
రెయిన్‌బో జ్యూస్
హెల్దీ ట్రీట్
కావలసినవి:బీట్‌రూట్ – 1 (చిన్నది), క్యారట్లు – 2, టొమాటో – 1, తేనె – 1 టీ స్పూన్
తయారి: బీట్‌రూట్, క్యారట్‌ల పై తొక్క తీసి, కట్ చేసుకోవాలి. టొమాటోలను కూడా ముక్కలుగా చేయాలి. ఈ పదార్థాలన్నీ మిక్సర్‌లో వేసి తగినన్ని నీరుపోసి జ్యూస్ చేయాలి. జ్యూస్‌ని గ్లాస్‌లో పోసి తేనె వేసుకుని తాగాలి.
నోట్: యువతీ యువకులు మొటిమల సమస్యతో ఎక్కువగా బాధపడుతుంటారు. వీళ్లు భోజనానికి గంట ముందు ఈ జ్యూస్ తాగాలి. దీంట్లో ఉప్పు, పంచదార కలపకూడదు. జ్యూస్ తాగిన గంట వరకు ఏమీ తినకూడదు. ఇలా క్రమం తప్పకుండా నెలరోజులు చేస్తే మొటిమలు తగ్గుతాయి, చర్మం కాంతివంతం అవుతుంది, సన్‌బర్న్ బారిన పడదు. క్యాల్షియం, ఐరన్ అధికంగా ఉన్న ఈ జ్యూస్‌లో క్యాలరీలు తక్కువగా ఉన్నాయి. ఊబకాయం సమస్య ఉన్నవారు ఈ జ్యూస్‌ను తాగడం వల్ల ఫలితం ఉంటుంది.
పోషకాలు: క్యాలరీలు – 95.9కె.సి.ఎ. ఎల్, కార్బోహైడ్రేట్లు 20.77 గ్రా., ప్రొటీన్ – 2.21గ్రా., ఫ్యాట్ – 0.35గ్రా., క్యాల్షియం – 113 మి.గ్రా.