ఆమె పేరు స్నేహ. వయస్సు 23 సంవత్సరాలు. సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం, అయిదంకెల జీతం. అంతా హ్యాపీ, కానీ అదంతా కొన్ని రోజుల క్రితం వరకు, ఇప్పుడామె ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంట్లోనే ఉంటోంది. ఉద్యోగం దొరకడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో అంత మంచి ఉద్యోగాన్ని ఎలా వదులుకుందని స్నేహితులు, బంధువులు ప్రశ్నలు అడగటం మొదలు పెట్టారు. అయితే ఏవో కారణాలు చెప్పుకుంటూ వచ్చింది. అసలు కారణం ‘స్థూలకాయం’.
అధిక బరువు వల్ల ఆమె శరీరాకృతి మొత్తం దెబ్బతింది. ఆమెకే ఎబ్బెట్టుగా అనిపించేది. ఓ రోజు కొలీగ్‌స తన శరీరాకృతి గురించి మాట్లాడుకోవటం ఆమె చెవిన పడింది. అప్పట్నుంచి ఆమెలో ఆత్మన్యూనతా భావం మొదలైంది. నలుగురిలో మాట్లాడటం తగ్గిపోయింది. అమ్మానాన్నల సలహాతో వాకింగ్ మొదలెట్టింది. తిండి బాగా తగ్గించేసింది. దీంతో నీరసం. బరువు తగ్గకపోగా కొత్త సమస్యలు ప్రారంభమయ్యాయి. అధిక బరువు ఉండి వాకింగ్ చేయడం మూలంగా కీళ్ల నొప్పులు.
క్రమంగా స్నేహలో డిప్రెషన్. ఇంట్లో వాళ్లు పెళ్లి సంబం ధాలు చూస్తున్నా.. ఎవరికీ అమ్మాయి నచ్చడం లేదు. ఏం చేయాలో తెలియని స్థితిలో ఉండగా.. ఇంటర్‌లో తనతో కలసి చదువుకున్న పావని తారసపడింది. ఇద్దరు పిచ్చాపాటీ మాట్లాడుకున్న తరువాత తన బాధనంతా చెప్పుకొచ్చింది స్నేహ. దానికి పావని అదేం బాధపడాల్సి నంత పెద్ద విషయం కాదని, ఆపరేషన్ లేకుండానే అధిక బరువును తగ్గించుకునే చికిత్సా విధానాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయని చెప్పింది. ‘హెల్దీ కర్‌వ్స’ క్లినిక్‌లో తను కూడా ఆ విధానాల ద్వారా బరువు తగ్గానని చెప్పింది. స్నేహను ‘హెల్దీ కర్‌వ్స’ క్లినిక్‌కు తీసుకొచ్చింది. మేం ముందుగా ఆమె గతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశాం...
నేపథ్యం ఏమిటి?
ఆమె పుట్టుక నుంచి లావుగా ఉందా.. ఈ మధ్య కాలంలో లావయిందా అనే ప్రశ్నలను అడిగాం. ఇక్కడ మాకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. స్నేహ ఇంటర్ చదివే రోజుల్లో స్లిమ్‌గా ఉండేది. ఇంటర్ తరువాత ఇంజనీరింగ్‌లో చేరింది. నాలుగేళ్లు హాస్టల్‌లో ఉండి చదువుకుంది. వ్యాయామం లేకపోవటం, క్లాసు రూముల్లో కంప్యూటర్ ముందు కూర్చుని చదువుకోవటం.. లేదంటే పడుకోవటం... నాలుగేళ్లు ఇలానే గడిచాయి. దీంతో బరువు పెరిగింది. చదువు పూర్తికావడంతోనే ఉద్యోగంలో చేరింది. అక్కడా అంతే... కంప్యూటర్ ముందు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చుని పని చేసేది. ఆఫీసుకు క్యాబ్‌లోనే వెళ్లి వచ్చేది. ఎక్కడా నాలుగు అడుగులు వేసే పని ఉండేది కాదు. దానికి తోడు పిజ్జాలు, బర్గర్‌లు, వీకెండ్‌లో పార్టీలు... అన్నీ కలిపి స్థూలకాయాన్ని తెచ్చిపెట్టాయి.
అనర్థాలు వివరించాం...
అధిక బరువు వల్ల గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం, కీళ్ల నొప్పులు, స్త్రీలలో సంతానలేమి, పీసీఓడీ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చెడు కొలెస్ట్రాల్ పెరగడంతో పక్షవాతం వచ్చే అవకాశం ఉందని చెప్పాం.
ముందుగా కౌన్సిలింగ్
చికిత్సకు ముందు కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల పేషంట్‌కు నమ్మకం కలుగుతుంది. అందుకే స్నేహకు కౌన్సిలింగ్ ఇచ్చాం. బరువు తగ్గడానికి ఉన్న మార్గాలను వివరించాం. స్నేహ కూడా బరువు తగ్గటానికి అనేక ప్రయత్నాలు చేసి విఫలం అయింది. కాబట్టి ఆమెకు ‘క్రయోలిపోలైసిస్’ చికిత్స ఒక్కటే మార్గమని చెప్పాం.
చికిత్స ఎలా ఉంటుంది?
మొదటగా డాక్టర్... స్నేహ శరీరంలో కొవ్వు పేరుకుపోయిన భాగాలను గుర్తించి, ఆ భాగాలను ‘క్రయోలిపోలైసిస్’ చికిత్సతో చల్లబరచటం ద్వారా అక్కడ ఉన్న కొవ్వు కణాలు కొంత సమయం తరువాత స్తంభించిపోయి, నెమ్మదిగా వాటంతట అవి చనిపోవటం జరిగింది. ఈ పద్ధతిని వైద్య పరిజ్ఞానంలో అపోప్టసిస్ అంటారు. దీని తరువాత ఎక్కువగా ఫిజికల్ ఎక్సర్‌సైజ్ చేయటం మొదలు పెట్టింది. దానివల్ల చనిపోయిన కొవ్వు కణాలు శరీరం నుండి చెమట, మూత్రం, వ్యర్థాల రూపంలో బయటకు వెళ్లిపోయాయి. ఈ చికిత్సలో నొప్పి, గాయాలు, రక్తస్రావం, కుట్లు వంటివి ఉండవు. బెడ్ రెస్ట్ అవసరం ఉండదు. చికిత్స జరిగే సమయంలో స్నేహ ఎంచక్కా ల్యాప్‌టాప్‌పై పనిచేసుకుంది.
చికిత్స తరువాత...
చికిత్స జరిగిన మూడు వారాల తరువాత మంచి ఫలితాన్ని చూసింది. నడుం, తొడలు, పిరుదుల భాగంలో ఉన్న కొవ్వు బాగా తగ్గిపోయింది. శరీరాకృతిలో తేడాను ఆమె స్పష్టంగా గుర్తించింది. ఇంటర్ చదివే రోజుల్లో నాజూగ్గా ఎలా ఉండేదో అలా తయారయింది. ఇప్పుడు ఆమె ముఖంలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. మళ్లీ ఉద్యోగంలో చేరిపోయింది. పెళ్లి కూడా చేసుకొని సెటిలయింది. ఎందరికో స్ఫూర్తినిస్తున్న ఆమె జీవితం, చికిత్సా వివరాలను కేస్ స్టడీ రూపంలో అందించాం. కొసమెరుపు ఏమిటంటే ఈ చికిత్సా విధానం కేవలం ఒకటి లేదా రెండు సార్లు చేయించుకుంటే సరిపోతుంది.
ఆపరేషన్ లేకుండానే ఆమె జీవితంలో చిరునవ్వులు
Published Sun, Nov 23 2014 12:15 AM | Last Updated on Sat, Sep 2 2017 4:56 PM
Advertisement
Advertisement