మనిషి తన టాలెంట్‌ని వెలకితీసి మరీ రకరకాలుగా సంగీతాన్ని సృష్టిస్తున్నాడు. తన గాత్రంతో లేదా తన అవయవాలతో రకరకాల విన్యాసాలు చేసి మరి సృష్టించడం చూశాం. మనిషిలోని మెదడు తరంగాల ఆధారంగా మ్యూజిక్‌ని సృష్టించడం గురించి విన్నారా!. ఔను తాజాగా సైంటిస్టులు ఆ కొత్త విషయాన్ని కనిపెట్టారు. కేవలం మనిషిలోని మెదడు తరంగాల ఆధారంగా సంగీతాన్ని పునర్నిర్మించారు. అందుకు అమెరికాలోని బర్కలీలో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకుల బృందం మూర్చ రోగులపై పరిశోధనలు జరిపారు. 1979 నాటి పింక్ ఫ్లాయిడ్ మూవీలోని క్లాసిక్ పాట "అనదర్ బ్రిక్ ఇన్ ది వాల్" పాటను మూర్చ రోగులకు వినిపించారు. ఆ సమయంలో వారి మెదడులో ఉత్ఫన్నమయ్యే సంకేతాల ను పదాలుగా అర్థమయ్యేలా ప్రసంగంగా మార్చి పునర్నిర్మించడంలో విజయవంతమయ్యారు పరిశోధకులు.
తొలిసారిగా శాస్త్రవేత్తలు బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్‌ఫేస్‌లను(బీసీఐ) ఉపయోగించి సంగీతాన్ని పునః సృష్టించారు. 2009 నుంచి 2015 మధ్య న్యూయార్క్‌లోని అల్బానీ మెడికల్ సెంటర్‌లో చికిత్స పొందిన దాదాపు 29 మంది మూర్చ రోగులపై పరిశోధనలు జరిపారు. గాయకుడు వాల్టర్స్ పాడిన "అనదర్ బ్రిక్ ఇన్ ది వాల్" పాటను ఆ రోగుల ముందు ప్లే చేసేటప్పుడే వారి మెదడులకు ఎలక్ట్రోడ్‌లను అమర్చారు. అవి బ్రెయిన్‌లో సంగీతానికి స్పందించే సంకేతాలను ఎన్‌కోడింగ్ చేసింది. ఆ తర్వాత డేటాను అర్థ చేసుకునేందుకి రిగ్రెషన్ ఆధారిత నమునాలను ఉపయోగించారు.
తద్వారా స్పెక్ట్రోగ్రామ్(పాట)ను పునః సృష్టిచగలిగారు. మెదడు సంకేతాలు ఎలా ఫ్రీక్వెన్సీలుగా మారతాయో తెలుపుతోంది ఈ ఆడియో ఫైల్. మెదడు సంగీత శ్రావ్యత, లయ, ఒత్తిడి, స్వరం, ధ్వని వంటి అంశాలన్నింటినికి మెదడు నుంచి వచ్చే తరంగాలను ఎలా అర్థవంతమైన పదాలుగా మలిచి పాటను పునర్నిర్మించొచ్చు అనేది ఈ అధ్యయనంలో వెల్లడైందన్నారు శాస్తవేత్తలు. ఇది భవిష్యత్తులో జరిగబోవు మెదడు ఇంప్లాంటేషన్ శస్త్రచికిత్సలకు సంగీతం ఉపకరిస్తుందని ఈ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయన్నారు శాస్త్రవేత్తలు. అయినా ఇప్పటికే వైద్యులు కొంతమంది రోగులకు బ్రెయిన్‌కి సంబంధించిన శస్త్ర చికిత్సల కోసం వారికి నచ్చిన మ్యూజిక్‌ని ప్లే చేసి మరి ఆపరేషన్‌లు చేసిన ఉందంతాలను చూశాం.
(చదవండి: పూజారి కమ్ బైక్ రేసర్.. ఒకేసారి రెండు విభిన్న రంగాల్లో..)
Comments
Please login to add a commentAdd a comment