How to Brain Sharp in Telugu: Steps and Tips to Keep Your Brain Healthy - Sakshi
Sakshi News home page

బ్రెయిన్‌ షార్ప్‌గా ఉండాలంటే.. ఏం చేయాలి?

Published Fri, May 13 2022 12:35 PM | Last Updated on Fri, May 13 2022 3:31 PM

Steps and tips to Keep your Brain Healthy - Sakshi

మనిషికి శారీర ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం. శారీరక శ్రమ ముఖ్యంగా మెట్లు ఎక్కడం ద్వారా అధిక కొవ్వును  కరిగించుకోవచ్చు. అలాగే మెట్లు ఎక్కితే మెదడువికాసానికి, మెదడు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని పరిశోధకులు  వెల్లడించారు. జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే వ్యాయామాల తోపాటు మెట్లు ఎక్కడం లాంటివి ఎక్సర్‌సైజ్‌  చేయడం  బ్రెయిన్‌ ఫిట్‌నెస్‌కు చాలా మంచిదట. ముఖ్యంగా వయసు పెరుగుతున్నవారు   క్రమం తప్పకుండా  చిన్నగా మెట్లు ఎక్కుతూ మెద‌డుని చురుగ్గా ఉంచుకోవాల‌ని ప‌రిశోధ‌కులు సూచిస్తున్నారు. వృద్ధాప్యంలో వేధించే అల్జీమర్స్‌ లాంటి బారిన పడకుండా ఈ వ్యాయామం అద్భుత‌మైన మేలు చేస్తుందని చెబుతున్నారు.


మెట్లు ఎక్కితే శ‌రీరానికి మంచిద‌ని, చ‌క్కని  వ్యాయామం అందుతుంద‌ని మ‌న‌కు తెలుసు.  మెట్లు ఎక్కడం వ‌ల‌న మెద‌డుకి కూడా చాలా మేలు క‌లుగుతుందట. తక్కువ వ్యవధిలో, తేలికగా మెట్లు ఎక్కడంవల్ల బాడీ, మైండ్‌ ఫిట్‌నెస్‌కు చాలా మంచిదని ఒక స్టడీలో తేలింది. జర్మనీలోని కార్ల్‌ శ్రహే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ పరిశోధకులు తమ అధ్యయనంలో పేర్కొన్నారు.

ప్రతిరోజూ మెట్లు ఎక్కడం వలన చురుగ్గా ఉండటం తోపాటు,  క్తితో నిండిన అనుభూతిని కలిగిస్తుందని, ఇది మన ఆరోగ్యాన్ని మరింత ఉత్తేజితం చేస్తుందని సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌లో  అధ్యయన వేత్తలు వెల్లడించారు.  అలాగే  చిన్నచిన్న తేలిక పాటి  ఇతర వ్యాయామాల ద్వారా  వృద్ధులు తమ మెదడును యవ్వనంగా ఉంచుకోవచ్చని తెలిపారు. 

అనేక  రకాల ఇతర  శారీరక శ్రమలతో పోల్చితే, రోజుకు కనీసం ఒక్కసారైనా  మెట్లు ఎక్కడం చాలా మంచిదని కెనడా పరిశోధకులు న్యూరోబయాలజీ ఆఫ్ ఏజింగ్ జర్నల్‌లో వెల్లడించారు. 19 నుండి 79 సంవత్సరాల వయస్సు గల 331 మంది ఆరోగ్యవంతమైన పెద్దల భౌతిక మెదడుపై వారం రోజులపాటు పరిశోధన నిర్వహించారు. ఈ స్టడీలో వారి బ్రెయిన్‌ ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి ఎంఆర్‌ఐ స్కాన్‌లను పరిశీలించారు.

క్రమం తప్పకుండా  మెట్లు ఎక్కినవారి మెదడు చురుకుగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. బాగా చదువుకున్న వారిలో  భౌతిక మెదడు వయస్సు దాదాపు ఒక సంవత్సరం తక్కువగానూ,  రోజు మెట్లు ఎక్కే వారి భౌతిక మెదడు వయస్సు అర సంవత్సరం తగ్గినట్టు పరిశోధకులు తెలిపారు. మెట్లు ఎక్కడం వలన చ‌దువుకుంటున్న వారిలో మెద‌డులోని నాడీ క‌ణ‌జాలం సంకోచించ‌కుండా కాపాడి, మెదడు చురుగ్గా, మరింత యవ్వనంగా తయారువుతుందట.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమయానికి భోజనం చేయడం, మానసిక ఒత్తిడికి దూరంగా  ఉండటం,  పుస్తకాలు, చదవడం,  సామాజికంగా చురుగ్గా ఉండటం రోజుకు  కనీసం ఏడు గంటల నిద్ర  మెదడు ఆరోగ్యానికి చాలా అవసరం. అలాగే షుగర్‌, బీపీ లాంటి వ్యాధులను బారిన పడకుండా ముందునుంచీ జాగ్రత్త పడాలి.  థైరాయిడ్‌, షుగర్‌, బీపీ వ్యాధులను నియంత్రణలో ఉంచుకోవడం చాలా కీలకం.  మెదడు ఆరోగ్యంగా, చురుగ్గా పనిచేయాలంటే.. రోజువారీ జీవితంలో లిఫ్ట్‌లకు, ఎలివేటర్స్‌కు సాధ్యమైనంత వరకు బైబై  చెప్పేసి  మెట్టు ఎక్కితే  మెదడు పదిలంగా ఉంటుంది. మన మెదడు నిత్య యవ్వనంగా, ఆరోగ్యంగా  ఉండాలంటే.. మెదడును ఎంత ఉల్లాసంగా ఉంచితే  అంత మంచిదన్నమాట. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement