బరువు తగ్గే ప్రక్రియ అందరికీ ఒకేలా ఉండదు. కొందరికి బరువు తగ్గడం అంటే అదొక యజ్ఞం. కొందరు జిమ్‌కు వెళ్లి వర్కౌట్స్ చేస్తారు. మరికొంతమంది యోగాసనాలతో ఈజీగా బరువు తగ్గుతారు. మరికొంతమంది వాకింగ్, జాగింగ్ ద్వారా తమ అధిక బరువును తగ్గించు కుంటారు. మరికొందరు ఇవన్నీ చేస్తారు. జిమ్‌కు వెళ్లకుండానే సాహిబా ఏకంగా 16 కిలోల బరువు తగ్గింది. తన వెయిట్ లాస్ జర్నీని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
సాహిబా మొదట్లో 104 కిలోల బరువు ఉండేది. దీంతో ఎలాగైన బరువు తగ్గించుకోవాలని నిశ్చయించుకుంది. దీనికి రోజూ 10-20 వేల అడుగులు నడిచేది. అంతేకాదు ఎన్ని కేలరీల ఫుడ్ తింటున్నదీ నిత్యం పరిశీలించుకుంటూ ఉండేది. ఆహార నియమాలను పాటించి భారీగా బరువు తగ్గింది. ప్రస్తుతం 87.85 కిలోల బరువుకు చేరింది.
ఇంట్లోనే కొంత కార్డియో చేసానని ,స్కిప్పింగ్ వ్యాయామం కూడా చేసినట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా కొన్ని చిట్కాలను కూడా తన ఫాలోవర్స్‌కు అందించింది. అధిక బరువు ఉన్నవారు అరగంట నడకతో ప్రారంభించి, వారి వారి కంఫర్ట్ జోన్‌కు అనుగుణంగా ఈ సమయాన్నిపెంచుకోవాలని సూచించింది.
16 కిలోల బరువు తగ్గడానికి స్టెప్స్ సాహిబా మాటల్లో
పూర్తిగా ఉపవాసం కాకుండా మితంగా తిన్నాను.
కోరుకున్నది తిన్నారు. తగ్గించి తింటూ కేలరీలను ట్రాక్ చేసుకున్నాను.
ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్ 12:12 (12గం ఉపవాసం 12గం తినడం)
శరీరం దీనికి సహకరిస్తే ఈ ఉపవాసాన్ని పెంచుకోవచ్చు.
డయాబెటిక్ లేదా కొన్ని మందులు తీసుకుంటే ఉపవాసం వద్దు.
16:8 ఉపవాస పద్ధతిలో రోజుకు 16 గంటల పాటు ఉపవాసం.
ప్రోటీన్ , ఫైబర్ ఎక్కువ, పిండి పదార్థాలు , కొవ్వు తక్కువ ఉన్న ఆహారం
దేన్ని ఎలా తినాలి అనేది లెక్క వేసుకోవాలి.
నీటిని తాగుతూ హైడ్రేట్ గా ఉంచుకున్నారు.
జిమ్‌కు వెళ్లకూడదని కాదు!
అయితే జిమ్‌కి వెళ్లడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా చెప్పింది. అయితే, అందరికీ ఆర్థిక స్థోమత ఉండదు కాబట్టి, తానూ కూడా ఆర్థిక భారం లేకుండా ఈ పద్ధతిని ఎంచుకున్నట్టు వెల్లడించింది.
నోట్: మనం ముందే అనుకున్నట్టుగా వెయిట్ లాస్ జర్నీ అనేది అందరికీ ఒకేలా ఉండదు. వారి వారి వ్యక్తిగత ఆరోగ్యం , పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఎవరి శరీర తత్వానికి తగ్గట్టు, మన బాడీ అందించే సంకేతాలను గుర్తించాలనే గమనించాలి. ఇటీవల విద్యాబాలన్ చెప్పినట్టు మన బరువు గుట్టు ఏంటి అనేది తెలుసుకుని రంగంలోకి దిగాలి.
ఇదీ చదవండి : డైట్ చేస్తున్నారా? బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ రాగుల ఉప్మా
Comments
Please login to add a commentAdd a comment