కాకరకాయలను తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే పోషకాలు శరీరంలోని అనారోగ్య సమస్యలకు ఉపశమనం కలిగిస్తాయి. ముఖ్యంగా మధుమేహులకు ఇవి దివ్యౌషధంలాంటివి. అయితే చాలామంది కాకరను తినకూడని వాటితో కలిపి తింటున్నారు. ఇలా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఏయే ఆహార పదార్థాల్లో కాకరను కలిపి తీసుకోకూడదో తెలుసుకుందాం.
పాలు
కాకరకాయతో తయారు చేసిన ఆహార పదార్థాలు తిన్న వెంటనే పాలు తాగకూడదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
పెరుగుతో...
కాకరకాయలను తిన్న తర్వాత పెరుగన్నం తినడం శరీరానికి హానికరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మజ్జిగలో లాక్టిక్ యాసిడ్, కాకరలో ఉండే పోషకాలు కలవడం వల్ల చర్మ సమస్యల వచ్చే అవకాశాలు ఉన్నాయి.
మామిడితో...
వేసవి కాలంలో అందరూ మామిడిని ఎంతో ఇష్టపడి తింటూ ఉంటారు. అయితే కాకరతో తయారు చేసిన ఆహారాల్లో మామిడిని వినియోగించి తీసుకోవడం తీవ్ర ఉదర సమస్యలకు దారి తీయవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీనివల్ల వాంతులు, మంట, వికారం, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. కొందరిలో జీర్ణ సంబంధ సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయి.
ముల్లంగితో...
కాకరకాయ, ముల్లంగిని కలిపి తీసుకోవడం వల్ల కూడా తీవ్ర అనారోగ్య సమస్యల రావచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా కొంతమందిలో ఎసిడిటీ, కఫం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి వీటిని కలిపి తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment