ఎండలో వీలైనంత వరకు బయటికి వెళ్లకుండా ఉండాలి. తెల్లవారుజామున, సాయంకాలం బాగా చల్లపడిన తర్వాత వాకింగ్ చెయ్యడం ఆరోగ్యకరం. కాటన్ బట్టలు, తేలికగా, లూజుగా, లేత రంగుల బట్టలనే వేసుకోవడం మంచిది. బయటకు వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ లోషన్, సన్‌గ్లాసెస్, గొడుగు లేదా టోపీ వాడాలి. మధ్యాహ్న సమయాల్లో ఒక గంటసేపు నిద్రపోవాలి. ఎండకు కాళ్లవాపులు కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. కాళ్లను ఎత్తుపై పెట్టుకొని కూర్చోవడం, పడుకునేటప్పుడు కాళ్ల కింద దిండును పెట్టుకుంటే కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. - డా‘‘ వేనాటి శోభ రెయిన్బో హాస్పిటల్స్ హైదర్‌నగర్ హైదరాబాద్ -
మనసులో అనుకున్నది గీసేస్తుంది!
టొరెంటో: మనసులో తలచుకునే దానిని చిత్ర రూపంలో చూపించే నూతన టెక్నాలజీని టోరెంటో యూనివర్సిటీకి చెందిన డాన్ నెమ్రోదేవ్ అనే పరిశోధకుడు అభివృద్ధి చేశారు. మెదడులోని తరంగాల కదలికల ఆధారంగా ఇది ముఖ చిత్రాన్ని గీస్తుందన్నారు. ఎలక్ట్రో ఎన్సెఫాలోగ్రఫీ(ఈఈజీ) డేటా ఆధారంగా ఇది పనిచేస్తుందని చెప్పారు. మనం దేనినైనా చూసినప్పుడు మెదడులో ఓ ఊహాచిత్రం ఏర్పడుతుందని, దీనిని ఈఈజీ సాయంతో బంధించి చిత్రం రూపంలోకి తీసుకురాగలమని పేర్కొన్నారు. నాడీ తరంగాల ఆధారంగా మనసులో గుర్తుంచుకున్న, ఊహించుకునే అంశాలను కూడా ఇది చిత్రీకరించగలదని వర్సిటీకి చెందిన ఆడ్రియాన్ నెస్టర్ తెలిపారు. ఇది విజయవంతమైతే నేరాల్లో ప్రత్యక్ష సాక్షుల మెదడు కదలికల ఆధారంగా నేరస్థుల చిత్రాలను గీయగలదని చెప్పారు. మాట్లాడలేని వారి మనసులో ఏముందో కూడా గుర్తించగలదన్నారు. అయితే దీనిని మరింత అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. పరిశోధన వివరాలు ఈన్యూరో జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
ఆ సమయంలో ఇవి తింటే స్మార్ట్ కిడ్..
న్యూయార్క్: మీరు తల్లి కాబోతున్నారా? చురుకైన, తెలివైన స్మార్ట్‌కిడ్ కావాలని కలలు కంటున్నారా? అయితే మీలాంటి వారికోసమే ఈ వార్త. బిడ్డ మెదడు ఎదుగుదల సక్రమంగా ఉండాలంటే గుడ్డులోని పచ్చసొన, నట్స్, క్యాబేజీ జాతికి చెందిన కూరగాయలు వంటి ఆహారాలు విరివిగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది పుట్టబోయే బిడ్డ మెదడుకు, జ్ఞాపక శక్తికి మంచి బూస్ట్ ఇస్తుందని తాజా అధ్యయనం తేల్చింది. అంతేకాదు గర్భధారణ సమయంలో విటమిన్ బి కాంప్లెక్స్ సముదాయములోని కోలైన్ విరివిగా తీసుకోవాలని చెబుతోంది. గర్భం దాల్చిన మహిళలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది ఎపుడూ పెద్ద ప్రశ్నే. ఎంత చదువుకున్న మహిళలైనా ఈ విషయంలో తర్జన భర్జన పడుతూనే ఉంటారు. అయితే గర్భధారణలో చివరి మూడు నెలల్లో తీసుకునే ఆహారం చాలా ముఖ్యమని తాజా అధ్యయనం చెబుతోంది. ముఖ్యంగా కొవ్వు తీసేసిన ఎర్ర మాంసం, (లీన్ రెడ్ మీట్) చేపలు, గుడ్లు, తృణధాన్యాలను ఎక్కువగా తీసుకుంటే శిశువు ఆరోగ్యంగా ఎదుగుతుందని ఈ అధ్యయనం తేల్చింది. రోజువారీ ఈ ఆహార పదార్ధాల వినియోగంతో బిడ్డల ఎదుగుదలలో వేగం, విజువల్ జ్ఞాపకశక్తి నాలుగు, ఏడు, 10 , 13 నెలల వయస్సులో మెరుగుపర్చిందని ఈ అధ్యయనం సూచించింది. గర్భధారణ సమయంలో అధికంగా తీసుకోవాల్సిన కోలిన్ చాలామంది మహిళలు చాలా తక్కువ మోతాదులో తీసుకుంటున్నారనీ, రోజుకు సిఫార్సు చేయబడిన 450 మిల్లీగ్రాముల కన్నా తక్కువ వినియోగిస్తారు. కానీ, గర్భధారణ చివరి త్రైమాసికంలో ప్రతిరోజూ సిఫార్సు చేసిన కొలైన రిచ్ ఫుడ్స్ తినడం రెండుసార్లు కంటే ఎక్కువ తీసుకోవాలని తద్వారా పాపాయి ఎదుగుదల బావుంటుందని అధ్యయనం చెబుతోంది. ఆప్టిమల్ కాగ్నిటివ్ ఎబిలిటీస్ (సంక్లిష్ట సామర్ధ్యాలు మెదడు-ఆధారిత నైపుణ్యాలు:సరళంనుంచి చాలా సంక్లిష్టమైన పని అయినా నేర్చుకోవడం, జ్ఞాపకం చేసుకోవడం, పరిష్కారం, శ్రద్ధ వహించడం లాంటివి) మెరుగుపడతాయని తెలిపింది. న్యూయార్క్‌లోని కార్నెల్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ , మేరీ కాడిల్ ఆధ్వర్యంలో ఈ స్డడీ జరిగింది. తమ అధ్యయనంలో భాగంగా రెండు గ్రూపుల గర్భిణీలను పరిశీలించినట్టు చెప్పారు. మొదటి గ్రూపునకు రోజు కోలిన్ 930 మి.గ్రా. ఇవ్వగా, రెండవ గ్రూపునకు రోజుకు 480మి.గ్రా ఇవ్వగా ఇద్దరిలోనూ వేగమైన ప్రయోజనాలు కలిగినప్పటికీ రెండవ గ్రూపు కంటే.. మొదటి గ్రూపులోని పిల్లలు మెదడు అభివృద్ధి గణనీయమైన ఫలితాలు కనిపించాయని స్టడీ పేర్కొంది. ఎఫ్ఏఎస్ఈబీ అనే జర్నల్ ఈ అధ్యయనం ప్రచురితమైంది. -
ఆడవాళ్లలోనే ఆ గుణం ఎక్కువట...
న్యూయార్క్ : ఇచ్చి పుచ్చుకోవడంలో ఎంతో ఆనందం ఉంటుందని ఎంతో మందికి అనుభవ పూర్వకంగా తెల్సిందే. అయితే ఈ ఇచ్చి పుచ్చుకోవడంలో మగవారికి, ఆడవారికి మధ్య ఏమైనా తేడా ఉంటుందా? ఈసందర్భంగా వారి మెదళ్లలో ఎలాంటి మార్పులు కలుగుతాయి? అన్న ప్రశ్నలక ఓ తాజా అధ్యయనం సమాధానాలు చెబుతోంది. డబ్బు రూపంలో ఒకరికి సహాయం చేయడంలో ఆడవాళ్లకు ఎక్కువ ఆనందం ఉంటుందట. ఆ సమయంలో వారి మెదళ్లలోని ఒక ప్రాంతం మరీ క్రియాశీలకంగా పనిచేస్తుందట. మగవాళ్లలో పరులకు డబ్బు ఇవ్వకుండా తమ వద్దనే దాచుకున్నప్పుడే ఎక్కువ ఆనందం కలుగుతుందట. అప్పుడు వారి మెదల్లో కూడా మహిళల్లాగానే ఒకో చోట క్రియాశీలక మార్పులు కలుగుతాయట. అంటే ఆడవాళ్లు ఇతరులకు సాయం చేసినప్పుడు వచ్చే ఆనందం ద్వారా వారి మెదడులో ఎక్కడైతే మార్పులు సంభవిస్తాయే మగవారు డబ్బును తమ వద్దనే ఉంచుకోవడం ద్వారా కలిగే ఆనందానికి కూడా వారి మెదళ్లలోకూడా అదే ప్రాంతంలో మార్పులు కలుగుతాయట. ఈ విషయాన్ని ఎంపిక చేసిన 56 మంది స్త్రీ, పురుషులపై ప్రయోగాత్మకంగా అధ్యయనం జరిపి తేల్చారు. వారిలో కొందరి మగవారిని, కొందరి ఆడవారిని మాత్రమే ఇతరులకు డబ్బులు ఇవ్వాల్సిందిగా సూచించి, మిగతా వారికి డబ్బులు తమ వద్దనే ఉంచుకోవాల్సిందిగా సూచించడం ద్వారా ఈ ప్రయోగం జరిపారు. ఈ సందర్భంగా వారి మెదళ్లలో కలిగే మార్పులను స్కానింగ్ ద్వారా నమోదు చేశారు. మగవాళ్లకన్నా, ఆడవాళ్లే ఇతరులకు సహాయం చేయడంలో ఆనందం పొందుతారని, వారిలోనే సామాజిక స్పహ ఎక్కువగా ఉంటుందన్న విసయం పదేళ్ల క్రితమే తెల్సిందని, అయితే ఈ సందర్భంగా పరస్పర విరుద్ధ ప్రవర్తనకు ఆడ, మగ ఇరువురిలోనూ మెదడులోని ఒకే ప్రాంతం స్పందిస్తుందన్న విషయం తాజా అధ్యయనంలో తేలిందని జూరిచ్ యూనివర్శిటీలో న్యూరోఎకనామిక్స్, సోషల్ న్యూరోసైన్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఫిలిప్పే టాబ్లర్, జార్జియా స్టేట్ యూనివర్శిటీలో న్యూరోసైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న అన్నే జీ మర్ఫీలు తెలిపారు. ఇచ్చిపుచ్చుకోవడంలో ఆడ,మగ ఆనందాన్ని ప్రభావితం చేస్తున్న మెదడు ప్రాంతానికి స్కిజోఫ్రేనియా లాంటి మానసిక జబ్బులను నయం చేసేందుకు ఇచ్చే మందులను ఇచ్చి కూడా అధ్యయనం జరిపామని, ఆశ్చర్యంగా ఆడవాళ్లలో ఇతరులకు ఇవ్వాలనే స్పృహ, మగవాళ్లలో తన వద్దనే ఉంచుకోవాలనే స్వార్ధ చింతన తగ్గిందని వారు చెప్పారు. ఎలుకల్లో కూడా సహజంగానే ఈ సేవా గుణం ఆడ ఎలుకల్లోనే ఎక్కువగా ఉంటుందని వారు తెలిపారు. ఆడ, మగ మెదళ్ల నిర్మాణాల్లో ఉన్న భేదాల కారణంగా వారిలో సహాయ, స్వార్థ చింతనలు కలగడం లేదని, ప్రవర్తనా రీత్యనే వారిలోగానీ, వారి మెదళ్లలోగానీ ఇలాంటి మార్పులు సంభవిస్తున్నాయని వారు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా చారిత్రకంగా, సామాజిక వచ్చిన పరివర్తనే వారి ప్రవర్తనలో మార్పునకు కారణౖమై ఉంటుందని వారు అన్నారు. పిల్లలను కనడం, పోషించం లాంటి బాధ్యతల వల్ల ఆడవాళ్లలో సామాజిక సేవా గుణం వచ్చి ఉంటుందని వారు వివరించారు. వారు తమ అధ్యయన పూర్తి వివరాలను ‘నేచర్ హ్యూమన్ బిహేవియర్’ తాజా సంచికలో ప్రచురించారు. -
మెదడుకు చురుకుదనం
⇔ అరటిపండులో చక్కెర... సుక్రోజ్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్ వంటివి సహజరూపంలో ఉంటాయి. పీచు పదార్థాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. రెండు అరటిపండ్లు తింటే 90 నిమిషాల సేపు పని చేయవచ్చని పరిశోధనల్లో రుజువైంది. అందుకే క్రీడాకారులు ఎక్కువగా అరటిపండు తీసుకుంటారు. అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవడానికి అరటిపండు మంచి ఆహారం. కాబట్టి ప్రతిరోజూ అరటిపండు తింటే శక్తితోపాటు జీర్ణవ్యవస్థ పని తీరు మెరుగవుతుంది. ⇔ ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ (పిఎంఎస్) సమస్య ఉన్న వాళ్లు పీరియడ్స్‌కు కనీసం వారం ముందు నుంచి ప్రతిరోజూ అరటిపండు తింటుంటే ఆ సమయంలో ఆందోళన, ఉద్వేగం వంటి లక్షణాలు అదుపులో ఉంటాయి. ⇔ డిప్రెషన్ వ్యాధిగ్రస్తుల మానసిక స్థితిలో అరటిపండు తినడానికి ముందు, తిన్న తర్వాత గణనీయమైన మార్పులు వస్తున్నట్లు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ⇔ ఇందులో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఎనీమియాను అరికడుతుంది. బ్లడ్‌ప్రెజర్‌ను అదుపులో ఉంచుతుంది. గుండెపోటును నివారించడంలో బాగా పని చేస్తుంది. ⇔ ఇందులోని పొటాషియం మెదడును అప్రమత్తంగా ఉంచుతుంది. రెండు వందల మంది విద్యార్థుల మీద నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం నిర్థారణ అయింది. క్రమం తప్పకుండా ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో కాని, మధ్యాహ్న భోజనం తర్వాత కాని అరటిపండు తిన్న వారిలో మెదడు మరింత చురుకుగా పని చేస్తుందట. -
మెదడు అతి స్పందనతోనే దురద.. గోకుడు!
దురద పుట్టినప్పుడు అక్కడ గోక్కుంటే ఎంతో హాయిగా ఉంటుంది కదూ. కానీ ఆ తర్వాతే కాసేపటికల్లా మంట పుడుతుంది. కానీ.. అలా గోక్కోవాలి అనిపించడానికి.. మెదడు అతిగా స్పందించడమే కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గోక్కుంటున్నప్పుడు మొదట్లో బాగానే ఉంటుంది గానీ, మరీ ఎక్కువగా గోకితే మాత్రం అక్కడ దురద ఇంకా పెరుగుతుందని, అలాగే నొప్పితో పాటు చర్మం మీద కూడా మచ్చలు పడతాయని ఈ అంశం మీద పరిశోధన చసిన హిడెకి మొచిజుకి అనే అసిస్టెంట్ ప్రొఫెసర్ చెప్పారు. ఆయన అమెరికాలోని టెంపుల్ యూనివర్సిటీ ఆఫ్ మెడిసిన్‌లోని డెర్మటాలజీ విభాగంలో పనిచేస్తున్నారు. బాగా దురదలు ఎక్కువగా ఉండే కొంతమంది రోగులతో పాటు, పదిమంది ఆరోగ్యవంతులైన వారిని ఈ పరిశోధన కోసం తీసుకున్నారు. వారికి అత్యాధునికమైన ఎఫ్ఎంఆర్ఐ నిర్వహించి చూశారు. దురదలు ఎక్కువగా ఉండి, గోక్కునేటప్పుడు వారికి మెదడులో ఉండే మోటార్ కంట్రోల్, రివార్డ్ ప్రాసెసింగ్ భాగాలు బాగా ఉత్తేజితం అయినట్లు గుర్తించారు. ఇలా అతిగా ఉత్తేజితం కావడం వల్లే గోక్కోవాలని అనిపిస్తుందని తమ పరిశోధన వ్యాసంలో పేర్కొన్నారు. వాళ్లకు దురద పుట్టడం కోసం ఈ పరిశోధన సమయంలో దురద గుంట ఆకు ఉపయోగించారు.