Usha sri
-
ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్
-
అయోధ్య ప్రాణ ప్రతిష్ట వేళ.. తెలుగు వారు గర్వపడే విషయం!
అది 1973 సంవత్సరం.. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12.05 ని. కావస్తోంది. కాసేపట్లో ఉషశ్రీ ధర్మసందేహాలు కార్యక్రమం.. శ్రోతల ప్రశ్నలకు సమాధానాలు, ఆ తరువాయి శ్రీమద్భారతం ప్రవచనం.. అంటూ ప్రకటన వినపడగానే తెలుగు లోగిళ్లు నై మిశతపోవనాలుగా మారిపోయాయి. ‘ఉషశ్రీ ఉపన్యాసాలు స్నిగ్ధ గవాక్షాలు’ అని పలువురు పెద్దలు ప్రశంసించారు. అలా ప్రారంభమైన ఆ కార్యక్రమం – 1990 సెప్టెంబరు 7 వ తేదీ ‘ఉషశ్రీ’ కన్నుమూసే వరకు కొనసాగింది. ఆకాశవాణి ద్వారా ఉషశ్రీ.. వాల్మీకి రామాయణం, కవిత్రయ భారతం, పోతన భాగవతాలను తెలుగు శ్రోతలకు వినిపించారు. శ్రోతల సందేహాలకు చమత్కారంగా సమాధానాలిచ్చేవారు. ఉషశ్రీ నేపథ్యం.. పశ్చిమగోదావరి జిల్లా కాకరపర్రు గ్రామంలో 1928, మార్చి 16న పురాణపండ రామమూర్తి, కాశీ అన్నపూర్ణ దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించారు పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు. ‘ఉషశ్రీ’ కలం పేరుతో తెలుగువారికి సుపరిచితులయ్యారు. జ్వలితజ్వాల, అమృత కలశం, మల్లెపందిరి, సంతప్తులు, ప్రేయసి – ప్రియంవద, తరాలు-అంతరాలు వంటి నవలలు, కథలు, వెంకటేశ్వర కల్యాణం వంటి యక్షగానాలు, పెళ్లాడేబొమ్మా(నవలా లేఖావళి), వ్యాసాలు, విమర్శలు, నాటికలు రాసిన ఉషశ్రీ... రామాయణభారత ఉపన్యాసాలు ప్రారంభించాక ఇక కథలు, పద్యాలు, నవలలు విడిచిపెట్టేశారు. ఉచ్ఛ్వాసనిశ్వాసలుగా.. తుది శ్వాస విడిచేవరకు రామాయణభారతాలే ఉచ్ఛ్వాసనిశ్వాసలుగా జీవించారాయన. శృంగేరి శారదా పీఠం ఆస్థానకవిగా సత్కారం అందుకున్నారు. ఉషశ్రీ రచించిన రామాయణ భారత భాగవతాలను తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని లక్షల కాపీలు ముద్రించింది. ఇప్పుడు తెలుగువారు గర్వించే సన్నివేశం చోటు చేసుకుంది. అదే అయోధ్యలో ఉషశ్రీ గళం. అయోధ్య అంతటా.. ఉషశ్రీ గళంలో జాలువారిన రామాయణం ఇప్పుడు అయోధ్యలో వినిపిస్తోంది. అయోధ్యను సందర్శించి, విన్నవారు ఈ సంగతిని చెప్పారు. అంతే కాకుండా దేశంలోని అనేక ఎఫ్.ఎం. స్టేషన్లు కూడా దీనిని ప్రసారం చేస్తున్నాయి. కేంద్రంలో అత్యంత ఉన్నత స్థాయిలో ఉన్న ఒకరి చొరవతో ఇది సాధ్యమైందని తెలిసింది. విజయవాడ, హైదరాబాద్ కేంద్రాలు తమ ఎఫ్.ఎం. స్టేషన్లలో వీటిని తాజాగా ప్రసారం చేశాయి. వీటిని విన్నవారు, ఇదే స్వరాన్ని అయోధ్య ఆలయంలో కూడా విన్నామని చెబుతున్నారు. ఆటుపోట్ల నడుమ ఆ గళం.. సరిగ్గా ఐదు దశాబ్దాల క్రితం ఉషశ్రీ గళ ప్రస్థానం ఆకాశవాణి విజయవాడలో వినబడడం ప్రారంభమైంది. ధర్మసందేహాలు శీర్షికన మహాభారతంతో మొదలై, శ్రీ భాగవతం వరకూ కొనసాగింది. ఆ సమయంలో ఆయన ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఉషశ్రీ గారు భౌతికంగా అదృశ్యమై 33 సంవత్సరాలు అయినా ఆ గళం ఇంకా సజీవంగా ఉండడానికి ప్రధాన కారణం ఆయన అభిమానులు. ఆ తరువాత కరోనా సమయంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఉషశ్రీ కుటుంబ సభ్యులను సంప్రదించి.. రామాయణ, భారత, భాగవతాలను ప్రసారం చేసింది. ఇప్పుడు అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట సందర్భాన్ని పురస్కరించుకుని ఉషశ్రీ రామాయణం దేశవ్యాప్తంగా అన్ని ఎఫ్.ఎం.లలోనూ ప్రసారమవుతోంది. అయోధ్య రామాలయ పరిసరాల్లోనూ మార్మోగుతోంది. ఉత్తర భారతంలో ఉషశ్రీ రామాయణాన్ని వినిపించడం అది కూడా రాముని విగ్రహ ప్రతిష్ఠ సమయంలో ప్రసారం చెయ్యడం తెలుగు వారందరికీ ఎంతో గర్వకారణం. -
సంక్షేమ సారథి జగన్
‘బీసీ వర్గానికి చెందిన నా చెల్లి ఉషాను ఎమ్మెల్యేగా...మా అన్న తలారి పీడీ రంగయ్యను ఎంపీగా ఆశీర్వదించి గెలిపించండి’ అంటూ కళ్యాణదుర్గం నియోజకవర్గ ఓటర్లను ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. గురువారం కళ్యాణదుర్గంలో నిర్వహించిన ఎన్నికల సభలో అభ్యర్థులిద్దరినీ ఆయన పరిచయం చేస్తూ మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలకు ఉషాశ్రీచరణ్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని అన్నారు. మంచి మనిషి అంటూ పరిచయం చేశారు. తలారి పీడీ రంగయ్య ఓ మంచి అధికారి అని, ప్రజలకు సేవ చేయాలనే తపనతో ఉద్యోగాన్ని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చారని అలాంటి వారిని గెలిపిస్తే ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. ప్రలోభాలను తిప్పికొట్టండి అన్ని వర్గాలనూ మోసం చేసిన చంద్రబాబు ఓటమి అంచుల్లో ఉన్నారు. వాల్మీకులను ఎస్టీల్లో చేరుస్తామంటూ చంద్రబాబు మోసం చేశారు. డబ్బుతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. దీనిని తిప్పి కొట్టండి. బీసీలకు వైఎస్ జగన్ అవకాశం ఇచ్చారు. ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి నన్ను ఎంపీగా, ఉషాశ్రీచరణ్‌ను ఎమ్మెల్యే గెలిపించండి. నవరత్న పథకాలతో పేదల కుటుంబాల్లో వెలుగు నింపేందుకు జగనన్న సిద్ధంగా ఉన్నారు. సింహం లాంటి జగన్ వాస్తవాలే చెబుతారు. ఎక్కడ చూసినా జననేతకు జనం జేజేలు పలుకుతున్నారు. ఈ ఐదు రోజులు కష్టపడి పనిచేయండి. – కళ్యాణదుర్గం బహిరంగ సభలో తలారి పీడీ రంగయ్య, ఎంపీ అభ్యర్థి బీసీ, మైనారిటీల పక్షపాతి జగన్ బీసీలు, మైనారిటీలకు చట్టసభల్లో సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా జగన్ మోహన్‌రెడ్డి ముందుకెళుతున్నారు. మాట తప్పని మడమతిప్పని నాయకుడంటే ఆయనే. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి జగన్. ఆయనను ముఖ్యమంత్రి అయితే సంక్షేమ పాలన అందుతుంది. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా మహమ్మద్ ఇక్బాల్ సార్‌ను, ఎంపీగా నన్ను గెలిపించండి. – గోరంట్ల మాధవ్, ఎంపీ అభ్యర్థి, హిందూపురం బీసీ మహిళకు గుర్తింపునిచ్చారు నేను జగనన్న చేతిలో అస్త్రం లాంటిదాన్ని. ఓ బీసీ మహిళకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశమిచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు జగనన్న సారథ్యంలోనే మేలు జరుగుతుందనేందుకు ఇంతకన్నా నిదర్శనం మరేమి కావాలి. నాలుగున్నరేళ్లుగా నియోజకవర్గంలోని ప్రతి గడపకూ వెళ్లా, ప్రేమతో ఆశీర్వదించారు. కళ్యాణదుర్గం వెనుకబడిన ప్రాంతమని, 114 చెరువులను నీటితో నింపి, ఆయకట్టుకు అందించాలని, తిమ్మసముద్రంలో పరిశ్రమ ఏర్పాటు చేయాలని జగనన్నను కోరా. మున్సిపాలిటీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నా. భవనాలు కూల్చబోం. రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యమవుతుంది. – ఉషాశ్రీచరణ్, ఎమ్మెల్యే అభ్యర్థి, కళ్యాణదుర్గం సమస్యలన్నీ తీరుస్తా.. మైనారిటీ, బీసీ బడుగు బలహీన వర్గాల వ్యతిరేక ప్రభుత్వం ఈ రాష్ట్రంలో నడుస్తోంది. ఈ ప్రభుత్వాన్ని సాగనంపండి. వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సంక్షేమ రాజ్యం సాధ్యమవుతుంది. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగన్‌ను సీఎంని చేసుకుందాం. ఇక్కడే ఉంటూ చిత్తశుద్ధితో ప్రజా సమస్యలన్నీ పరిష్కరిస్తా. తాగు, సాగునీటి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తా. – మహమ్మద్ ఇక్బాల్, హిందూపురం అసెంబ్లీ అభ్యర్థి -
గొంతెత్తి ప్రశ్నించండి : మహిళలకు 'ఉష' పాఠం
ఒక్క ప్రశ్న.. ఎన్నో సమాధానాలకు మూల కారణం అంటారు. ప్రశ్నించడం నేర్చుకున్నప్పుడే ఏదైనా సాధించగలం అంటారు. కొందరు ఎక్కువగా ప్రశ్నిస్తూ ఉంటే.. నువ్వేమన్నా క్వశ్చన్ బ్యాంకు మింగావా.. అంటూ హేళన చేస్తుంటారు. కానీ ఆ హేళనలు, ఆ ప్రశ్నలే భవిష్యత్తుకు బంగారు బాటలు అవుతుంటాయి. ఇది నేను, నువ్వు కాదు చెప్పింది కాదు. విజయపథంలో దూసుకుపోయిన ఎందరో మహానుభావులు చెప్పిన నగ్నసత్యం. ''నిన్ను నీవు అడుగు, నీ సహచరులను అడుగు. నీ పై అధికారులను అడుగు.. ఇలా నీ నైపుణ్యాలను వృద్ధి చేసుకోవడానికి అడుగుతూనే ఉండండి. ఎప్పుడైతే నీవు ప్రశ్నిస్తావో అప్పుడే నీకో సమాధానం దొరుకుతుంది. అదే నీవు చేరుకోవాల్సిన లక్ష్యాలకు చేరుస్తుంది...ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటిగా నిలిచిన ఐబీఎంలో టాప్ అధికారిగా పనిచేసిన ఉష శ్రీ అద్దేపల్లి నేర్చుకున్న జీవిత పాఠం. దాదాపు ఒకే కంపెనీలో 20 ఏళ్లపాటు నిరాటంకంగా పనిచేస్తూ... పలు విభాగాల్లో తనదైన సత్తా చాటుతూ వస్తున్న ఉష శ్రీ లక్షల మంది యువతను ఆకట్టుకున్నారు. ఒక మల్టినేషనల్ టెక్ దిగ్గజంలో ఒక మహిళ ఇన్నేళ్ల పాటు పలు కీలక హోదాల్లో విజయవంతంగా పనిచేస్తూ ఉండటం ఈ తరానికి ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. 1997లో ఐఐఎం-బెంగళూరు క్యాంపస్ ప్లేస్మెంట్లు.. ఆ రోజు ఇంకా నాకు గుర్తుంది. నేను నాకెంతో ఇష్టమైన బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్ రంగంలో స్థిరపడాలని ఎంతో కృతనిశ్చయంతో ఉన్నా. ఆ సమయంలో ఐటీ కంటే కూడా బ్యాంకింగ్ ఉద్యోగమే ఎంతో గ్లామరస్. కానీ ఐబీఎం కంపెనీ ఇచ్చిన ప్రజెంటేషన్, నాలో భిన్న దృక్కోణాన్ని మేలుకొల్పింది. నాకున్న జ్ఞానాన్ని, విస్తృత పరుచుకోవడానికి ఇదో మంచి అవకాశంగా ఐటీ రంగంపై నాలో సానుకూల దృక్పథం నెలకొల్పింది. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేయాలనే డ్రీమ్‌ను వదులుకోకుండానే.. మల్టినేషనల్ ఐటీ దిగ్గజం ఐబీఎంలో అడుగుపెట్టేశా. అదే నాకు ప్లస్ పాయింట్‌గా నిలిచింది. ఒక యంగ్ వర్కింగ్ ప్రొఫిషనల్‌గా తొలిరోజే ట్రెజరీ బాధ్యతలు నాకు అప్పగించారు. అది ఒక దిగ్గజ ఐటీ కంపెనీకి ప్రధాన బ్యాంకింగ్ సేవలు. ఇప్పటికీ ఆ రోజులను మర్చిపోలేనని ఉషా శ్రీ గుర్తుచేసుకున్నారు. ఫైనాన్స్ నిపుణురాలిగా మరచిపోలేని అనుభూతి ఐబీఎం ఇండియాలో 20 ఏళ్లుగా కీలక బాధ్యతలను నిర్వహిస్తున్న ఉష శ్రీ అద్దేపల్లి ఆర్థిక నిపుణురాలిగా మరచిపోలేని అనుభూతే ఉంది. వివిధ నాయకత్వ బాధ్యతలను ఆమె తన సొంతం చేసుకున్నారు. ఐబీఎంలో గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్, భారత్ దక్షిణాసియా సీఎఫ్ఓగా, భారత్, దక్షిణాసియా ప్రైసింగ్ అధినేతగా, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ నుంచి వైస్ ప్రెసిడెంట్, కంట్రోలర్ వరకు ఆమె పలు హోదాల్లో కొనసాగారు. ప్రస్తుతం ఆమె భారత్, దక్షిణాసియా డొమెస్టిక్ బిజినెస్ డైరెక్టర్, ఫైనాన్స్, సీఎఫ్ఓగా ఉన్నారు. ప్రతీ బాధ్యతలోనూ ఉష నేర్చుకునే అలవాటును మాత్రం మానుకోలేదు. ఏదో ఒక కొత్త విషయాన్ని ఆమె అభ్యసిస్తూనే ఉన్నారు. ఎంతో క్లిష్టమైన సవాళ్లను కూడా దీటుగా ఎదుర్కొనే శక్తిని సంపాదించుకున్నారు. అయితే భారత్, దక్షిణాసియాకు ప్రైసింగ్ అధినేతగా బాధ్యతలు నిర్వహించడం ఎంతో ప్రత్యేకమైన అనుభవమని, ఆ మూడున్నర ఏళ్లలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపినప్పటికీ తన కరియర్లో ఈ సమయం చాలా కీలకమైందన్నారు. ఆర్థిక నిపుణురాలిగా మరచిపోలేని అనుభూతిగా మారడానికి ప్రధాన కారణం తాను వేసే ప్రతి అడుగు, తీసుకునే ప్రతి నిర్ణయం ఐబీఎంపై నేరుగా ప్రభావం చూపేవని,అంతటి విశిష్టమైన స్థానాన్ని తాను సొంతం చేసుకున్నానని ఉష ఎంతో గర్వంగా చెప్పారు. ఒకే కంపెనీలో 20 ఏళ్లు బోర్ రాలేదా? ఒకే కంపెనీలు 20 ఏళ్లు అంటే, చాలా తక్కువ మందే చేస్తారు. బోర్ వస్తుందని కంపెనీ మారడమో, లేదా వేతనం కోసమో లేదా మరేదైనా మంచి అవకాశం రావడమో చాలా మంది ఉద్యోగులు తమ కంపెనీలను మారుస్తూ ఉంటారు. ఇదే విషయంపై ఉషకు ఇటీవల జరిగిన పూర్వ విద్యార్థుల సమావేశంలో ప్రశ్నలు ఎదురయ్యాయి. ఐబీఎంలో 20 ఏళ్లుగా ఉంటున్నారు. ఎప్పుడు బోర్ రాలేదా? అని. ''ఐబీఎం అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీల కలయిక. వివిధ వ్యాపారాల్లో, అదే విధంగా వివిధ ప్రాంతాల్లో పనిచేసే అవకాశాన్ని ఐబీఎం తన ఉద్యోగులకు కల్పిస్తుంది. ఈ విధంగా ఐబీఎం తరహాలో ఆఫర్చేసేవి చాలా తక్కువగా ఉండొచ్చు కానీ ఐబీఎం కంపెనీ తన ఉద్యోగులకు పలు అవకాశాలకు ప్రోత్సహం అందిస్తుంది. ఒక మహిళగా ఇంటి బాధ్యతలు, పిల్లలని చూసుకోవడం, ఇటు ఆఫీసుల్లో కీలక బాధ్యతలు పోషించడం సవాలే. డెలివరీ సమయంలో, ఆ అనంతరం కంపెనీ అందించిన సహకారంతో... ఇంటి నుంచే కొత్త బాధ్యతలు నిర్వర్తించాల్సి వచ్చింది. ఆ సమయంలో కూడా పెద్ద పెద్ద బాధ్యతలు నాకు అప్పగించడంలో ఎలాంటి వెనుకంజ వేయలేదు కంపెనీ. నాపై చూపిన నమ్మకం, విశ్వాసంపై నేడు నిజంగా నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి'' అని ఉష తెలిపారు. నేను నా భర్తతో కంటే ఐబీఎంతో గడిపిన రోజులే ఎక్కువని సరదాగా జోక్ చేస్తారామె. ఒక వ్యక్తి సామర్థ్యాన్ని జడ్జ్ చేయడానికి లింగ బేధాలను ప్రమాణీకరంగా తీసుకోకూడదని ఉష నిరూపించారు. ఇదే కారణంతో ఉష 20 ఏళ్లుగా ఐబీఎంలో సక్సస్‌ఫుల్‌గా తన జర్నీని కొనసాగిస్తున్నారు. ఒక మహిళను, ఇలా కాదు అలా ఉండాలి అనే భావన నాకెన్నడూ రాలేదు. నువ్వు ఏం చేస్తున్నావో అదే కరెక్ట్ అనే నమ్మకాన్ని ఐబీఎం నాలో కల్పించిందన్నారు ఉష. జీవితంలో ప్రతి దశలోనూ ప్రాధాన్యతలు పలు రకాలుగా ఉంటాయి. వాటిని రీబ్యాలెన్సింగ్ చేసుకోవాల్సినవసరం ఎంతో అవసరం. కానీ ఒక్కోసారి మహిళలు ఏదో ఒక దగ్గర కన్ఫ్యూజన్కి గురవుతారు. ఈ కన్ఫ్యూజనే తమలో ఉన్న నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తోంది. ఆ కన్ఫ్యూజన్ గుర్తించి, దానికి పరిష్కారం కనుగొనాలి. ఈ పరిష్కారమే మహిళలకు ఎంతో శక్తివంతమైనదిగా మారుతోంది. ఒకవేళ అలా కానీ పక్షంలో మన ముందున్న ఎంతో మంచి అవకాశాన్ని కోల్పోవాల్సి వస్తుంది. - కొటేరు శ్రావణి -
సొసైటీ సొమ్ము స్వాహా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
ప్రొద్దుటూరు కల్చరల్: బీసీ కార్పొరేషన్ ద్వారా నాయీబ్రాహ్మణ కో ఆపరేటివ్ సొసైటీలకు మంజూరైన సొమ్మును పట్టణ నాయీబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు మల్లు సంజీవకర్ణ ఉషాశ్రీ అనే బినామీ సంస్థకు నిధులు మళ్లించారని ఆంధ్రప్రదేశ్ నాయీబ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర గౌరవ సలహాదారుడు ఎం.నారాయణ ఆరోపించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సొసైటీలోని ఒక్కో సభ్యునికి రూ.50వేలు రుణం మంజూరైందని, అందులో రూ.25వేలు సబ్సిడీగా ఉందని తెలిపారు. సంజీవకర్ణ అన్ని సొసైటీలకు మంజూరైన మొత్తాన్ని తన బినామీ సంస్థకు మళ్లించుకున్నారన్నారు. మంజూరైన రూ.50వేలులో కొంత మందికి రూ.8వేలు, మరికొంత మందికి రూ.10వేలు ఇచ్చి, ఇంకొందరికి నిధులు మంజూరైన విషయం తెలియకుండా స్వాహా చేశారని చెప్పారు. ఈ విషయమై నాయీబ్రాహ్మణ సొసైటీ సభ్యులు రాష్ట్ర నాయీబ్రాహ్మణ సంఘం నాయకులకు ఫిర్యాదు చేశారన్నారు. వారు జిల్లా కలెక్టర్‌కు, బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేసి జిల్లా సంఘం నుంచి అతన్ని బహిష్కరించారని తెలిపారు. ప్రభుత్వం ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ నాయీబ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు వీరభద్రుడు, బాధితులు మంగళి శ్రీనివాసులు, పాలెం గంగన్న, ఆదెన్న, నరసింహం, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. -
మృదువుగా.. పదునుగా... అదనుగా
పుస్తకం పురాణ వాచస్పతి, కవి, కథకుడు, నాటకకర్త, ఆధునిక వ్యాసవాల్మీకిగా పేరొందిన ఉషశ్రీ తెలియని నాటి తరం వారుండరు. కారణం ఆయన మాటే. బంగారంలాంటి ఆయన పలుకే. ఖంగున మోగిన ఆ గొంతే! రామాయణ భారత భాగవతాలను సరళమైన భాషలో రచించి, మృదుగంభీరమైన నోట ఉపన్యాసాలు చెప్పిన ఉషశ్రీ భారత మహేతిహాసంలోని పాత్రలను మథించి, ఆ పాత్రల ద్వారా వ్యాసమహాముని పలికించిన పలుకు బంగారాలను పొల్లుపోకుండా భావగర్భితంగా, వ్యాఖ్యాన సహితంగా పండిత, పామర రంజకంగా అందించారు. ‘భారతంలో రాయబారాలు’గా అప్పటిలో వేలాది పాఠకులను అలరించింది ఈ చిన్నిపొత్తం. దీనికి కాలానుగుణంగా ఆయన రచనా వారసురాలు, ఆయుర్వేద వైద్యనిపుణురాలైన పెద్దకుమార్తె డాక్టర్ గాయత్రీదేవి చేసిన రూపాంతరమే ఈ ‘ఎవరు ఎలా మాట్లాడతారు?’. మహాభారతం ఉద్యోగపర్వంలోని ప్రత్యేక సన్నివేశాలలో ద్రుపద పురోహితుడు, సంజయుడు, శ్రీకృష్ణుడు, కర్ణుడు, విదురుడు, ధర్మరాజు, భీష్ముడు, కుంతి, ద్రౌపది వంటి వారు ఎవరు ఎలా మాట్లాడారో తెలుసుకుని, దానిని వ్యక్తిత్వ వికాస పాఠాలుగా ఎలా మలచుకోవాలో చెప్పే ఈ పుస్తకం ప్రతి ఇంటా ఉండదగ్గది, ప్రతి నోటా పలకదగ్గది. ఎవరు ఎలా మాట్లాడతారు? పుటలు: 56, వెల రూ. 50 ప్రతులకు: ఉషశ్రీ మిషన్, విజయవాడ, హైదరాబాద్ 8008551232,9848113681 - డి.వి.ఆర్ -
కుంకుమపువ్వుతో దేహానికి దృఢత్వం
కుంకుమ పువ్వు... ఈ పేరు వినగానే సంపన్నత గుర్తుకు వస్తుంది. సుగంధద్రవ్యాల్లో అత్యంత ఖరీదైనది కావడంతో కుంకుమ పువ్వు అంటే సంపన్నులు వాడే దినుసు అనే భావనతోపాటు బంగారు సుగంధద్రవ్యం అనే పేరు కూడా స్థిరపడిపోయింది. ఇంతకీ కుంకుమ పువ్వు వల్ల ప్రయోజనాలేంటంటే... జీర్ణక్రియను వృద్ధి చేస్తుంది, ఆహారం తీసుకోవాలనే కోరికను కలిగిస్తుంది. దేహంలో అన్ని భాగాలకూ రక్తం సక్రమంగా సరఫరా అయ్యేటట్లు చేస్తుంది. అందుకే దీన్ని కాలేయం, మూత్రపిండాలు, మూత్రాశయ వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు. కుంకుమ పువ్వు రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయులను, ట్రైగ్లిజరైడ్స్‌ను తగ్గిస్తుంది. కాబట్టి గుండె వ్యాధులు ఉన్న వారు రోజుకు రెండు లేదా మూడు రేకలను నీటిలో కానీ, పాలలో కానీ నానబెట్టి తీసుకుంటే మంచిది. ఇందులో చర్మాన్ని కాంతిమంతం చేసే గుణం ఉంది. కాబట్టి సౌందర్య సాధనాల తయారీలో కుంకుమ పువ్వును ఉపయోగిస్తారు. ఒక టీ స్పూన్ పాలలో ఒక కుంకుమ పువ్వు రేకను నానబెట్టి ఆ పాలను ముఖానికి రాస్తుంటే ముఖం మీద మచ్చలు పోతాయి. గర్భిణులు కుంకుమ పువ్వు కలిపిన పాలను తాగితే జీవక్రియలకు తగినంత ఉష్ణశక్తి ఉత్పత్తి అవుతుంది. - ఉషశ్రీ, న్యూట్రిషనిస్ట్, కేర్ హాస్పిటల్ -
గర్భిణి బెండకాయ తింటే.. !
వెజ్ఫ్యాక్ట్స్ *బెండకాయలో... ఐరన్, క్యాల్షియం, పొటాషియం, సోడియం, కాపర్, మెగ్నీషియం, సిలీనియం, మాంగనీస్, జింక్ వంటి పోషకాలతోపాటు సి,ఎ, ఇ,కె విటమిన్లు ఉంటాయి. జీర్ణవ్యవస్థకు దోహదం చేసే పీచు కూడా ఉంటుంది. * బెండకాయ తింటే అధిక బరువు, కొలెస్ట్రాల్ తగ్గుతాయి. మధుమేహం ఉన్న వారు వారానికోసారయినా తింటే మంచిది. ఈ కూరగాయ... చర్మకాంతిని మెరుగుపరిచి, ఎముకలను శక్తిమంతం చేస్తుంది. * బెండకాయ కోలన్ క్యాన్సర్(పెద్దపేగు క్యాన్సర్), ఊపిరితిత్తుల క్యాన్సర్లను నివారిస్తుంది. దంత క్షయాన్ని కూడా నివారిస్తుంది. * గర్భవతిగా ఉన్నప్పుడు బెండకాయ తినడం వల్ల పిండం ఎదుగుదల బావుంటుంది. ఫోలేట్ అనే పోషకం సమృద్ధిగా అందడం వల్ల బిడ్డ మెదడు నిర్మాణం ఆరోగ్యకరంగా ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ నాడీవ్యవస్థ ఆరోగ్యకరంగా ఏర్పడడానికి దోహదం చేస్తుంది. గర్భధారణ జరిగిన నాలుగు నుంచి పన్నెండు వారాల లోపు ఈ పోషకాలు చాలా అవసరం. - ఉషశ్రీ, న్యూట్రిషనిస్ట్ -
కాకరకాయ తింటే...
కాకరకాయలో కేలరీలు తక్కువ, పోషకాలు మెండుగా ఉంటాయి. బి1, బి2, బి3, సి... విటమిన్లతోపాటు జీర్ణక్రియకు దోహదం చేసే పీచు ఎక్కువగా ఉంటుంది. మెగ్నీషియ్, ఫోలేట్, జింక్, ఫాస్ఫరస్, మాంగనీస్, ఐరన్, క్యాల్షియం, పొటాషియం ఉంటాయి. సి విటమిన్ దేహంలోని క్యాన్సర్ కారక ఫ్రీరాడికల్స్‌ను తొలగిస్తుంది. కడుపులో చేరిన పరాన్నజీవులను హరిస్తుంది. కాకరలోని ఏలియోస్తీరిక్ యాసిడ్ రక్తహీనతను తగ్గిస్తుంది. లుకేమియా (బ్లడ్ క్యాన్సర్) నుంచి నివారిస్తుంది. కాకరకషాయం మలేరియా బ్యాక్టీరియాను చంపేస్తుంది, చికెన్‌పాక్స్, మీజిల్స్, హెర్ప్స్, హెచ్ఐవి కారక వైరస్‌ను శక్తిహీనం చేస్తుంది. కాకర కషాయాన్ని క్రమం తప్పకుండా తాగుతుంటే పై వైరస్‌ను నిర్మూలనవుతుంది. - ఉషశ్రీ న్యూట్రిషనిస్ట్, కేర్ హాస్పిటల్స్ -
నేడు హైదరాబాద్‌లో 'ఉషశ్రీ ఉభయకుశలోపరి'
బంజారా హిల్స్ రోడ్డు నెంబర్ 1లోని జీవీకే మాల్ ఎదురుగా ఉన్నసాంస్కృతిక వేదిక లామకాన్‌లో ఈ రోజు సాయంత్రం 5.00 'ఉషశ్రీ ఉభయకుశలోపరి' పేరిట ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఫేస్‌బుక్‌లోని ఉషశ్రీ అభిమానుల వేదిక శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. ఉషశ్రీ సన్నిహితులు,రచయిత శ్రీరమణ, విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి చెందిన ఏ.బి.ఆనంద్‌లు ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగిస్తారని తెలిపింది. మరిన్ని వివరాల కోసం ఉషశ్రీ మిషన్ 8008551231ను సంప్రదించాలని పేర్కొంది. ఉషశ్రీ అభిమానులు, ఆలిండియా రేడియోలో ఆయన ప్రసంగాలు విన్నవారు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని పిలుపునిచ్చింది.