Weight Loss Tips: బరువు తగ్గాలి అంటే వ్యాయామం, డైటింగ్ ఒక్కటే సరిపోదు. సరైన వ్యాయామంతో పాటు ఆరోగ్యకరమైన తిండి, నిలకడగా వ్యాయామాలు చేయడం కొంచెం ఓపిక అవసరం. బరువు తగ్గడానికి అయినా పెరగడానికి అయినా వ్యాయామాల పాత్ర 20 శాతం ఉంటే, ఆహారం పాత్ర 80 శాతం ఉంటుంది.
సాధారణ మనిషికి రోజుకు 2,200 క్యాలరీలు అవసరం. బరువు తగ్గాలనుకునే వారు తక్కువ తమకు అవసరమైన దానికన్నా తక్కువ క్యాలరీలు ఉండే ఆహారం తీసుకోవాలి. అంటే మన శరీరానికి 2,200 క్యాలరీలు అవసరమనుకుంటే, అంతకన్నా కొద్దిగా తక్కువ క్యాలరీలు ఉండేలా చూసుకోవాలి.
ఉదాహరణకు: రోజుకు 2000 క్యాలరీలు ఇచ్చే ఆహారం తీసుకోవాలి. అది కూడా ఆరోగ్యకరమైన ఆహారం... అంటే కూరగాయలు, పళ్ళు, మాంసకృత్తులు, ఓట్స్ లాంటివి తీసుకోవాలి.
ముందుగా ఇంతకుముందు తింటున్న ఆహార పరిమాణాన్ని కొంచెం తగ్గించాలి. తీపి పదార్థాలు, శీతల పానీయాలు, బయట తిండి పూర్తిగా తగ్గించాలి. తోపుడు బండి వాళ్ల దగ్గరి నుంచి ఫైవ్ స్టార్ హోటల్ వాళ్ల వరకూ అందరూ తమ ఆహారం రుచిగా ఉండాలి అనే కోరుకుంటారు గాని ఆరోగ్యంగా ఉండాలి అని కాదు.
ఆరోగ్యం అంటే శుభ్రత ఒకటే కాదు, తక్కువ క్యాలరీలు అని కూడా. ఎంతసేపు చేస్తున్నాము అన్నదానికన్నా ఎంత తీవ్రతతో చేస్తున్నాము, ఎన్ని క్యాలరీలు కరిగిస్తున్నాం అన్నది ముఖ్యం.
ఉదా – ఒక గంటన్నర నడవడం వల్ల 500 క్యాలరీలు కరిగితే, 45 నిముషాలపాటు చేసే వర్కవుట్స్ వల్ల కూడా 500 క్యాలరీలు కరుగుతాయి. కాబట్టి చేసే వ్యాయామాల వల్ల రోజుకు ఎన్ని క్యాలరీలు కరుగుతాయో అంచనా వేసుకుని అందుకు తగ్గట్టు తినడం వల్ల మాత్రమే ఆరోగ్యంగా బరువు తగ్గగలం. లేదంటే బరువు తగ్గినా, నీరసం, అనారోగ్యం పాలవక తప్పదు.
చదవండి: Stammering: మాట్లాడేటపుడు నత్తి వస్తోందా? ఈ చిట్కాలు పాటించారంటే!
Comments
Please login to add a commentAdd a comment