స్థూలకాయంపై సమరం
మానవ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా బరువు తక్కువ ఉన్న వారి కన్నా అధిక బరువుతో బాధపడే జనాభా సంఖ్య పెరుగుతున్నది. 1980 నుంచి పోషకాహార లేమితో బాధపడే జనాభా 1.1 బిలియన్లకు పెరుగుతోంది. ఆహారపు అలవాట్ల మీద కంట్రోల్ లేకపోవడం వల్లనే స్థూలకాయం పెద్ద సమస్యగా పరిణమిస్తున్నది. దీనికి బెరియాట్రిక్ సర్జరీ లాంటివే కాదు ఆపరేషన్ అవసరం లేకుండా కొవ్వు తగ్గించుకోగలిగే క్రయోలైపోలైసిస్ లాంటి చికిత్సలు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి.
బాడీ మాస్ ఇండెక్స్ 30కి.గ్రా./మీ2 కన్నా ఎక్కువ ఉంటే స్థూలకాయం అని ‘ఐడీఏ’ (ఇంటర్నేషనల్ డయాబెటిక్ అసోసియేషన్) నిర్వచించింది. స్థూలకాయం మొదటిదశలో ఆహారపు అలవాట్లు, జీవన శైలి, బరువుపై ప్రభావం చూపించటం మొదలవుతుంది. వివిధ రకాల సమస్యలతో కూడిన మెటాబాలిక్ సిండ్రోమ్ స్థూలకాయంతో కలిసి గుండె జబ్బులు, మధుమేహ అవకాశాలను పెంచుతుంది.
మెటబాలిక్ సిండ్రోమ్ అంటే...
- హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గటం
- బీపీ పెరగటం
- ఫాస్టింగ్‌లో ప్లాస్మాలో గ్లూకోజ్ మోతాదు పెరగటం
కారణాలు...
చాలా మంది పేషెంట్లలో వృద్ధులు, స్థూలకాయం ఉన్నవారు, శారీరక శ్రమ లేనివారు, ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువగా ఉన్నవారు ఉంటారు. మానసిక ఒత్తిడి కూడా ప్రధాన కారణం. అధిక బరువు జన్యుతత్వం, ఎండోక్రైన్ గ్రంథుల సమస్యలు, పాలీ సిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, ఎక్కువ సమయం కూర్చుని పని చేసే జీవన శైలి (తక్కువ శారీరక శ్రమ, కేలరీలు ఎక్కువ తీసుకోవటం). స్థూలకాయ సమస్య పెరగటంవల్ల మెటబాలిక్ సిండ్రోమ్ సమస్య చాలా సాధారణం అవుతోంది. భవిష్యత్తులో గుండె జబ్బులకు పోగతాగటం కన్నా ఎక్కువ మెటబాలిక్ సిండ్రోమ్ సమస్యే కారణం అని డాక్టర్లు భావిస్తున్నారు. మెటబాలిక్ సిండ్రోమ్‌ను నివారించాలన్నా కనీసం ఆలస్యం చేయాలన్నా జీవన శైలిలో మార్పులు చేసుకుని, బరువు పెరగకుండా చూసుకోవాలి.
చికిత్స...
ఇంతకుముందు చెప్పినట్టుగా జీవన శైలిలో మార్పుల ద్వారా బరువు తగ్గించుకోవడమే మెటబాలిక్ సిండ్రోమ్ నివారణకు అత్యుత్తమ పరిష్కారం ‘క్రయోలైపోలసిస్ మరియు నాన్‌సర్జికల్ లైపోసక్షన్ విధానాల ద్వారా కిలో బరువు తగ్గితే బీపీ పేషంట్లలో బీపీ 1 మి.మీ/ హెచ్‌జీ తగ్గుతుందని, మధుమేహం ఉన్నవారికి ప్లాస్మా గ్లూకోజ్ మోతాదు 1 మి.మీ/డె.లీ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. క్రయోలైపోలసిస్ విధానం ద్వారా శరీరంలో కొవ్వు పేరుకుపోయిన భాగాలను గుర్తించి, ఆ భాగాలను ‘క్రయోలిపోలైసిస్’ చికిత్సతో చల్లబరచటం ద్వారా అక్కడ ఉన్న కొవ్వు కణాలు కొంత సమయం తరువాత స్తంభించిపోయి, నెమ్మదిగా వాటంతట అవి చనిపోవటం జరుగుతుంది. ఈ పద్ధతిని వైద్య పరిజ్ఞానంలో (APOPTOSIS) అపోప్టసిస్ అంటారు.
నాన్‌సర్జికల్ లైపోసక్షన్‌లో కేవిటేషన్ పద్ధతి ద్వారా మన శరీరంలో ఎక్కువగా కొవ్వు పేరుకుపోయిన చోట అల్ట్రాసోనిక్ తరంగాలను ఉపయోగించి చర్మం క్రింద పేరుకుపోయిన అదనపు కొవ్వును ధృవీకరించి లింఫ్ నాళాల ద్వారా కాలేయానికి పంపుతారు. కాలేయంలో ఈ కొవ్వు పలు రకాల జీవక్రియలకు లోనై కొంతభాగం శక్తిగా మారి మన రోజువారీ అవసరాల కోసం వినియోగించబడుతుంది. మిగిలిన కొవ్వు మలినాల రూపంలో శరీరం నుండి చెమట, మూత్రం, వ్యర్థాల రూపంలో బయటకు వెళ్ళిపోతుంది.
పైన తెలిపిన రెండు పద్ధతులు ఇప్పుడు మన అందుబాటులో ఉన్న ప్రఖ్యాతిగాంచిన, అత్యాధునికమైన, ఆపరేషన్ లేకుండానే, మన స్థూలకాయంను తగ్గించేందుకు అందుబాటులోకి హెల్థీకర్‌వ్స క్లినిక్ తీసుకొచ్చింది.
చికిత్స తరువాత...
చికిత్స జరిగిన మూడు వారాల తరువాత మంచి ఫలితాన్ని మనం చూడవచ్చు. స్తంభించిపోయి, చనిపోయిన కొవ్వు వివిధ జీవక్రియలకు లోనవటం అనేది మూడు వారాలు పడుతుంది. దాని తరువాత మనం మన శరీరాకృతిలో తేడాను స్పష్టంగా గమనించవచ్చు. ఎక్కువగా నడుము, తొడలు, పిరుదుల భాగంలో ఉన్న కొవ్వు తగ్గిపోతుంది. చికిత్స చేయించుకున్న తరువాత సమయం ప్రకారం తిండి, నిద్ర అనేది పాటించడం, ఉదయం ఫిజికల్ ఎక్స్‌ర్‌సైజ్‌లు చేయటం గనుక చేస్తే, తక్కువ సమయంలో మన శరీరాకృతి మారటం గమనించవచ్చు. కొసమెరుపు ఏమిటంటే ఈ చికిత్స విధానం కేవలం ఒకటి లేదా రెండు సార్లు చేయించుకుంటే సరిపోతుంది.