ప్రస్తుతం బిజీ లైఫ్‌లో శారీరక శ్రమ అనేది కాస్త కష్టమైపోయింది. ఏదో ఒక టెన్షన్‌తో రోజు గడిచిపోతుంది. ఇక వ్యాయామాలు చేసే టైమ్ ఏది. కనీసం నాలుగు అడుగులు వేసి వాకింగ్ చేద్దామన్నా.. కుదరని పరిస్థితి. అలాంటి వారు ఈ సింపుల్ 6-6-6 వాకింగ్ రూల్ ఫాలో అయితే చాలు.. సులభంగా వాకింగ్, వ్యాయామాలు చేసేయొచ్చు. మంచి ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందొచ్చు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అత్యంత బిజీగా ఉండే వ్యక్తులకు ఈ రూల్ చక్కగా ఉపయోగపడుతుందని తెలిపారు. ఇంతకీ అదెలాగంటే..
రోజువారీ శారీరక శ్రమను పెంచేలా చిన్న చిన్న.. సెషన్‌లుగా విభజించే వాకింగ్ రూల్ ఇది. ఏం లేదు..జస్ట్ రోజు ఆరు నిమషాలు ఆరు సార్లు చొప్పున వారానికి ఆరు రోజులు చేయాలి. ఆరు నిమిషాలు చొప్పున నడక కేటాయించండి ఎక్కడ ఉన్నా.. ఇలా రోజంతా ఆరు నిమిషాల నడక..ఆరుసార్లు నడిచేలా ప్లాన్ చేసుకుండి.
ఇలా వారానికి ఆరురోజులు చేయండి. ఈ విధంగా నడకను తమ దినచర్యలో భాగమయ్యేలా చేసేందుకు వీలుగా ఈ నియమాన్ని రూపొందించారు. ఆయా వ్యక్తులు తమ సౌలభ్యానికి అనుగుణంగా దీన్ని ఏర్పాటు చేసుకుంటే చాలు.. సులభంగా వాకింగ్ చేసి..మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ప్రయోజనాలు..
హృదయ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది
రక్తపోటుని తగ్గించి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
మెరుగైన మాసిక ఆరోగ్యం సొంతం
ఈ చిన్న చిన్న వాకింగ్ సెషన్‌లు ఒత్తిడి, ఆందోళనలను దూరం చేస్తుంది.
రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.
కీళ్ల సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
బరువు అదుపులో ఉంటుంది.
చాలా చిన్నసెషన్‌ల నడక అయినప్పటికీ..క్రమం తప్పకుండా వారమంతా చేయడం వల్ల చక్కగా కేలరీలు బర్న్ అయ్యి జీవక్రియ మెరుగ్గా ఉంటుంది. ఈ నియమం హృదయ సంబంధ ఫిట్‌నెస్, మానిసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. అలాగే అత్యంత ప్రభావవంతంగా కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పాటించే ముందు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంపందించడం మంచిది.
(చదవండి: ఫేమస్ బ్రిటిష్ మ్యూజిక్ బ్యాండ్ లోగోకి ప్రేరణ కాళిమాత..!)
Comments
Please login to add a commentAdd a comment