మనిషి ఆరోగ్యానికి మేలు చేసే ఔషధ గుణాలకు మూలం ప్రకృతి. కానీ చాలావరకు ప్రకృతి సహజంగా లభించే మూలికల గురించి మొక్కల గురించి నేటి తరానికి అవగాహన కరువుతోంది. ఈ నేపథ్యంలో అలాంటి వాటి గురించి తెలుసు కోవడం, అవగాహన పెంచుకోవడం, ఆచరించడం చాలా ముఖ్యం.
అలాంటి వాటిల్లో ఒకటి అరటి పండు. అరటిపండులో అద్భుత గుణాలు ఉన్నాయి. ఇందులోని పోషక గుణాలు పిల్లలకీ, పెద్దలకీ చాలా మేలు చేస్తాయి. ఒకవిధంగా అరటి చెట్టులో ప్రతీ భాగమూ విలువైనదే. అరటి ఆకులను భోజనం చేసేందుకు వాడతారు. దీన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. కార్తీక మాసంలో కార్తీక దీపాలను పెట్టేందుకు అరటి దొప్ప ఆధ్యాత్మికంగా చాలా విలువైంది. ఇక అరటి పువ్వుతో పలు రకాల వంటకాలు తయారు చేస్తారు. కానీ అరటి కాండంలోని ఔషధ గుణాల గురించి చాలామంది తెలియదు. వాటి గురించి తెలుసుకుందాం.
అరటిపండులో పొటాషియం, విటమిన్ బి6, మెగ్నీషియం, విటమిన్ సి, కాపర్, ఐరన్, మాంగనీస్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్స్, ఇతర ఖనిజాలు, సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.
అధిక స్థాయి చెడు కొలెస్ట్రాల్‌కు చెక్ చెప్పవచ్చు.ఇందులో కేలరీలు తక్కువ. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీని వాడటం వల్ల దీర్ఘకాలంలో మలబద్ధకం , కపుడు అల్సర్‌లను నివారించడంలో ఉపయోపడుతుంది.
ఈ జ్యూస్‌లో విటమిన్ బి6 పుష్కలంగా ఉండటం వల్ల హిమోగ్లోబిన్ కౌంట్ పెరుగుతుంది. ఇందులో పొటాషియం కూడా లభిస్తుంది.
కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్నవారికి ఇది సంజీవని లాంటిదని చెప్పవచ్చు. ఇందులోని పొటాషియం , మెగ్నీషియం రాళ్లను నివారిస్తుంది.కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది.కొలెస్ట్రాల్, అధిక రక్తపోటుకు కూడా మంచిది. గుండె జబ్బులను కూడా అడ్డుకుంటుంది. శరీరంలోని మలినాలు బయటికి పంపింస్తుంది. అధిక బరువు సమస్యకు కూడా చెక్‌పెడుతుంది.బరువు తగ్గడానికి ప్రతిరోజూ 25 గ్రా నుండి 40 గ్రా అరటి కాండం జ్యూస్‌ను తీసుకోవచ్చు.
అరటి కాండం రసం శరీరంలోని ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడంలో పనిచేస్తుంది
కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. జీర్ణ వ్యవస్థ నుంచి అసిడిటీ వరకూ చాలా సమస్యలు దూరమవుతాయి..యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు కూడా పనిచేస్తుంది. శరీరంలోని ట్యాక్సిన్‌ని బయటికి పంపి మూత్ర నాళాన్ని శుభ్రపరచడానికి సాయపడుతుంది.
అరటి కాండం ఆకుపచ్చ పొరను తీసివేసి, లోపల కనిపించే తెల్లటి కాండాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి, 15 నిమిషాలు ఉడకబెట్టి, రోజుకు రెండుసార్లు సేవించ వచ్చని నిపుణులు చెబుతున్నారు. కొన్ని చోట్ల తొట్టెల్లో అరటి కాండాన్ని ఊరబెట్టి, ఆ నీటిని వడపోసి ఔషధంగా వాడతారు. శుభ్రం చేసి కట్ చేస్తే మజ్జిగలో నానబెట్టి ఫ్రిజ్ లో నిల్వ ఉంచుకోవచ్చు.
దక్షిణ థాయ్‌లాండ్‌లో, తీపి , పుల్లని కూరగాయల సూప్ లేదా కూరలో సన్నగా తరిగిన అరటి కాడను కలుపుతారు.
సైడ్ ఎఫెక్ట్స్
పెద్దగా దుష్ప్రభావాలను కలిగి లేనప్పటికీ, అలెర్జీ, కడుపు నొప్పి, వాంతులు, అలర్జీ రావొచ్చు. ఒక్కోసారి లే కాలేయం, మూత్రపిండాలకు హాని కలిగించే అవకాశంఉంది. అయితే, వ్యక్తి వైద్య చరిత్ర , అరటి కాండం పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. ఏదైనా రూపంలో తినేటప్పుడు లేదా త్రాగేటప్పుడు మితంగా ఉండాలి.
నోట్: అవగాహనకోసం అందించిన సమాచారం మాత్రమే .వైద్య నిపుణుడు, పోషకాహార నిపుణుడు లేదా డైటీషియన్‌ను సంప్రదించడం చాలా ముఖ్యం.
Comments
Please login to add a commentAdd a comment