చలికాలం మెదడుకు ముప్పు.. జాగ్రత్త..! | Cerebrovascular Accident Risk High In Winter Season | Sakshi
Sakshi News home page

చలికాలం మెదడుకు ముప్పు.. జాగ్రత్త..!

Published Sun, Dec 18 2022 12:17 PM | Last Updated on Sun, Dec 18 2022 12:17 PM

Cerebrovascular Accident Risk High In Winter Season - Sakshi

చలికాలంలో చాలా ముప్పులు ΄పొంచి ఉంటాయి. దెబ్బ చిన్నగా తగిలినా నొప్పి ఎక్కువగా అనిపిస్తుంది. అలర్జీలు కనిపిస్తాయి. చర్మం ΄పొడిబారి పగులుతుంటుంది. కీళ్లనొప్పులు పెరుగుతాయి. నిజానికివన్నీ చాలా చిన్న సమస్యలు. కానీ చాలా పెద్ద సమస్య... అందునా మెదడుకు సంబంధించిన ముప్పు ఒకటి ΄పొంచి ఉంటుంది. అదే మెదడుకు కలిగే రిస్క్‌. దాని పేరే ‘సెరెబ్రో వాస్కులార్‌ యాక్సిడెంట్‌’, సంక్షిప్తంగా దీన్ని ‘సీవీఏ’గా చెబుతారు. సెరిబ్రో వాస్కులార్‌ యాక్సిడెంట్‌ (సీవీఏ) అంటే ఏమిటి, అదెందుకు వస్తుంది, దాని వల్ల వచ్చే అనర్థాలు, దాని నివారణ వంటి అనేక అంశాలపై అవగాహన కోసమే ఈ కథనం. 

చలికాలంలో కొన్ని సమస్యలు బాగా పెరుగుతాయి. ఉదాహరణకు వాతావరణంలో తేమ తగ్గడం... చర్మం నుంచి ఆ తేమను వాతావరణం లాక్కోవడంతో చర్మం పగుళ్లు, అలర్జీలు ఎక్కువ. అలాగే చలి కారణంగా చర్మం ఉపరితలంలో రక్తనాళాలు కుంచించుకుపోయి రక్తప్రసరణ తగ్గడం (వాసో కన్‌స్ట్రిక్షన్‌) మాత్రమే కాదు... చర్మంలో ఉండే నాడీ కణాలు బాగా ఎక్కువగా పనిచేయాల్సి రావడంతో చిన్న చిన్న దెబ్బలకు సైతం నొప్పి తీవ్రంగా తెలుస్తుంటుంది. ఇవన్నీ ప్రాణాలకు ముప్పు తెచ్చిపెట్టని మామూలు సమస్యలు. కానీ సెరెబ్రో వాస్కులార్‌ యాక్సిడెంట్స్‌ అనే ముప్పు వల్ల మాత్రం పక్షవాతం (బ్రెయిన్‌ స్ట్రోక్‌), మెదడులో రక్తస్రావం (బ్రెయిన్‌ హెమరేజ్‌) వంటి తీవ్రమైన సమస్యలు వచ్చి అరుదుగా కొన్ని సందర్భాల్లో ప్రాణాలకూ ప్రమాదం తెచ్చిపెట్టవచ్చు. 

సెరెబ్రో–వాస్కులార్‌ యాక్సిడెంట్స్‌ ఎందుకంటే...? 
ముందుగా చెప్పుకున్నట్లుగా వాతావరణంలో తేమ (హ్యుమిడిటీ) తగ్గిపోవడంతో దాన్ని భర్తీ చేసుకునేందుకు పర్యావరణం మన దేహాల్లోని తేమను లాగేస్తుంది. (ఈ కారణంగానే చర్మం΄పొడిబారినట్లుగా కనిపించడం, గీరితే చారలు పడటం వంటివి సంభవిస్తాయి). అంతేకాదు వాతావరణం చల్లగా ఉండటంతో నీళ్లు తాగడమూ తగ్గిపోతుంది. ఇంకా సాయంత్రాలు, రాత్రుళ్లు, తెల్లవారుఝామున బాగా చల్లగా ఉండటంతో రక్తం వేగంగా ప్రవహించాల్సి వస్తుంది.

దాంతో రక్తపోటు పెరుగుతుంది. ఇది మెదడులో రక్తస్రావానికి (బ్రెయిన్‌ హెమరేజ్‌)కి కారణం కావచ్చు. ఇక శీతకాలం బాగా చల్లగా ఉండటం వల్ల మనం నీళ్లు తాగడం బాగా తగ్గిపోతుంది. దాంతో రక్తం పలుచగా కాకుండా, చిక్కగా మారడంతో΄ాటు రక్తనాళాల్లో రక్తపు ఉండలు (క్లాట్స్‌) పెరుగుతాయి. ఫలితంగా ఈ క్లాట్స్‌ రక్తప్రవాహాన్ని అడ్డుకోవడం వల్ల కొన్నిసార్లు మెదడులో రక్తస్రావం (బ్రెయిన్‌ హెమరేజ్‌), మరికొన్ని సార్లు మెదడులో  కీలకమైన భాగాలకు రక్తం అందక పక్షవాతం రావచ్చు. (ఇవే క్లాట్స్‌ గుండెకు సరఫరా చేసే రక్తనాళాల్లో వస్తే గుండెపోటు వచ్చే ప్రమాదమూ ఉంటుంది). 

ముప్పును మరింత పెంచే అంశాలు... 
దీనికి తోడు ‘సీవీఏ’ ప్రమాదాన్ని మరింత పెంచడానికి కొన్ని అంశాలు దోహదం చేస్తాయి. అవి... డయాబెటిస్, హైబీపీ, హై కొలెస్ట్రాల్, మూత్రపిండాల జబ్బులు, ΄పొగతాగే అలవాటు వంటివి ఈ ముప్పును మరింత పెంచే అంశాలని చెప్పవచ్చు. 

రెండు రకాలుగా ‘సీవీఏ’ అనర్థాలు... 
మెదడులో ఏయే ప్రాంతాల్లో, ఏ రకంగా అనర్థాలు ఏర్పడ్డాయనే అంశం ఆధారంగా  ‘సీవీఏ’ని రెండు రకాలుగా చెప్పవచ్చు. మెదడులో రక్తస్రావమైతే దాన్ని ఇంట్రాసెరెబ్రల్‌ హేమరేజ్‌ (ఐసీహెచ్‌) అని, మెదడులోని రక్తనాళాల్లో రక్తపు ఉండలు ఏర్పడటం వల్ల పక్షవాతం వస్తే దాన్ని ఇస్కిమిక్‌ స్ట్రోక్‌ అని అంటారు.

నివారణ / చికిత్స : 
ఇంతటి ప్రాణాపాయం తెచ్చిపెట్టే ఈ ‘సీవీఏ’కు నివారణ చాలా తేలిక. ఈ సీజన్‌లో అన్నిటికంటే ముఖ్యంగా చేయాల్సింది నీళ్లు బాగా తాగుతూ ఉండటమే. దీనివల్ల దేహానికి హైడ్రేషన్‌ సమకూరుతుంది. వాటితో ΄ాటు...  ∙గదిలో వెచ్చని వాతావరణంలో ఉండటం (ఒంటిని వెచ్చగా ఉంచుకోవడం) ∙సమయానికి టాబ్లెట్లు (డయాబెటిస్, హైబీపీ, కొలెస్ట్రాల్, గుండెజబ్బుకు వాడే మందులు) తీసుకోవడం ∙

పొగతాగే అలవాటును పూర్తిగా మానేయడం ∙అన్ని పోషకాలు ఉన్న సమతులాహారం తీసుకోవడం ∙చక్కెరలు చాలా తక్కువగా తీసుకోవడం ∙ఉప్పు చాలా చాలా పరిమితంగా మాత్రమే వాడటం ∙క్రమం తప్పకుండా డాక్టర్‌ ఫాలో అప్‌కు వెళ్తుండటం ∙మెదడుకు సంబంధించిన ఏ లక్షణం కనిపించినా తక్షణం హాస్పిటల్‌కు వెళ్లాలి. అక్కడ లక్షణాలను గమనించి, అవసరాన్ని బట్టి వైద్యులు తగిన చికిత్స అందిస్తారు.

లక్షణాలు:
తలలో తీవ్రమైన నొప్పి, వాంతులు∙ తల తిరగడం (డిజ్జీనెస్‌)∙ పూర్తిగా స్పృహ కోల్పోవడం. ఇవేగాక మరికొన్ని లక్షణాలను (బీఈఎఫ్‌ఏఎస్‌టీ) అనే ఇంగ్లిష్‌ అక్షరాల కలబోతతో ‘బీఫాస్ట్‌’ గా చెప్పవచ్చు. అంటే... ∙‘బీ’ ఫర్‌ బ్యాలెన్స్‌ అంటే సరిగ్గా నడవలేక బ్యాలెన్స్‌ కోల్పోవడం ∙‘ఈ’ ఫర్‌ ఐస్‌ (కళ్లు) అంటే కళ్లు మసకలు బారడం ∙‘ఎఫ్‌ ఫర్‌ ఫేస్‌ అంటే... ముఖంలో ఏదో ఒక వైపు జారిపోయినట్లుగా కావడం (పక్షవాతం లక్షణాల్లో ఒకటి) ∙‘ఏ’ ఫర్‌ ఆర్మ్స్‌ (భుజాలు) అంటే రెండు చేతుల్లో ఏదో ఒకటి బలహీనంగా మారడం పనిచేయకపోవడం ∙‘ఎస్‌’ ఫర్‌ స్పీచ్‌ అంటే మాట్లాడలేకపోవడం లేదా మాట ముద్దగా రావడం ∙‘టీ’ ఫర్‌ టైమ్‌ అంటే... అది ఆంబులెన్స్‌ అవసరమైన సమయం (టైమ్‌) అని అర్థం. 

-డా‘. ఎస్‌.పి.మాణిక్‌ ప్రభు
సీనియర్‌ కన్సల్టెంట్‌ 
న్యూరోసర్జన్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement