కొలెస్ట్రాల్‌ను నియంత్రించవచ్చు | Cholesterol can be controlled | Sakshi
Sakshi News home page

కొలెస్ట్రాల్‌ను నియంత్రించవచ్చు

Published Sun, Aug 11 2013 11:08 PM | Last Updated on Fri, Sep 1 2017 9:47 PM

కొలెస్ట్రాల్‌ను నియంత్రించవచ్చు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించవచ్చు

కొలెస్ట్రాల్ అనేది మైనంలాంటి పదార్థం. ఇది శరీరం అంతటా ఉంటుంది. కొలెస్ట్రాల్ శరీరంలో తీసుకున్న ఆహారం నుండి, శరీరం లోపల నుండి తయారవుతుంది.  కొలెస్ట్రాల్ లివర్‌లో తయారవుతుంది. ఆహారం నుండి పొందే కొలెస్ట్రాల్ మనం తీసుకునే పాలు, పాలపదార్థాలు, మాంసాహారం, చేపలు, గుడ్డులోని పచ్చసొన నుండి అందుతుంది.
 
 కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటుంది.

 1. చెడు కొలెస్ట్రాల్ (LDL)
 2. మంచి కొలెస్ట్రాల్ (HDL)

 
 1. చెడు కొలెస్ట్రాల్ (LDL): ఎక్కువగా రక్తంలో ప్రయాణించటం వలన గుండెకు, మెదడుకు వెళ్ళే ధమనులలో అవరోధం ఏర్పడుతుంది. ఈ విధమైన చెడుకొలెస్ట్రాల్ పేరుకొనటం వలన రక్తప్రసరణకు అంతరాయం కలిగి గుండెపోటు వస్తుంది. అదేవిధంగా మెదడుకు సరఫరా అయ్యే రక్తప్రసరణకు అడ్డంకి ఏర్పడి పక్షవాతం ముప్పు ఏర్పడుతుంది.
 
 2. మంచి కొలెస్ట్రాల్ (HDL): ఇది మంచి కొలెస్ట్రాల్. దీనిని పెంచుకోవటం వలన అనారోగ్యాలను తప్పించుకోవచ్చు. ఇది శరీరంలో ఉన్న చెడ్డ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. కాబట్టి చెడు కొలెస్ట్రాల్ 140-150 mg/dl లోపు ఉండాలి. అదేవిధంగా మంచి కొలెస్ట్రాల్ 40-50 mg/d ఉండేలా చూసుకోవాలి.
 
 శరీరంలో ఉండే కొవ్వును ట్రైగ్లిజరాయిడ్స్ రూపంలో రక్తం ద్వారా శరీర కణజాలానికి చేరవేస్తుంది. ఈ ట్రైగ్లిజరాయిడ్స్ అధికంగా ఉన్నవారికి చెడు కొలెస్ట్రాల్ స్థాయి అధికం అవుతుంది. దీనిద్వారా కూడా గుండెపోటు ముప్పు ఏర్పడుతుంది. కాబట్టి ట్రైగ్లిజరాయిడ్స్ స్థాయిని శరీరంలో అదుపులో ఉంచుకోవాలి.
 
 రక్తంలో కొలెస్ట్రాల్‌స్థాయిని తగ్గించక పోవటం వలన తీవ్రస్థాయి గుండె వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా గుండెపోటు ముప్పు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొలెస్ట్రాల్‌ను వాటి స్థాయులకన్నా తక్కువ మోతాదులో ఉండేలా చూసుకొనే జాగ్రత్తలు తీసుకోవాలి.
 
 ఆయుర్వేదశాస్త్రం ప్రకారం కొలెస్ట్రాల్‌ను, ఆహార విహారాదులను ఆరోగ్యకరంగా పాటించడం వలన ఈ వ్యాధిని పూర్తిగా అదుపులో ఉంచుకోవచ్చు. ఆయుర్వేద ఔషధాలు వ్యాధి తీవ్రం కాకుండా కాపాడతాయి.
 
 తీసుకోవలసిన జాగ్రత్తలు:
 1. వ్యాయామం:- నడక వలన HDL మంచి కొలెస్ట్రాల్ స్థాయి పెంచుకోవచ్చు.
 
 2. ప్రాణాయామం: - 15 నిమిషాల పాటు ప్రాణాయామం చేయటం వలన శ్వాసవ్యవస్థ శుభ్రపడుతుంది.
 
 3. నీరు: రోజుకి సగటున 6-8 గ్లాసుల నీరు త్రాగాలి.
 
 4. ఆల్కహాల్, మాంసాహారసేవన, సిగరెట్లు మానివేయాలి.
 
 5. బరువును పూర్తిగా అదుపులో ఉంచుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదుగల ఆహారం తీసుకోవాలి.
 
 6. పీచు కలిగిన పండ్లు, కూరగాయలు, ఆహారం, ఓట్స్ తీసుకోవటం వలన కొలెస్ట్రాల్‌ను పూర్తిస్థాయిలో నియంత్రించవచ్చు.
 
 డాక్టర్ హనుమంతరావు
 ఎం.డి (ఆయుర్వేద),
 స్టార్ ఆయుర్వేద,
 సికింద్రాబాద్, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్,
 విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, కర్ణాటక
 ph: 7416 101 101
         7416 102 102

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement