గర్భిణి బెండకాయ తింటే.. !
వెజ్‌ఫ్యాక్ట్స్
*బెండకాయలో... ఐరన్, క్యాల్షియం, పొటాషియం, సోడియం, కాపర్, మెగ్నీషియం, సిలీనియం, మాంగనీస్, జింక్ వంటి పోషకాలతోపాటు సి,ఎ, ఇ,కె విటమిన్లు ఉంటాయి. జీర్ణవ్యవస్థకు దోహదం చేసే పీచు కూడా ఉంటుంది.
* బెండకాయ తింటే అధిక బరువు, కొలెస్ట్రాల్ తగ్గుతాయి. మధుమేహం ఉన్న వారు వారానికోసారయినా తింటే మంచిది. ఈ కూరగాయ... చర్మకాంతిని మెరుగుపరిచి, ఎముకలను శక్తిమంతం చేస్తుంది.
* బెండకాయ కోలన్ క్యాన్సర్(పెద్దపేగు క్యాన్సర్), ఊపిరితిత్తుల క్యాన్సర్‌లను నివారిస్తుంది. దంత క్షయాన్ని కూడా నివారిస్తుంది.
* గర్భవతిగా ఉన్నప్పుడు బెండకాయ తినడం వల్ల పిండం ఎదుగుదల బావుంటుంది. ఫోలేట్ అనే పోషకం సమృద్ధిగా అందడం వల్ల బిడ్డ మెదడు నిర్మాణం ఆరోగ్యకరంగా ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ నాడీవ్యవస్థ ఆరోగ్యకరంగా ఏర్పడడానికి దోహదం చేస్తుంది. గర్భధారణ జరిగిన నాలుగు నుంచి పన్నెండు వారాల లోపు ఈ పోషకాలు చాలా అవసరం.
- ఉషశ్రీ, న్యూట్రిషనిస్ట్