Folic acid
-
ఈ విటమిన్‌ని తక్కువగా తీసుకుంటే ఎక్కువ కాలం జీవించొచ్చట..!
వృద్ధాప్య ప్రక్రియను మందగించడంలో భారీ పాత్ర పోషిస్తున్న అంశాలలో, ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఖనిజాలు ఫైబర్లతో కూడిన ఆహారం వృద్ధాప్య వ్యతిరేక ప్రభావం ఉంటుంది. ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం మంచి విటమిన్లు, మినరల్స్‌తో కూడిన ఆహారం తీసుకుంటాం. అయితే ఈ విటమిన్ మాత్రం తక్కువగా తీసుకుంటే దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదెలాగో సవివరంగా తెలుసుకుందాం..!.అసలేం జరిగిందంటే..టెక్సాస్ అగ్రిలైఫ్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు వృద్ధాప్య జంతు నమూనాలలో తక్కువ ఫోలేట్ తినడం ఆరోగ్యకరమైన జీవక్రియతో ముడిపడి ఉందని గుర్తించారు. ముదురు ఆకుపచ్చ ఆకు కూరలు, నారింజ, నిమ్మ, పుచ్చకాయలు, బఠానీలు తదితర ఇతర ఆహారాల్లో ఫోలేట్ లేదా ఫోలిక్ యాసిడ్ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాల నిర్మాణం, ఆరోగ్యకరమైన కణాల పెరుగుదల, పనితీరుకు కీలకం. పిల్లలు, యువకులు, గర్భిణీ స్త్రీలకు ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే..? ఇది పెరుగుదల ప్రక్రియలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అలాంటి ఈ ఫోలేట్‌ను తక్కువగా తీసుకుంటే వృద్ధుల్లో దీర్ఘాయువుని పెంచుతుందని గుర్తించారు పరిశోధకులు. అదెలా అంటే..శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో ఫోలేట్ని తీసుకోవడం తగ్గిస్తే ఏం జరుగుతుంది అనే దానిపై పరిశోధన చేశారు. అందుకు మధ్య వయసు ఉన్న జంతు సముహానికి ఫోలేట్ తక్కువగా ఉన్న ఆహారాన్ని ఇచ్చారు. ఫోలేట్ పరిమిత నమునాలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు త్వరగా జీవక్రియగా మారగలవని గుర్తించారు. ఒక వ్యక్తి వయసును బట్టి ఫోలేట్ తీసుకోవడం మారుతుందని చెప్పారు. ఎదుగుదల, అభివృద్ధికి ప్రారంభ జీవితంలో అధిక ఫోటేట్ కీలకం. అదే తర్వాత జీవితంలో తక్కువగా తీసుకోవడం మొదలుపెడితే జీవక్రియ ఆరోగ్యం, దీర్ఘాయువుకి ప్రయోజనం చేకూరుతుందని చెబుతున్నారు పరిశోధకులు. సాధారణంగా మనిషి నిద్రిస్తున్నప్పుడూ కొవ్వులు కరిగిపోతాయి. అదే మెలకువగా, చురుకుగా ఉన్నప్పుడూ..కార్బోహైడ్రేట్లు వేగంగా శక్తి కోసం ఖర్చువుతాయని వివరించారు. అవే వయసు పెరిగే కొద్ది కొవ్వులు కరగడం, కార్బోహైడ్రేట్ ఖర్చు అవ్వడానికి ఎక్కువ సమసయం పడుతుంది కాబట్టి పరిమిత ఫోలేట్ మంచిదని నిర్ధారించి చెప్పారు. ఈ అధ్యయనం ప్రకారం..ఫోలేట్ పరిమత ఆహారం తీసుకునే మగవారిలో జీవక్రియ రేటులో మొత్తం పెరుగుదలను నమోదు చేశారు. అలాగే వృద్ధాప్యంలో శరీర బరువు, కొవ్వులను నిర్వహించగలదని గుర్తించారు. అలాగే ఈ అధ్యయనంలో రక్తహీనత, వంటి ప్రతికూల ఆరోగ్య పరిణామలను చూపించలేదు. ఎంత ఫోలేట్ తీసుకోవాలి.. ఫోలేట్ లేదా విటమిన్ బీ9 ఆహారంలో విడదీయరాని భాగం. ఇది ఎర్ర రక్త కణాల నిర్మాణంలోని ఆరోగ్యకరమైన కణాల పనితీరుకి కీలక పాత్ర పోషిస్తుంది. రోజుకి 400 గ్రాముల ఫోలేట్ తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా గర్భధారణ సమయంలో ఫోలేట్ మరింత కీలకమైనది. వారు రోజుకు 400 నుండి 1,000 మిల్లీ గ్రాముల వరకు మోతాదు ఉంటుంది. మెదడు, వెన్నెముక యొక్క పుట్టుకతో వచ్చే లోపాల ప్రమాదాన్ని తగ్గించడానికి ఈ పోషకం శరీరంలో అందుబాటులో ఉండాలని చెప్పారు పరిశోధకులు. (చదవండి: ఆంధ్ర స్పెషల్ 'రాగి దిబ్బ రొట్టు'..ఎన్ని లాభాలో తెలుసా..!) -
Health Tips: మొక్కజొన్న తింటే ఇన్ని ఉపయోగాలా? ఆరోగ్యంతో పాటు..
మెుక్కజొన్న అతి చౌకగా లభించే ఆహారం. దీని గింజలను కాల్చుకొని లేదా ఉడకబెట్టుకొని తింటారు. ముసురు పట్టినప్పుడు మొక్కజొన్న కండె కాల్చుకుని తింటూ ఉంటే ఆ మజానే వేరు. మెుక్కజొన్న గింజల నుంచి పాప్‌కార్న్, కార్న్ ఫ్లేక్స్ తయారుచేస్తారు. మెుక్కజొన్న పిండితో రొట్టెలు చేసుకుంటారు. ఇది చాలా బలవర్థకమైన ఆహారం. మొక్కజొన్న కేవలం ఆస్వాదించడానికే కాదు.. దీనిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అనేకం.. అవేమిటో చూద్దామా..? మంచి చిరుతిండి ►మొక్కజొన్న గింజలు తినటం ఆరోగ్యానికి ఎంతోమేలు చేస్తుంది. కంకులుగా వున్నప్పుడే వాటిని తినేయవచ్చు లేదా మసాలాలు, కారాలు కూడా తగిలించి తినచ్చు. గ్రేవీలో వేసి ఫ్రైడ్‌రైస్‌తో కలిపి తినవచ్చు లేదా ఉల్లిపాయ, పచ్చిమిర్చి వంటి వాటితో కూడా చేర్చితే సాయంకాలం వేళ మంచి చిరుతిండి. ►మెుక్కజొన్నలో లినోలిక్ ఆసిడ్, విటమిన్ ఇ, బి1, బి6, నియాసిన్, ఫోలిక్ ఆసిడ్, రైబోఫ్లోవిన్ అనే విటమిన్లు ఎక్కువగా ఉన్నాయి. ►మధుమేహాన్ని నియంత్రించే శక్తి ఉందని అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ చెబుతోంది. ఎముకలకు బలం ►పీచు పుష్కలంగా ఉంది. ఇది జీర్ణక్రియకు బాగా పనిచేస్తుంది. ఆహారంలో పీచు ఉండడంతో మొక్కజొన్న మలబద్ధకం, మెులలు వంటివి రాకుండా కాపాడుతుంది. పేగుకేన్సర్‌ను అరికడుతుంది. ►ఎముకల బలానికి పోషకాలైన కాపర్, ఐరన్, అవసరమైన లవణాలు, మినరల్స్ మెుక్కజొన్నలో పుష్కలంగా ఉన్నాయి. ►పసుపు రంగులో ఉండే ఈ చిన్న గింజలలో మెగ్నీషియం, ఐరన్, కాపర్, ఫాస్పరస్ వంటివి కూడా ఉండడంతో ఎముకలు గట్టిపడేలా చేస్తుంది. ►కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడతాయి. చర్మం ఆరోగ్యంగా.. అందంగా. ►మెుక్కజొన్నలో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతిమంతంగా ఉంచడమేకాదు... శరీరంపై ముడతలు రాకుండా చేస్తాయి. ►మెుక్కజొన్న గింజల నుంచి తీసిన నూనె చర్మ సంబంధ వ్యాధులకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. దీనిలో ఉండే లినోలిక్ యాసిడ్ చర్మం మీద వచ్చే మంటలను, దద్దుర్లను తగ్గిస్తుంది. ఎర్ర రక్తకణాల వృద్ధి ►రక్తహీనత ఉన్నవారికి మొక్కజొన్న అద్భుతమైన వరం. ►మెుక్కజొన్నలో ఉండే ఫోలిక్ యాసిడ్ రక్తహీనతను తగ్గించి ఎర్ర రక్తకణాలను వృద్ధి చేస్తుంది. గుండె ఆరోగ్యం పదిలం ►మొక్కజొన్న రక్తకణాల్లో కొవ్వుస్థాయులను తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ►రక్తనాళాల్లో ఏర్పడిన అడ్డంకులను తొలగించి రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది తద్వారా గుండెపోటు, పక్షవాతం, బీపీ మొదలైన సమస్యలను అదుపులో ఉంచుతుంది. జుట్టుకు బలం ►రోజూ మొక్కజొన్న తినేవారికి జుట్టు బలంగా ఉంటుంది. మొక్కజొన్నలో ఉండే విటమిన్ సి జుట్టును పట్టులా మృదువుగా... మెరుపులీనేలా చేస్తుంది. ►మొక్కజొన్న తక్షణశక్తిని ఇచ్చే ఆహారం. దీనిని తినడం వల్ల ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఇందులో ఖనిజాలు, పోషకాల శాతం కూడా ఎక్కువగానే ఉన్నాయి. సరైన ఆహారం ►మొక్కజొన్న తరచు తినడం వల్ల హైపర్ టెన్షన్ కూడా దూరం అవుతుంది. బీపీ, షుగర్, గుండె జబ్బులు అన్నిటికీ సరైన ఆహారం మొక్కజొన్న. ►అందుకే వర్షాకాలంలోనూ, చలికాలంలోనూ సరదాకి తినడానికి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి మేలు చేసే మొక్కజొన్నను ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యంగా ఉండచ్చు. చదవండి: Health Tips: ఈ పండ్ల గింజల్లో సైనైడ్‌ను విడుదల చేసే కారకాలు! తిన్నారంటే అంతే సంగతులు! జాగ్రత్త! Tips To Increase Platelet Count: ప్లేట్లెట్ల సంఖ్య పడిపోయిందా? బొప్పాయితో పాటు గుమ్మడి, గోధుమ గడ్డి.. ఇంకా ఇవి తింటే.. -
Pregnancy Planning: మాత్రల రూపంలో అమ్మే ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం వల్ల..
గర్భధారణను గతంలో ఎవరూ ప్లాన్ చేసుకునేవారు కాదు. అది వచ్చినప్పుడే వచ్చేది. కానీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ వల్ల చాలా ప్రయోజనాలున్నాయని మహిళలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదెందుకో తెలుసుకుందాం. సాధారణంగా గతంలో నెలతప్పాక ఒక వారం లేదా రెండువారాల మహిళకు అది అర్థమయ్యేది. తనకు ప్రెగ్నెన్సీ వచ్చిందేమో అనే అనుమానాన్ని నివృత్తి చేసుకోవడం కోసం కొన్ని పరీక్షలు చేయించుకోవడం పరిపాటి. కానీ ముందునుంచే గర్భధారణను ప్లానింగ్ చేసుకోవడం వల్ల పుట్టబోయే పిల్లల్లో కొన్ని లోపాలను ముందునుంచే నివారించుకునే అవకాశం ఉంది. ప్రెగ్నెంట్ మహిళకు ఫోలిక్ యాసిడ్ ఇవ్వడమే ఓ మంచి ఉదాహరణ. మాత్రల రూపంలో అమ్మే ఈ ఫోలిక్ యాసిడ్ చాలా చవక. పైగా అది మనం తీసుకునే అన్ని ముదురాకుపచ్చని ఆకుకూరల్లో పుష్కలంగా ఉండే పోషకం. సరైన పోషకాలు తీసుకోని కొందరు తల్లుల్లో పిల్లలు పుర్రె, వెన్నుపాము లోపాలతో పుడుతుంటారు. ముఖ్యంగా ఫోలిక్ యాసిడ్ తగినన్ని పాళ్లలో తీసుకోని తల్లులకు వెన్నుపాము లోపాల (న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్)తో పిల్లలు పుడతారు. పుట్టుకతో వచ్చే ఈ కండిషన్‌ను ‘స్పైనా బైఫిడా’ అంటారు. ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకున్న మహిళల్లో కనీసం మూడు నెలల ముందునుంచే ఫోలిక్ యాసిడ్ మాత్రలను ఆబ్స్ట్రెటీషియన్స్/ గైనకాలజిస్టులు సూచిస్తుంటారు. దాంతో న్యూరల్ట్యూబ్ డిఫెక్ట్‌తో పిల్లలు పుట్టే ముప్పును పూర్తిగా నివారించవచ్చు. అంతేకాదు... పౌష్టికాహారలోపాల వల్ల పిండదశలోనే వచ్చే మరెన్నో సమస్యలనూ నివారించడం ద్వారా ఆరోగ్యకరమైన రేపటిపౌరులకు జన్మనివ్వవచ్చు. ఇక మన దేశంలోని మహిళల్లో దాదాపు 80 శాతం మందిలో రక్తహీనత (అనీమియా) చాలా సాధారణం. ప్రెగ్నెన్సీని ముందే ప్లాన్ చేసుకునే మహిళకు ఐరన్ సప్లిమెంట్లు ఇవ్వడం ద్వారా కూడా తల్లీ, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా చూసుకునే అవకాశం ఉంది. అంతకుమునుపు ఉన్న ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నా... గర్భం ప్లాన్ చేసుకున్నప్పటి నుంచి మహిళకు ఆరోగ్యకరమైన సమతులాహారాన్ని ఇవ్వడం, అందులో అన్ని పోషకాలు అందేలా కూరగాయలు, ఆకుకూరలు, తాజాపండ్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం వంటి జాగ్రత్తలతో ఇటు కాబోయే తల్లి, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండటంతో పాటు, ఆ చిన్నారికి తగినంత రోగనిరోధక శక్తి సమకూరేలా చూడటం/జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సమాజానికీ మంచి మేలు కలిగేందుకు ఆస్కారం ఉంది. చదవండి: Badam Health Benefits: రాత్రంతా నీళ్లలో నానబెట్టి బాదం పొట్టు తీసి తింటున్నారా? వేటమాంసం తిన్న తర్వాత వీటిని తిన్నారంటే.. -
బొబ్బర్లు... గర్భిణులకు మేలు!
బొబ్బర్లలో ఫోలిక్ యాసిడ్ చాలా ఎక్కువగా ఉన్నందున గర్భవతులు లేదా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న వారు వీటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది. దాంతో పుట్టబోయే బిడ్డలో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ రాకుండా నివారించవచ్చు. ఇది మాత్రమే కాదు... వీటితో ఆరోగ్య ప్రయోజనాలెక్కువే. అందుకే బొబ్బర్లను తరచూ తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. బొబ్బర్లతో ఒనగూరే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలివి... విటమిన్ బి కాంప్లెక్, విటమిన్–సి కూడా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని సమకూర్చి అనేక వ్యాధులను నివారిస్తాయి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడటానికీ, మలబద్దకాన్ని నివారించడానికి దోహదపడతాయి. అంతేకాదు పెద్దపేగు క్యాన్సర్‌ను నివారిస్తాయి. బొబ్బర్లలో పిండిపదార్థాలు చాలా ఎక్కువ. అయినప్పటికీ తిన్న తర్వాత జీర్ణమై ఒంటికి పట్టేటప్పుడు ఆ చక్కెరలు మెల్లగా రక్తంలోకి వెలువడతాయి.అందుకే డయాబెటిస్ రోగులకు మంచివి. పొటాషియమ్ పాళ్లు ఎక్కువగానే ఉండటం వల్ల రక్తపోటును నియంత్రిస్తాయి. ప్రోటీన్లు కూడా ఎక్కువే. కండరాల రిపేర్లకు ఇవి తోడ్పడతాయి. గాయాలు త్వరగా తగ్గడానికి ఉపకరిస్తాయి. విటమిన్–ఏ ఎక్కువగా ఉండటం వల్ల కంటిచూపును కాపాడతాయి. అనేక నేత్రసంబంధ రుగ్మ తలను నివారిస్తాయి. జింక్, మెగ్నీషియమ్, ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలం. అందువల్ల మెరిసే ఒల్తైన జుట్టుకూ, దాని పెరుగుదలకు దోహదపడతాయి. అనేక చర్మసమస్యలనూ అరికడతాయి. క్యాల్షియమ్, ఫాస్ఫరస్ పాళ్లు కూడా ఎక్కువే. అందువల్ల ఎముకలు బలంగా, పటిష్టంగా ఉంచడానికి బొబ్బర్లు ఉపయోగపడతాయి. -
గుండెకు ఫోలిక్ రక్షణ
ఫోలిక్ యాసిడ్ తీసుకుంటున్నట్లయితే గుండె జబ్బులు రాకుండా ఉంటాయని ఒక తాజా పరిశోధనలో తేలింది. విటమిన్ బి–కాంప్లెక్స్‌లో ఒకటైన విటమిన్–బి9 (ఫోలిక్ యాసిడ్) సప్లిమెంట్లను వైద్యులు సాధారణంగా గర్భిణులకు సూచిస్తుంటారు. అయితే మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా ప్రతిరోజూ ఫోలిక్ యాసిడ్‌ను తీసుకుంటున్నట్లయితే, గుండె జబ్బులు, పక్షవాతం వంటి ప్రాణాంతక పరిస్థితులు తలెత్తే అవకాశాలు దాదాపు 75 శాతం మేరకు తగ్గుతాయని అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ నిపుణుల పరిశోధనలో తేలింది. ఈ నిపుణులు బీపీతో బాధపడుతున్న పదివేల మందికి పైగా పురుషులు, మహిళలకు ఏడాది కాలం బీపీ మాత్రలతో పాటు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లను కూడా ఇచ్చారు. వీరిలో కేవలం రెండు శాతం మంది మాత్రమే పక్షవాతం బారినపడ్డారు. కేవలం బీపీ మాత్రలను మాత్రమే తీసుకున్న వారిలో మాత్రం ఆరు శాతం మంది పక్షవాతానికి గురయ్యారు. ఈ పరిశోధన వివరాలను అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ జర్నల్ తాజా సంచికలో ప్రచురించారు. విటమిన్–డి, విటమిన్–సి, క్యాల్షియమ్ సప్లిమెంట్లతో పోలిస్తే, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ల ద్వారానే గుండె జబ్బులను, పక్షవాతం ముప్పును గణనీయంగా నివారించవచ్చని వారు తెలిపారు. -
అమ్మాహారం
అమ్మ ప్రాణం పంచుకుంటుంది. పాలు పంచుతుంది. బిడ్డ శక్తి పెరగాలని తన రక్తమాంసాలను సైతం పంచుతుంది. అలాంటి అమ్మ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? మన సమాజంలో బాలింతలకు పథ్యాలు చెబుతుంటారే!... మరి తను ఏమి తినాలి? తాను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎవరు చెప్పాలి. భర్త చెప్పాలి. అత్తమామలు చెప్పాలి. తోబుట్టువులు చెప్పాలి. తల్లిదండ్రులు చెప్పాలి. బంధువులు, స్నేహితులు చెప్పాలి. అమ్మను అపురూపంగా చూసుకోవాలి. పండంటి బిడ్డ కావాలని కోరుకునే ప్రతి కుటుంబం అమ్మ ఆహారం గురించి ఆలోచించాలి. తల్లీబిడ్డా సౌఖ్యంగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉండటానికి కొన్ని సూచనల సమాహారం ఈ అమ్మాహారం. మహిళలు తాము గర్భం ధంరిచడానికి మూడు నెలల ముందునుంచే ఫోలిక్ యాసిడ్ అనే పోషకాన్ని తీసుకోవాలి. ఇది పిల్లల్లో వచ్చే న్యూరల్ ట్యూబ్ సమస్యలతో పాటు మరెన్నో వైకల్యాలను నివారిస్తుంది. దీనితో పాటు ఐరన్ ఎక్కువగా ఉండే పదార్థాలనూ తీసుకోవాలి. ఈ ఫోలిక్ యాసిడ్, ఐరన్ కోసం పాలకూర వంటి ఆకుకూరలతో పాటు ముల్లంగి ఆకులు, కాలీఫ్లవర్ ఆకులను కూరలుగా చేసి తీసుకోవచ్చు. ఆరోగ్యమైనా, అనారోగ్యమైనా తల్లి నుంచే బిడ్డకు సంక్రమిస్తుంది. బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే, తల్లి ఆరోగ్యంగా ఉండక తప్పదు. బిడ్డ ఆరోగ్యం కోసం తల్లి గర్భం దాల్చినప్పటి నుంచే జాగ్రత్తలు పాటించాలి. తగిన పోషక విలువలతో కూడిన ఆహారం అదనంగా తీసుకోవాలి. ప్రసవం తర్వాత బిడ్డకు తల్లి రొమ్ముపాలు పట్టాలి. బిడ్డ ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తల్లిపాలే ఆధారం. అందువల్ల పాలిచ్చే దశలోనూ తల్లి తగిన పోషకాహారం తీసుకోవాలి. అప్పుడే బిడ్డకు తల్లిపాల ద్వారా తగిన పోషకాలు అందుతాయి. తల్లిపాల పోషణలో బిడ్డ ఎదుగుదల ఆరోగ్యకరంగా ఉంటుంది. రోగనిరోధకశక్తి పెరుగుతుంది. తరచు వ్యాధులకు గురయ్యే పరిస్థితి తప్పుతుంది. బిడ్డల ఆరోగ్యం కోసం ఏయే దశల్లో ఎయే జాగ్రత్తలు తీసుకోవాలో వివరించేందుకే ఈ కథనం... గర్భనిర్ధారణ జరిగినప్పటి నుంచే... గర్భందాల్చినట్లు పరీక్షల్లో నిర్ధారించినప్పటి నుంచే తల్లులు తగిన పోషకాహారం తీసుకోవడం ప్రారంభించాలి. మొదటి మూడు నెలల కాలంలో గర్భస్థ పిండం ఎదుగుదల ప్రాథమిక దశలో ఉంటుంది. ఈ దశలో కడుపులోని బిడ్డ అవయవాలు నెమ్మదిగా ఏర్పడుతుంటాయి. వాటి ఎదుగుదల సక్రమంగా ఉండాలంటే, మొదటి మూడు నెలల కాలంలో తల్లి ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా లభించే పాలు, గుడ్లు, పప్పుధాన్యాలు, చికెన్, మటన్, చేపలు వంటివి తీసుకోవాలి. రోగనిరోధక శక్తి పెంచడానికి.. మూడు నెలలు నిండిన తర్వాత ఆరునెలల వరకు కడుపులోని బిడ్డ మెదడు, కళ్లు వంటి అవయవాలు ఎదుగుతుంటాయి. ఎముకలు ఏర్పడుతుంటాయి. ఈ దశలో తల్లులు బిడ్డ రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని అదనంగా తీసుకోవాలి. విటమిన్లు, క్యాల్షియం వంటి మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పాలు పుష్కలంగా తీసుకోవాలి. చక్కని ఎదుగుదల కోసం... ఆరునెలలు నిండాక బిడ్డ ఆకారం దాదాపు పూర్తిగా ఏర్పడుతుంది. ఈ దశలో తల్లులు కడుపులోని బిడ్డ ఎదుగుదల చక్కగా ఉండేందుకు తగిన ఆహారం తీసుకోవాలి. బిడ్డ ఎదిగే క్రమంలో తల్లి ఒకేసారి ఎక్కువగా తినలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కువ పరిమాణంలో ఆహారం తినలేని ఈ దశలో తల్లులు పుష్కలంగా పోషకాలు గల నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవడంపై దృష్టి పెట్టాలి. ప్రొటీన్లు, ఆరోగ్యవంతమైన కొవ్వులు, విటమిన్లు, మినరల్స్‌తో కూడిన పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, గుడ్లు, చేపలు, చికెన్, మటన్ వంటివి తీసుకోవాలి. సాక్షాత్తు అమృతమే తల్లిపాలు బిడ్డకు సాక్షాత్తు అమృతంతో సమానం. శిశువులు కూడా అరిగించుకోగల ఆరోగ్యకరమైన కొవ్వులు తల్లిపాలలోనే దొరుకుతాయి. తల్లిపాలలో ముఖ్యంగా డొకాసో హైగ్జానోయిక్ యాసిడ్ (డీహెచ్ఏ) అనే కొవ్వులు ఉంటాయి. ఇవి బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదలకు చాలా ముఖ్యమైనవి. పిల్లల మెదడులో ఉండేవన్నీ కొవ్వుకణాలే. వాటిలో 97 శాతం ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌కు చెందిన డీహెచ్ఏ కొవ్వులే ఉంటాయి. పిల్లల రెటీనాలోని కొవ్వు కణాల్లో 93 శాతం ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్‌కు చెందిన డీహెచ్ఏ కొవ్వులే ఉంటాయి. ఇవి బిడ్డకు నేరుగా తల్లిద్వారానే అందుతాయి. గర్భస్థ దశలోనే కాదు, పుట్టిన రెండేళ్ల వరకు ఇవే కొవ్వులు బిడ్డకు అందుతుండాలి. అప్పుడే బిడ్డ కంటిచూపు, మెదడు ఎదుగుదల బాగుంటాయి. తెలివితేటలకు కారణమయ్యే ‘గ్రే మ్యాటర్’ తయారీకి, చిన్నారి గుండెకు కూడా ఈ కొవ్వులే అండగా ఉంటాయి. ప్రకృతి తప్ప తల్లిపాల ఫార్ములాను ఇంతవరకు ఎవరూ కృత్రిమంగా తయారు చేయలేదు. ఫార్ములా పాలు అని చెబుతూ, మార్కెట్లో అమ్ముతున్న నానా కంపెనీల పాలపొడులేవీ తల్లిపాలకు సాటిరావు. ఆరునెలలూ తల్లిపాలే కీలకం ప్రసవం తర్వాత శిశువుకు ఆరునెలలు నిండేంత వరకు తల్లిపాలే కీలకం. ఆరునెలల వరకు తప్పనిసరిగా తల్లిపాలు తాగించాలి. బిడ్డకు ఏడాది, ఏడాదిన్నర వయసు వచ్చేంత వరకు కూడా తల్లిపాలు తాగించవచ్చు. అయితే, తొలి ఆరునెలలు తల్లిపాల నుంచే బిడ్డకు తగిన పోషకాలను అందించాల్సిన పరిస్థితి ఉంటుంది. అందువల్ల ఆ కాలంలో కూడా తల్లులు అదనంగా పోషకాహారం తీసుకోవాలి. ప్రొటీన్లు, ఆరోగ్యవంతమైన కొవ్వులు, విటమిన్లు, మినరల్స్‌తో కూడిన పాలు, గుడ్లు, చేపలు, చికెన్, మటన్, పప్పుధాన్యాలు, తృణధాన్యాలు, బాదం, అవిసెగింజలు వంటి నట్స్ వంటివి తీసుకోవాలి. ఆరునెలలు నిండిన తర్వాత బిడ్డకు తల్లిపాలతో పాటు ఇతర ఆహారం అందిచడం మొదలుపెట్టాక తల్లులు సాధారణ రీతిలో సమతుల ఆహారం తీసుకుంటే సరిపోతుంది. ఇవి తినకూడదు ఆరోగ్యానికి చేటు తెచ్చిపెట్టే ప్రాసెస్డ్ ఫుడ్, కృత్రిమ రంగులు, ఎక్కువకాలం నిల్వ ఉంచడానికి రసాయనాలు ఉపయోగించే ఆహార పదార్థాలు, మితిమీరి చక్కెర వాడే పదార్థాలకు, అతిగా కొవ్వులు వాడే పదార్థాలు వంటి వాటికి గర్భిణులు, బాలింతలు దూరంగా ఉండాలి. ఇలాంటి పదార్థాల వల్ల తల్లితో పాటు బిడ్డ ఆరోగ్యానికీ చేటు కలుగుతుంది. గర్భిణి దశలో గానీ, బాలింత దశలో గానీ తల్లులు కొవ్వులు మితిమీరి తింటే వారి బిడ్డలు భవిష్యత్తులో స్థూలకాయులుగా మారే ప్రమాదం ఉంటుంది. కృత్రిమ రంగులు, రసాయనాలు ఉపయోగించిన పదార్థాలను తీసుకుంటే బిడ్డల శారీరక, మానసిక ఎదుగుదలలో లోపాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఇలాంటి పదార్థాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. డీహెచ్ఏను తగ్గించే సిగరెట్ పొగ తల్లిలో తయారయ్యే డీహెచ్ఏ కొవ్వులకు సిగరెట్ పొగ చాలా చేటు చేస్తుంది. అందువల్ల గర్భిణులు ఎట్టి పరిస్థితుల్లోనూ సిగరెట్ పొగ సోకకుండా చూసుకోవాలి. భర్తలకు సిగరెట్ అలవాటు ఉంటే, ప్యాసివ్ స్మోకింగ్ ద్వారా అది తల్లికి, కడుపులోని బిడ్డకు హాని చేస్తుంది. అందుకే తండ్రులకు సిగరెట్ అలవాటు ఉంటే, తమ భార్యాబిడ్డల క్షేమం కోసం ఆ అలవాటును తక్షణం మానేయాలి. - ఇన్పుట్స్: సుజాతా స్టీఫెన్, న్యూట్రీషియనిస్ట్, మ్యాక్స్‌క్యూర్ హాస్పిటల్, మాదాపూర్, హైదరాబాద్ -
పక్షవాతాన్ని తగ్గించే పాలకూర!
పక్షవాతం వచ్చే రిస్క్‌ను నివారించే విషయంలో పాలకూర సమర్థంగా ఉపయోగపడుతుందని చైనీస్ శాస్త్రవేత్తల అధ్యయనం నిరూపించింది. పాలకూరలోని ఫోలిక్ యాసిడ్ వల్ల ఈ ప్రయోజనం ఒనగూరుతుందని శాస్త్రజ్ఞులు తెలిపారు. మరీ ముఖ్యంగా హైపర్‌టెన్షన్ (హైబీపీ) వల్ల పక్షవాతం వచ్చే అవకాశాలను ఫోలిక్ యాసిడ్ బాగా నివారిస్తుందని, పాలకూరలో ఇది పుష్కలంగా ఉంటుందని వారు పేర్కొంటున్నారు. హైబీపీ ఉన్న 20,702 మందిపై నిర్వహించిన అధ్యయనంలో ఇది తేలింది. వీళ్లంతా హైబీపీని తగ్గించే ‘ఎనాలప్రిల్’ అనే మందును వాడుతున్నవారే. వీరికి మందుతో పాటూ ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండే పాలకూరలు, ఇతర ఆకుకూరల కాంబినేషన్లలలో ఆహారాన్ని అందించారు. అయితే ఫోలిక్ యాసిడ్‌ను క్రమం తప్పకుండా తమ ఆహారంలో తీసుకుంటున్నవారిలో స్ట్రోక్ వచ్చేందుకు అన్ని విధాలా రిస్క్ ఉన్నవారే అయినప్పటికీ అవి వచ్చే అవకాశాలు 21 శాతం పడిపోయాయని అధ్యయనవేత్తలు గుర్తించారు. పైగా దీనితో పాటు గుండెజబ్బులు (కార్డియోవాస్క్యులార్ డిసీజెస్) వచ్చే అవకాశాలు కూడా గణనీయంగా తగ్గాయి. ఈ పరిశోధన ఫలితాలను ‘ద జర్నల్ ఆఫ్ ద అమెరికన్ అసోసియేషన్’ అనే మెడికల్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
గర్భిణి బెండకాయ తింటే.. !
వెజ్ఫ్యాక్ట్స్ *బెండకాయలో... ఐరన్, క్యాల్షియం, పొటాషియం, సోడియం, కాపర్, మెగ్నీషియం, సిలీనియం, మాంగనీస్, జింక్ వంటి పోషకాలతోపాటు సి,ఎ, ఇ,కె విటమిన్లు ఉంటాయి. జీర్ణవ్యవస్థకు దోహదం చేసే పీచు కూడా ఉంటుంది. * బెండకాయ తింటే అధిక బరువు, కొలెస్ట్రాల్ తగ్గుతాయి. మధుమేహం ఉన్న వారు వారానికోసారయినా తింటే మంచిది. ఈ కూరగాయ... చర్మకాంతిని మెరుగుపరిచి, ఎముకలను శక్తిమంతం చేస్తుంది. * బెండకాయ కోలన్ క్యాన్సర్(పెద్దపేగు క్యాన్సర్), ఊపిరితిత్తుల క్యాన్సర్లను నివారిస్తుంది. దంత క్షయాన్ని కూడా నివారిస్తుంది. * గర్భవతిగా ఉన్నప్పుడు బెండకాయ తినడం వల్ల పిండం ఎదుగుదల బావుంటుంది. ఫోలేట్ అనే పోషకం సమృద్ధిగా అందడం వల్ల బిడ్డ మెదడు నిర్మాణం ఆరోగ్యకరంగా ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ నాడీవ్యవస్థ ఆరోగ్యకరంగా ఏర్పడడానికి దోహదం చేస్తుంది. గర్భధారణ జరిగిన నాలుగు నుంచి పన్నెండు వారాల లోపు ఈ పోషకాలు చాలా అవసరం. - ఉషశ్రీ, న్యూట్రిషనిస్ట్ -
ఫిట్స్... మూర్ఛాభిప్రాయాల నుంచి తేరుకోండి!
మనం మూర్ఛ అని పిలుచుకునే ఫిట్స్ అంటే అందరికీ భయమే. వ్యాధిగా అది ప్రాణాంతకం కాకపోయినా... ప్రమాదానికి గురిచేసే పరిస్థితులకు దారి తీస్తుంది. ఉదాహరణకు ఫిట్స్ రోగి ఏ రైలు పట్టాలు దాటే సమయంలోనో, ఏ ఈతకొట్టే సమయంలోనో మూర్ఛకు గురైతే అది ప్రాణాంతకమే కదా. అయితే నిర్దిష్టంగా నిర్ణీతకాలం పాటు చికిత్స తీసుకుంటే పూర్తిగా అదుపులో ఉండే వ్యాధి ఇది. అందుకే ఫిట్స్, సీజర్స్, ఎపిలెప్సీ అని పిలిచే మూర్ఛపై అవగాహన పెంచుకోవాలి. అందుకు ఉపయోగపడేదే ఈ కథనం. మీకు తెలుసా? పుట్టిన ప్రతి ఒక్కరికీ ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతివారిలోనూ ఫిట్స్ రాకుండా అడ్డుకునే ఒక యంత్రాంగం ఉంటుంది. దీన్నే థ్రెష్‌హోల్డ్ అని డాక్టర్లు అభివర్ణిస్తుంటారు. మనకు ఫిట్స్ రావడం లేదంటే అందుకు అడ్డుపడుతున్న మన గడప (థ్రెష్‌హోల్డ్) ఎత్తు ఎక్కువగా ఉందన్నమాట. ఎవరిలోనైతే ఈ థ్రెష్‌హోల్డ్ తక్కువగా ఉందో, వారికి ఫిట్స్ వచ్చే అవకాశం ఎక్కువ. ఫిట్స్ అన్నది పుట్టిన నాటినుంచి మరణం వరకు ఏ దశలోనైనా కనిపించవచ్చు. ప్రధానంగా పల్లెప్రాంతాల్లో ఎక్కు వ. ఫిట్స్ గురించి విన్నా, చూసినా భయంకరంగా అనిపిస్తుంది గాని, నిజానికి ఇదేమీ భయంకరమైన వ్యాధి కాదు. మానసిక వ్యాధి అంతకంటే కాదు. ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే అంటువ్యాధి కాదు. కాకపోతే దీనిగురించి అనేక అపోహలు ఉండటంతో చికిత్స తీసుకునే వారి సంఖ్య కూడా తక్కువే. ఒక అంచనా ప్రకారం 60 శాతం మంది రోగులు చికిత్సకు దూరంగా ఉన్నారు. ఈ వ్యాధి పట్ల వివక్ష కూడా ఇందుకు ఒక కారణం. ఫిట్స్‌కు కారణాలు : ఫిట్స్‌కు గురైనవారిలో 70 శాతం మందికి నిర్దిష్టంగా కారణం ఏమిటన్నది తెలియదు. కేవలం 30 శాతం మందిలోనే కారణాన్ని కనుగొనవచ్చు. అనువంశీకంగా కనిపించడం, పక్షవాతం, తలకు దెబ్బతగలడం, మెదడులో గడ్డలు, ఏదైనా ఇన్ఫెక్షన్కు గురికావడం వంటివి ఫిట్స్‌కు ప్రధాన కారణాలు. ఫిట్స్‌ను ప్రేరేపించే అంశాలు: మితిమీరి ఆల్కహాల్ సేవిం చడం, అకస్మాత్తుగా ఆల్కహాల్ మానేయడం, నిద్రసరిగా లేకపోవడం, తీవ్రమైన మానసిక ఒత్తిడి, వెలుగుతూ, ఆరుతూ ఉండే లైట్ల మధ్య ఉండాల్సి రావడం, రుతుక్రమం... వంటివి ఫిట్స్‌ను ప్రేరేపించవచ్చు. ఫిట్స్‌లో రకాలు: మూర్ఛలో దాదాపు 40 రకాలున్నాయి. అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడం, కాళ్లు, చేతులు కొట్టుకుంటూ ఉండటం, కనుపాపలు పైవైపునకు తిరుగుతూ ఉండటం వంటి లక్షణాలుండే ఫిట్స్ ఐదు నిమిషాల కంటే తక్కువసేపు ఉంటుంది. కొందరిలో కేవలం స్పృహ కోల్పోవడం మాత్రమే జరుగుతుంది. కొందరిలో కేవలం చేతులు మాత్రమే ఉలిక్కిపడ్డట్లు (ఒక జర్క్)గా కదులుతాయి. ఆ తర్వాత మళ్లీ వాళ్లు మామూలైపోతారు. కొందరు స్పృహ కోల్పోరు గాని, కాసేపు అచేతనంగా ఉండిపోతారు. ఇక కొందరిలోనైతే వారి ప్రవర్తనలో మార్పులు వస్తాయి. ఫిట్స్ ఐదు నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో వస్తే అవి మెదడుకు హానిచేయవు గానీ ఆ పరిస్థితిలో కొందరు నాలుకను బలం గా కొరుక్కుంటారు. మరికొందరిలో పంటివరసకు గాయాలు కావడం, భుజం ఎముక స్థానం తప్పడం లేదా విరగడం, తలకు గాయం కావడం వంటివి కూడా జరగవచ్చు. నిర్ధారణ పరీక్షలివి: ఫిట్స్‌ను గుర్తించి, నిర్ధారణ చేయడం ఎంతో ప్రధానం. ఎందుకంటే కొన్నిసార్లు రక్తంలో చక్కెరపాళ్లు, సోడియం, క్యాల్షియమ్ వంటివి తగ్గడం లేదా పెరగడం వల్ల కూడా ఫిట్స్ వస్తాయి. ఇలాంటి రోగులకు చాలాకాలం పాటు మందులు వాడవలసిన అవసరం ఉండదు. కానీ ఫిట్స్ మళ్లీ రాకుండా ఉండటానికి చికిత్స తీసుకోవాలి. ఇక ఫిట్స్‌కు కారణం, నిర్ధారణ కోసం సీటీ స్కాన్ లేదా ఎమ్మారై బ్రెయిన్, ఈఈజీ వంటి పరీక్షలు చేయించాలి. చికిత్స: ప్రస్తుతం ఫిట్స్ కోసం దాదాపు 15 రకాల మందులు అందుబాటులో ఉన్నా యి. రోగి శరీరం బరువు ఆధారంగా వీటి మోతాదును నిర్ణయించాల్సి ఉంటుంది. ఒకసారి ఫిట్స్ కనిపించాక ఇక అతడు కనీసం రెండేళ్లపాటు క్రమం తప్పకుండా మందులు తీసుకోవాల్సి ఉంటుంది. కొందరిలో కొంతకాలం మందులు వాడాక కొంతకాలం పాటు ఫిట్స్ కనిపించవు. దాంతో చాలామంది మందులు ఆపేస్తుంటారు. ఫలితంగా ఫిట్స్ మళ్లీ కనిపించే అవకాశముంది. ఇలా మాటిమాటికీ ఫిట్స్ కనిపించకుండా ఉండాలంటే పూర్తికోర్సు మందులు వాడాల్సిందే. ఇక తీవ్రత ఆధారంగా మందును, మోతాదును నిర్ణయించే ఈ రోగుల్లో దాదాపు 70 శాతం మందిలో కేవలం ఒకే ఒక మందుతో ఇవి నియంత్రణలోకి వస్తాయి. కొద్దిమందిలోనే... అంటే మరో 10 శాతం మంది రోగుల్లో రెండు మందులు, ఇంకో 10 శాతం మందిలో మూడు మందులను వాడాల్సి ఉంటుంది. 70 శాతం రోగుల్లో రెండేళ్ల తర్వాత మందును ఆపేయవచ్చు. అయితే దీనికోసం డాక్టర్లు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయానికి వస్తారు. ఇక మరో 10 శాతం మంది రోగుల్లో నాలుగు రకాల మందులు వాడినా ఫిట్స్ పునరావృతమవుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో ఈ ఫిట్స్‌కు కారణం ఏమిటి, అవి మెదడులో ఎక్కడ ఆవిర్భవిస్తున్నాయి వంటి అంశాలను ఎమ్మారై బ్రెయిన్ ఎపిలెప్సీ ప్రోటోకాల్, వీడియో ఈఈజీ, స్పెక్ట్, పెట్ వంటి పరీక్షలతో నిర్ధారణ చేసి, ఆ ప్రాంతాన్ని శస్త్రచికిత్స ద్వారా తొలగించడంతో వాటిని అరికట్టవచ్చు లేదా వాటి తీవ్రతను, వచ్చే ఫ్రీక్వెన్సీని తగ్గించవచ్చు. ఇలాంటి పది శాతం మినహాయిస్తే ఫిట్స్ రోగులందరిలోనూ దాదాపు ఇవి పూర్తిగా అదుపులో ఉంటాయి. ఫిట్స్‌ను నియంత్రించేందుకు ఇప్పుడు కొత్తగా మరికొన్ని మార్గా లు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో ముఖ్యంగా డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ప్రక్రియ ద్వారా ఫిట్స్‌ను నియంత్రించవచ్చు. కొందరు చిన్నపిల్లలకు కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారం (కీటోజెనిక్ డైట్) ఇవ్వడం ద్వారా ఫిట్స్‌ను అదుపు చేస్తున్నారు. ఇక మరికొందరిలో ‘వేగస్ నర్వ్’ అనే నరాన్ని ప్రేరేపించడం ద్వారా కూడా చికిత్స చేస్తున్నారు. మూర్ఛ... వివాహబంధంపై దాని ప్రభావం: ఫిట్స్ వచ్చినప్పుడు కనిపించే లక్షణాలు... అంటే స్పృహకోల్పోవడం, కాళ్లుచేతులు కొట్టుకోవడం, నోట్లోంచి లాలాజలం కారడం, ఎక్కడ పడుతున్నారో అన్న ధ్యాస లేకుండా పడిపోవడం వంటి లక్షణాల కారణంగా ఈ వ్యాధి వచ్చిన వారిపట్ల మన సమాజంలో చాలా వివక్ష ఉంటుంది. కానీ మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికీ ఈ వ్యాధి ఏ సమయంలోనైనా వచ్చే అవకాశం ఉందని, ఎవరూ ఇందుకు అతీతులు కారనీ, కేవలం అదృష్టవశాత్తు మన థ్రెష్‌హోల్డ్ అనుమతించకపోవడంతోనే మనకింకా ఫిట్స్ రాలేదని గుర్తిస్తే, ఫిట్స్ రోగుల పట్ల మన వివక్ష తగ్గుతుంది. ఈ సామాజిక వివక్ష కారణంగానే ఫిట్స్ వచ్చిన వారిని వివాహం చేసుకోవడం అనే విషయంలోనూ వివక్ష కొనసాగుతోంది. ఇక పెళ్లయ్యాక మహిళకు ఫిట్స్ వచ్చిన సందర్భాల్లో ఆ వివాహం విచ్ఛిన్నమైన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఫిట్స్ రావడం అన్నది చాలా సాధారణంగా జరిగేదే. ఇది ప్రమాదకరమైన వ్యాధి కానే కాదు. పైగా మందులతో పూర్తిగా అదుపులో ఉంటుంది. ఇది అంటువ్యాధి కాదు... అనే భావనలు అందరిలోనూ కలిగితే ఈ వ్యాధి పట్ల ఉన్న అపోహలు తొలగిపోతాయి. దాంతో వివాహానికి ఇది ప్రతిబంధకం కానేకాదని అర్థమవుతుంది. ఫిట్స్ వచ్చిన మహిళను పెళ్లి చేసుకుంటే వాళ్లకు పిల్లలు పుట్టరనే అపోహ చాలామందిలో ఉంది. ఇది అపోహ మాత్రమే. అలాగే ఫిట్స్ వచ్చే మహిళలు మందులు వాడుతూ ఉన్నప్పుడు గర్భధారణకు ప్లాన్ చేసుకున్నా లేదా గర్భం ధరించాలని అనుకుంటున్నా, వారి డాక్టర్‌ను సంప్రదించి, ఒకవేళ వారు వాల్‌ప్రోయేట్ అనే మందును వాడుతుంటే, దానికి బదులు మరో మందు మార్పించుకోవాలంతే. ఒకవేళ వారు ఆ మందు వాడకుండా ఇతర రకాలు వాడుతుంటే ఇక కేవలం మిగతా అందరు గర్భధారణ కోరుతుండే మహిళల్లాగానే ఫోలిక్ యాసిడ్- 5ఎం.జీ. మాత్రలు వాడాలి. దీనివల్ల గర్భధారణ సమయంలో పిండదశలో కలిగే అనేక అనర్థాలను నివారించినట్లవుతుంది. అందుకే గతంలో ఫిట్స్ వచ్చిన మహిళలు లేదా ఫిట్స్ వచ్చి మందులు వాడుతున్న యువతులు గర్భధారణను కోరుకుంటున్నప్పుడు తమ డాక్టర్‌ను కలిసి తప్పనిసరిగా తగు సలహా, అవసరాన్ని బట్టి చికిత్స తీసుకోవాలి. డ్రైవింగ్‌పై ఫిట్స్ ప్రభావం: ఫిట్స్ వచ్చినవారు అవి పూర్తిగా అదుపులోకి వచ్చాయనే నిర్ధారణ జరిగేవరకు వాహనాన్ని నడపకపోవడం అన్నివిధాలా మేలు. దీనివల్ల రోగుల ప్రాణాలతో పాటు, ఎదుటివారి ప్రాణాలనూ కాపాడినవారవుతారు. అలాగే ఈత నుంచి కూడా దూరంగా ఉండాలి. ప్రమాదభరితంగా ఉండే ప్రదేశాలకు వెళ్లకుండా ఉండటం మంచిది. వైద్యశాస్త్రవిజ్ఞానం ఇంతగా పురోగమించిన ఈ రోజుల్లోై ఫిట్స్‌పై దురభిప్రాయాలు తొలగిపోవడం ఎంతో అవసరం. - నిర్వహణ: యాసీన్ ఫిట్స్ రోగిని చూడగానే చేయవలసిన సహాయం మన సమాజంలో ఫిట్స్ రోగిని చూసినప్పుడు చాలామంది వాళ్లకు తాళంచెవులు అందించడం, చేతిలో ఏదైనా లోహపు వస్తువు పెట్టడం వంటివి చేస్తుంటారు. నిజానికి ఇలాంటిపనులు చేయకూడదు. ఫిట్స్ వచ్చిన రోగిని చూసినప్పుడు చేయాల్సినవి... అతడిని సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలి. కానీ ఎక్కువగా కదిలించకూడదు నోటిలోగాని చేతిలోగాని బలమైన లోహపు వస్తువులను ఉంచకూడదు రోగి ఒక పక్కకు ఒరిగి ఉండేలా పడుకోబెట్టాలి రోగి కాళ్లు, చేతులు కొట్టుకుంటున్నప్పుడు దాన్ని ఆపడానికి ప్రయత్నించకూడదు. సాధారణంగా ఫిట్స్ వచ్చినప్పుడు ఐదు నిమిషాల్లో రోగి తనంతట తానే మామూలు స్థితిలోకి వస్తాడు. ఒకవేళ అలా జరగకపోయినా లేదా మళ్లీ వెంటనే ఫిట్స్ రావడం ప్రారంభమైనా వీలైనంత త్వరగా అతడిని ఆసుపత్రికి తరలించాలి. డాక్టర్ బి. చంద్రశేఖర్ రెడ్డి చీఫ్ న్యూరోఫిజీషియన్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్.