కరేలా ఆయిల్ లేదా కాకరకాయ నూనె గురించి ఎపుడైనా విన్నారా? కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, బాదం నూనె, రోజ్ మేరీ గురించి విన్నాం గానీ, ఈ కరేలా హెయిర్ ఆయిల్ ఏంటి అనుకుంటున్నారా? కాకర తినడమే కష్టం.. కాకరకాయ హెయిర్ ఆయిలా? అని తేలిగ్గా తీసి పారేయకండి. కొన్ని శతాబ్దాలుగా ఆయుర్వేదంలో దీన్ని ఔషధంగా వినియోగిస్తున్నారు. జుట్టు, చర్మ ఆరోగ్యానికి ఉపయోపగడే కరేలా ఆయిల్ గురించి తెలుసుకుందాం.
కాకరకాయ ఎన్నో ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందింది. దీని నుంచి ఆయిల్‌ను బిట్టర్ గార్డ్ ఆయిల్, కరేలా ఆయిల్ అని కూడా పిలుస్తారు. ఈ నూనెలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు , కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మం జుట్టు ,మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తాయి. జుట్టుకు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాదు చుండ్రును తగ్గించి, జుట్టు ఆరోగ్యంగా ఎదగడానికి తోడ్పడుతుంది. రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది.
యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్న కాకరకాయ నూనె చర్మానికి రాస్తే మృతకణాలు నశించి యవ్వనంగా, కాంతి వంతంగా తయారవుతుంది. ఈ నూనెలో విటమిన్లు ఎ , సి వంటి విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గించి, జుట్టు కుదుళ్లకు పోషణనిచ్చి, జుట్టును బలంగా చేస్తాయి. కరేలా నూనెలో సహజ యాంటీ ఫంగల్ , యాంటీమైక్రోబయల్ చుండ్రు , స్కాల్ప్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేస్తుంది, దురద, ఇతర చికాకులనుకూడా ఇది చక్కటి పరిష్కారం.
జుట్టు తెల్లబడకుండా
కరేలా నూనెను వారానికి రెండుసార్లు అప్లై చేయడం వల్ల జుట్టు తొందరగా నెరసిపోకుండా ఉంటుంది. తల చర్మం, జుట్టు తంతువులు రెండింటినీ హైడ్రేట్ చేస్తుంది. జుట్టును తేమగా ఉంచుతుంది. సహజమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. స్కాల్ప్ లోని సహజ నూనె (సెబమ్) ఉత్పత్తిని నియంత్రిస్తుంది ఇది జుట్టు పెళుసుదనాన్ని తగ్గిస్తుంది. కరేలా నూనెను క్రమం తప్పకుండా మృదువుగా, సున్నితంగా , మెరుస్తూ ఉంటుంది. యాంటీమైక్రోబయల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, చిన్న గాయాలు, కాలిన గాయాలకు తొందరగా నయమవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment