కాకరకాయ తింటే...
కాకరకాయలో కేలరీలు తక్కువ, పోషకాలు మెండుగా ఉంటాయి. బి1, బి2, బి3, సి... విటమిన్లతోపాటు జీర్ణక్రియకు దోహదం చేసే పీచు ఎక్కువగా ఉంటుంది. మెగ్నీషియ్, ఫోలేట్, జింక్, ఫాస్ఫరస్, మాంగనీస్, ఐరన్, క్యాల్షియం, పొటాషియం ఉంటాయి.
సి విటమిన్ దేహంలోని క్యాన్సర్ కారక ఫ్రీరాడికల్స్‌ను తొలగిస్తుంది.
కడుపులో చేరిన పరాన్నజీవులను హరిస్తుంది.
కాకరలోని ఏలియోస్తీరిక్ యాసిడ్ రక్తహీనతను తగ్గిస్తుంది. లుకేమియా (బ్లడ్ క్యాన్సర్) నుంచి నివారిస్తుంది.
కాకరకషాయం మలేరియా బ్యాక్టీరియాను చంపేస్తుంది, చికెన్‌పాక్స్, మీజిల్స్, హెర్ప్స్, హెచ్‌ఐవి కారక వైరస్‌ను శక్తిహీనం చేస్తుంది. కాకర కషాయాన్ని క్రమం తప్పకుండా తాగుతుంటే పై వైరస్‌ను నిర్మూలనవుతుంది.
- ఉషశ్రీ
న్యూట్రిషనిస్ట్, కేర్ హాస్పిటల్స్