నడక అన్ని వయసుల వారికి సరిపడే చక్కటి వ్యాయామం. క్రమ తప్పకుండా వాకింగ్ చేస్తే ఫిట్‌గా ఉండటమేకాదు ఆరోగ్య ప్రయోజనాలు కూడా మెండుగా ఉన్నాయి. రోగ నిరోధకశక్తి బలపడి, మంచి ఆయుర్దాయానికి సాయపడుతుంది.
నడక వల్ల ప్రయోజనాలు
♦ నడకతో శరీరంలోని కొవ్వు నిల్వలు కలుగుతాయి. క్రమం తప్పకుండా వాకింగ్ చేస్తే ఊబకాయం కూడా నెమ్మదిగా కరుగుతుంది.
♦ రోజంతా మనసు హాయిగా, తేలిగ్గా ఉంటుంది. కొత్త ఉత్సాహం వస్తుంది. రోగనిరోధక శక్తి పెరిగి జలుబు లేదా ఫ్లూ ప్రమాదం తగ్గుతుంది.
♦ రోజుకు కనీసం 30 నిమిషాలు, వారానికి ఐదు రోజులు నడవడం వల్ల గుండెకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. కొరోనరీ హార్ట్ డిసీజ్ ప్రమాదాన్ని దాదాపు 19 శాతం తగ్గించవచ్చు. రోజూ వాకింగ్ దూరాన్ని పెంచుకుంటే ఫలితాలు ఇంకా బావుంటాయి.
♦ రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడుతుంది
♦ తిన్న తర్వాత కొద్దిసేపు నడవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
♦ అల్పాహారం, భోజనం , రాత్రి భోజనం తర్వాత ఇలా రోజుకు మూడుసార్లు వాకింగ్ చేస్తే మంచిది.
♦ కీళ్ల నొప్పులు తగ్గుతాయి. నడక కాళ్ళ కండరాలను బలోపేతం చేస్తుంది
♦ ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి కూడా చిన్నపాటి నడక ప్రయోజనాలను అందిస్తుంది.
♦ ముఖ్యంగా ఆరుబయట నడిచినపుడు సృజనాత్మక ఆలోచనలు పెరుగుతాయని పరిశోధకులు గుర్తించారు.
నోట్: వాకింగ్‌కోసం ఉపయోగించే స్థలాలు, లేదా పార్క్‌లు ఎంచుకోవాలి. వాకింగ్‌కు అనువుగా దృఢమైన బూట్లు ధరించాలి. వదులుగా, సౌకర్యవంతమైన దుస్తులు ధరిస్తే మంచిది. నడకకు ముందు పుష్కలంగా నీరు తాగితే బెటర్. ఇది మన బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. మరీ ఎండలో కాకుండా, ఎండ తక్కువగా ఉన్నపుడు, నీడ ప్రదేశంలో వాకింగ్ చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment