రక్తపోటును నియంత్రించే సూపర్ మాత్ర
రక్తపోటును, కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తూ గుండెజబ్బుల రోగుల్లో గుండెపోటు, పక్షవాతం నివారణకు ఉపయోగపడే ఓ సూపర్ మాత్రను శాస్త్రవేత్తలు తయారు చేశారు. దీనిని రోజుకొకటి చొప్పున వాడితే చాలు.. గుండెజబ్బుల రోగుల్లో మెరుగైన ఫలితాలు వస్తాయట. ‘జార్జ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్’ నేతృత్వంలో భారత్, ఆస్ట్రేలియా, యూరోప్‌లలో 3,140 మంది కార్డియోవాస్కులర్ డిసీజ్(సీవీడీ) రోగుల్లో ఈ ‘పాలీపిల్’ను పరీక్షించగా.. 43 శాతం మెరుగైన ఫలితాలు వచ్చాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. వీరి పరిశోధన వివరాలను ఇటీవల ‘వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ కార్డియాలజీ-2014’ సమావేశంలో సమర్పించారు.