వృద్ధాప్య ప్రక్రియను మందగించడంలో భారీ పాత్ర పోషిస్తున్న అంశాలలో, ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఖనిజాలు ఫైబర్‌లతో కూడిన ఆహారం వృద్ధాప్య వ్యతిరేక ప్రభావం ఉంటుంది. ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం మంచి విటమిన్‌లు, మినరల్స్‌తో కూడిన ఆహారం తీసుకుంటాం. అయితే ఈ విటమిన్ మాత్రం తక్కువగా తీసుకుంటే దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదెలాగో సవివరంగా తెలుసుకుందాం..!.
అసలేం జరిగిందంటే..టెక్సాస్ అగ్రిలైఫ్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు వృద్ధాప్య జంతు నమూనాలలో తక్కువ ఫోలేట్ తినడం ఆరోగ్యకరమైన జీవక్రియతో ముడిపడి ఉందని గుర్తించారు. ముదురు ఆకుపచ్చ ఆకు కూరలు, నారింజ, నిమ్మ, పుచ్చకాయలు, బఠానీలు తదితర ఇతర ఆహారాల్లో ఫోలేట్ లేదా ఫోలిక్ యాసిడ్ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాల నిర్మాణం, ఆరోగ్యకరమైన కణాల పెరుగుదల, పనితీరుకు కీలకం. పిల్లలు, యువకులు, గర్భిణీ స్త్రీలకు ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే..? ఇది పెరుగుదల ప్రక్రియలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అలాంటి ఈ ఫోలేట్‌ను తక్కువగా తీసుకుంటే వృద్ధుల్లో దీర్ఘాయువుని పెంచుతుందని గుర్తించారు పరిశోధకులు. అదెలా అంటే..
శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో ఫోలేట్‌ని తీసుకోవడం తగ్గిస్తే ఏం జరుగుతుంది అనే దానిపై పరిశోధన చేశారు. అందుకు మధ్య వయసు ఉన్న జంతు సముహానికి ఫోలేట్ తక్కువగా ఉన్న ఆహారాన్ని ఇచ్చారు. ఫోలేట్ పరిమిత నమునాలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు త్వరగా జీవక్రియగా మారగలవని గుర్తించారు. ఒక వ్యక్తి వయసును బట్టి ఫోలేట్ తీసుకోవడం మారుతుందని చెప్పారు. ఎదుగుదల, అభివృద్ధికి ప్రారంభ జీవితంలో అధిక ఫోటేట్ కీలకం. అదే తర్వాత జీవితంలో తక్కువగా తీసుకోవడం మొదలుపెడితే జీవక్రియ ఆరోగ్యం, దీర్ఘాయువుకి ప్రయోజనం చేకూరుతుందని చెబుతున్నారు పరిశోధకులు. సాధారణంగా మనిషి నిద్రిస్తున్నప్పుడూ కొవ్వులు కరిగిపోతాయి. అదే మెలకువగా, చురుకుగా ఉన్నప్పుడూ..కార్బోహైడ్రేట్లు వేగంగా శక్తి కోసం ఖర్చువుతాయని వివరించారు.
అవే వయసు పెరిగే కొద్ది కొవ్వులు కరగడం, కార్బోహైడ్రేట్ ఖర్చు అవ్వడానికి ఎక్కువ సమసయం పడుతుంది కాబట్టి పరిమిత ఫోలేట్ మంచిదని నిర్ధారించి చెప్పారు. ఈ అధ్యయనం ప్రకారం..ఫోలేట్ పరిమత ఆహారం తీసుకునే మగవారిలో జీవక్రియ రేటులో మొత్తం పెరుగుదలను నమోదు చేశారు. అలాగే వృద్ధాప్యంలో శరీర బరువు, కొవ్వులను నిర్వహించగలదని గుర్తించారు. అలాగే ఈ అధ్యయనంలో రక్తహీనత, వంటి ప్రతికూల ఆరోగ్య పరిణామలను చూపించలేదు.
ఎంత ఫోలేట్ తీసుకోవాలి..
ఫోలేట్ లేదా విటమిన్ బీ9 ఆహారంలో విడదీయరాని భాగం. ఇది ఎర్ర రక్త కణాల నిర్మాణంలోని ఆరోగ్యకరమైన కణాల పనితీరుకి కీలక పాత్ర పోషిస్తుంది. రోజుకి 400 గ్రాముల ఫోలేట్ తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా గర్భధారణ సమయంలో ఫోలేట్ మరింత కీలకమైనది. వారు రోజుకు 400 నుండి 1,000 మిల్లీ గ్రాముల వరకు మోతాదు ఉంటుంది. మెదడు, వెన్నెముక యొక్క పుట్టుకతో వచ్చే లోపాల ప్రమాదాన్ని తగ్గించడానికి ఈ పోషకం శరీరంలో అందుబాటులో ఉండాలని చెప్పారు పరిశోధకులు.
(చదవండి: ఆంధ్ర స్పెషల్ 'రాగి దిబ్బ రొట్టు'..ఎన్ని లాభాలో తెలుసా..!)
Comments
Please login to add a commentAdd a comment