Health Tips In Telugu: Best Foods To Boost Brain Health And Memory Power - Sakshi
Sakshi News home page

Health Tips In Telugu: పాలకూర, టీ, చేపలు.. ఇంకా.. వీటితో బ్రెయిన్‌ పవర్‌ పెంచుకోవచ్చు!

Published Wed, Apr 20 2022 10:40 AM | Last Updated on Wed, Apr 20 2022 3:31 PM

Health Tips In Telugu: Foods That Can Boost Brain Health Memory Power - Sakshi

బుర్రకు పదును పెట్టే కొన్ని రకాల ఆహార పదార్థాల గురించి వినే ఉంటారు. ఇవి తీసుకుంటే మేధస్సు వికసిస్తుందని, తెలివితేటలు పెరుగుతాయని, ఈ ఆహారం తీసుకుంటే చాలు మీకిక తిరుగులేని జ్ఞాపకశక్తి లభిస్తుందనీ సామాజిక మాధ్యమాలలో చాలా రకాల ఆహార పానీయాలు చక్కర్లు కొడుతుంటాయి.

వాటిలో ఎంత వరకు నిజముంటుందో తెలియదు కానీ, మెదడుకు మేత పెట్టే కొన్ని రకాల ఆహారాల గురించి హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ ప్రొఫెసర్, మాసాచుసెట్స్‌ జనరల్‌ హాస్పిటల్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ న్యూట్రిషనల్‌ అండ్‌ లైఫ్‌స్టైల్‌ సైకియాట్రీ డాక్టర్‌ ఉమానాయుడు మెదడుకు పదును పెట్టే కొన్ని రకాల ఆహార పదార్థాల గురించి చెబుతున్నారు. 

పండ్లు, కూరగాయలు, హోల్‌ గ్రెయిన్స్, అన్‌సాచురేటెడ్‌ ఫ్యాట్స్, తక్కువ మొత్తంలో తీసుకునే రెడ్‌ మీట్‌ అల్జీమర్స్‌ అనే ఒక విధమైన మతిమరపు వ్యాధిని నిరోధిస్తాయని తెలిసిందే. వీటితో కూడా బ్రెయిన్‌ పవర్‌ పెంచుకోవచ్చు.

పాలకూర: ఏకాగ్రతను పెంచడంతో పాటు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది..
కాఫీ/ టీ: రోజూ రెండు నుంచి మూడు కప్పులకు మించకుండా తాగే కాఫీ లేదా టీ వల్ల మెమరీ పెరుగుతుంది. చురుకుగా ఉండేందుకు దోహదపడుతుంది.
చేపలు: ఆహారపుటలవాట్లను బట్టి,ఇష్టాయిష్టాలను బట్టి వారానికి ఒకటి లేదా రెండుసార్లు చేపలు తింటే ఏకాగ్రత పెరుగుతుంది.. 
క్యారట్‌: వయసు పెరగడం వల్ల వచ్చే మెమరీ సమస్యలను తగ్గిస్తుంది..
వాల్‌ నట్స్‌: జ్ఞాపకశక్తి పెరగడంతోపాటు స్కిల్స్‌ మెరుగుపడుతాయి.

ఇవి మనం తీసుకునే ఆహారం... వీటితోపాటు పజిల్స్‌ పూరించడం, చెస్‌ ఆడటం, చిన్నప్పుడు విన్న పద్యాలు, ఇష్టమైన పాటలు గుర్తు చేసుకుంటూ వాటిని రాయడం వంటి మెదడుకు పెట్టే మేత వల్ల కూడా జ్ఞాపక శక్తి పెరుగుతుంది.  

చదవండి: ఉడికించిన పచ్చి మామిడికాయ రసంలో ఉప్పు , జీలకర్ర కలిపి రోజూ తాగితే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement