Bittergourd
-
కాకరకాయ.. వీటితో కలిపి అస్సలు తినకండి
కాకరకాయలను తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే పోషకాలు శరీరంలోని అనారోగ్య సమస్యలకు ఉపశమనం కలిగిస్తాయి. ముఖ్యంగా మధుమేహులకు ఇవి దివ్యౌషధంలాంటివి. అయితే చాలామంది కాకరను తినకూడని వాటితో కలిపి తింటున్నారు. ఇలా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఏయే ఆహార పదార్థాల్లో కాకరను కలిపి తీసుకోకూడదో తెలుసుకుందాం. పాలు కాకరకాయతో తయారు చేసిన ఆహార పదార్థాలు తిన్న వెంటనే పాలు తాగకూడదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. పెరుగుతో... కాకరకాయలను తిన్న తర్వాత పెరుగన్నం తినడం శరీరానికి హానికరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మజ్జిగలో లాక్టిక్ యాసిడ్, కాకరలో ఉండే పోషకాలు కలవడం వల్ల చర్మ సమస్యల వచ్చే అవకాశాలు ఉన్నాయి. మామిడితో... వేసవి కాలంలో అందరూ మామిడిని ఎంతో ఇష్టపడి తింటూ ఉంటారు. అయితే కాకరతో తయారు చేసిన ఆహారాల్లో మామిడిని వినియోగించి తీసుకోవడం తీవ్ర ఉదర సమస్యలకు దారి తీయవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీనివల్ల వాంతులు, మంట, వికారం, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. కొందరిలో జీర్ణ సంబంధ సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. ముల్లంగితో... కాకరకాయ, ముల్లంగిని కలిపి తీసుకోవడం వల్ల కూడా తీవ్ర అనారోగ్య సమస్యల రావచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా కొంతమందిలో ఎసిడిటీ, కఫం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి వీటిని కలిపి తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది. -
Health Tips: చేదుగా ఉందని బెల్లం, చింతపండుతో వండిన కాకరకాయ కూర తింటే..
పెళుసుగా, గరుకుగా ఉండే పై పొరతో చూడానికి ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే కాకర రుచికి ... కటిక చేదుగా ఉన్నప్పటికీపుష్కలమైన వైద్య గుణాలను కలిగి ఉంది. కాకరకాయ జ్వరాన్ని తగ్గిస్తుంది. ఆకలిని పెంచుతుంది. కడుపునొప్పిని తగ్గిస్తుంది. నులిపురుగులను సైతం నశింపజేయగల ఔషధంగా పనిచేస్తుంది. ►కాకరకాయను వీలైనంత ఎక్కువగా అంటే రోజు విడిచి రోజు ఆహారంలో తింటుంటే రక్తప్రసరణ చక్కగా జరిగి, తద్వారా కొవ్వు కరిగి శరీరం నాజూకుగా ఉండేందుకు తోడ్పడుతుంది. ►వారంలో ఒకసారి బెల్లం, చింతపండుతో వండిన కాకరకాయ కూర తింటే ఆకలి పెరిగి, అజీర్ణం తగ్గుతుంది. ►అలవాటు తక్కువగా ఉన్నవాళ్ళు మెల్లగా కాకరకాయను కూరగా అలవాటు చేసుకుంటుంటే అందులో రుచి పెరుగుతుంది. ►అందులో ఉన్న ఔషధగుణాలతో ఆరోగ్యం మెరుగవుతుంది. ►కాకర కాయలో బీ, సి విటమిన్లతో పాటు పొటాషియం, మెగ్నీషియం, సోడియం, ఫాస్పరస్ వంటి ధాతువులు ఉన్నాయి. ►మనం తినే ఆకు కూరల్లో ఉన్న క్యాల్షియం కంటే కాకరలో రెండింతలు అధికంగా క్యాల్షియం వుంటుంది. ►కాకరకాయ జ్యూస్‌ను రోజూ తాగితే డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. ►కాకరకాయ జ్యూస్‌ను రోజూ ఉదయాన్నే పరగడుపునే తాగడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయులు కంట్రోల్ అవుతాయి. ►కాకరకాయ జ్యూస్‌లో ఉండే ఔషధ గుణాలు ఇన్సులిన్‌లా పనిచేస్తాయి. అందువల్ల షుగర్ స్థాయిలు అదుపులో ఉంటాయి. ►కాకర కంటి శుక్లం, దృష్టి లోపం వంటి సమస్యల నివారిణిగా పనిచేస్తుంది. ►ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్ ‘ఎ‘ కళ్ల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ►అతిసార, నులిపురుగులు, గజ్జి, తామర వంటి చర్మవ్యాధులకు కాకర కాయలు ఔషధంగా ఉపయోగపడతాయి. ►శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ►అలెర్జీలు దరి చేరవు. వైరస్, బాక్టీరియాపై పోరాడుతుంది. ►ముఖ్యంగా మహిళలో వచ్చే గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ►మలబద్దకాన్ని వదిలించుకునేందుకు రోజుకు రెండు సార్లు అరస్పూన్ చొప్పున తీసుకుంటే చాలు. ►ఒక్క కాకర కాయలో బచ్చలికూరలో ఉండే కాల్షియం, ఒక అరటి పండులో ఉండే పొటాషియం ఉంది. ►కాకర కాయ రసంలో చేదు తగ్గాలంటే కొంచెం నిమ్మరసం కలుపుకుని తాగితే మంచిది. ►కాకర ప్రారంభ దశలో ఉన్న కలరాను దూరం చేస్తుంది. కలరాతో ఏర్పడే వాంతులకు కూడా కాకర కళ్లెం వేస్తుంది. ►కాకర జ్యూస్‌ను క్రమం తప్పకుండా తీసుకుంటూ వస్తే కంటి సమస్యలు, దృష్టిలోపాలను దూరం చేసుకోవచ్చు. కాకర పండును తీసుకుంటే కంటి చూపు మెరుగుపడుతుంది. ►అలెర్జీ, చర్మ వ్యాధులు, సోరియాసిస్ వంటి వ్యాధుల్ని కూడా కాకర నయం చేస్తుంది. ►శ్వాస సంబంధిత సమస్యలకు సైతం కాకర దివ్యౌషధంగా పనిచేస్తుంది. ►కీళ్ళనొప్పులు తగ్గించే గుణం కాకర కాయకు ఉంది. బాధిస్తున్న కీలుమీద కాకరరసాన్ని రాసి నెమ్మదిగా మర్దన చేయాలి. చదవండి: Cereals Tiffins: సామలు, కొర్రలు, ఊదలు, అరికెలు.. వీటిని ఎప్పుడైనా రుచి చూశారా? -
చేదైనా సరే తినండి... చేటు తప్పించుకోండి
చాలామంది కాకరకాయను చూడగానే ముఖం చిట్లిస్తారు. చేదంటూ దాని జోలికే వెళ్లరు. కానీ కాయ చేదైనా దాంతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. అందుకే వారంలో ఒకసారైనా కాకరకాయను ఏదో ఒక వంటకంగా చేసుకుని తినండి. వంట ప్రక్రియలో చేదును విరిచేసే ప్రక్రియలూ ఉంటాయి. వాటిని అనుసరించి కాకరకాయను తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవడం కలిగే ప్రయోజనాలివే... ♦ కాకరకాయలో క్యాలరీలు చాలా తక్కువ అందుకే స్థూలకాయం, ఊబకాయం రాకుండా నివారిస్తుంది. క్యాలరీలు తక్కువగా పోషకాలు మాత్రం చాలా ఎక్కువ. ♦ ఇందులో విటమిన్ బి1, బి2, బి3, సి...లతో పాటు జీర్ణక్రియకు దోహదం చేసే పీచు ఎక్కువగా ఉంటుంది. ♦ మెగ్నీషియ్, ఫోలేట్, జింక్, ఫాస్ఫరస్, మాంగనీస్, ఐరన్, క్యాల్షియం, పొటాషియం వంటి ఖనిజ లవణాలూ ఎక్కువ. ♦ కాకరలోని విటమిన్–సి దేహంలోని ఫ్రీరాడికల్స్‌ను తొలగిస్తుంది. మన దేహంలో పుట్టే ఫ్రీరాడికిల్స్ మ్యాలిగ్నంట్ కణాల (క్యాన్సర్ కారక కణాలు) ఉత్పత్తికి దోహదం చేస్తాయి. ఇలా కాకర సాధారణ క్యాన్సర్లనే కాకుండా, లుకేమియా లాంటి బ్లడ్క్యాన్సర్లనూ నివారిస్తుంది. ♦ కాకర కాయ కడుపులో చేరిన పరాన్నజీవులను హరిస్తుంది. కడుపులో నిల్వ చేరిన విషపూరితమయ్యే వ్యర్థాలను తొలగిస్తుంది. ♦ కాకర మలేరియా బ్యాక్టీరియానూ తుదముట్టించగలదు. చికెన్‌పాక్స్, మీజిల్స్, హెర్ప్స్, హెచ్ఐవి కారక వైరస్‌లను శక్తిహీనం చేస్తుంది. ♦ కాకర గింజలు గుండె పనితీరును క్రమబద్ధం చేస్తాయి. ఇవి రక్తనాళాల్లోని కొవ్వును కరిగించి గుండె గదులు, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా రక్షిస్తాయి. ♦ డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు కాకర మంచి స్వాభావికమైన ఔషధంగా అనుకోవచ్చు. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడానికి దోహదం చేస్తుంది. రక్తంలో గ్లూకోజ్ నిల్వలను తగ్గిస్తుందన్న విషయం చాలామందికి తెలిసిందే. ♦ బ్లడ్‌ప్రెషర్‌లో హెచ్చుతగ్గులు లేకుండా చూస్తుంది. ♦ కాలేయంపై పడే అదనపు భారాన్ని కూడా కాకర నివారిస్తుంది. -
చేదు కాకరకాయ... చాక్లెట్లా ఉంటే..!
కాకరకాయ కూర తింటున్నప్పుడు ముక్కుకు ఏం వాసనొస్తుంది.. కాకరకాయ కూరదే వస్తుంది. ఇంకేం వస్తుంది అని అంటున్నారా.. అది కాకుండా మీకెంతో ఇష్టమైన చాక్లెట్ సువాసన వస్తే.. దొండ కాయకు వెనీలా.. చికెన్ ముక్కకు స్ట్రాబెర్రీ.. గోరుచిక్కుడుకు పల్లీ.. అవును మరీ. చిత్రంలోని అరోమా ఫోర్క్‌తో తింటే.. మీరేది తిన్నా.. మీకు నచ్చిన సువాసనే వస్తుంది. దీన్ని కెనడాకు చెందిన మాలిక్యూల్-ఆర్ ఫ్లేవర్స్ సంస్థ తయారుచేసింది. ఈ ఫోర్క్తోపాటు 21 విభిన్న రకాల సువాసనలతో కూడిన చిన్నపాటి సీసాలు, ఆ ద్రవాన్ని పీల్చుకునే పేపర్లు వస్తాయి. ఈ ఫోర్క్ మధ్య ఉన్న రంధ్రంలో మనకు కావాల్సిన ఫ్లేవర్ తాలూకు ద్రవాన్ని వేస్తే.. అందులోని పేపర్ దాన్ని పీల్చుకుని.. మనం తిన్నప్పుడు ఆ సువాసనను వెదజల్లుతుంది. అంతేకాదు.. ఆ రోజు కూరలో అల్లం వేయడం మర్చిపోయామనుకోండి.. ఇందులోని అల్లం ఫ్లేవర్ ద్రవాన్ని ఫోర్క్ రంధ్రంలో వేస్తే.. తిన్నప్పుడు ఆ ఫ్లేవర్ వచ్చి.. కూరలో అల్లం మిస్ అయిన భావనను తొలగిస్తుందట. నాలుగు ఫోర్క్‌లు, 21 సువాసనల సీసాలతో కూడిన సెట్ ధర రూ.3,600.