
ఎడారి మొక్కల్లో ఎన్నో పోషకాలు
పరిపరి శోధన
నిండా ముళ్లతో కనిపించే ఎడారి మొక్కలను ఏం చేసుకుంటాం అనుకుంటున్నారా? ఎడారి మొక్కల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయని అంతర్జాతీయ పరిశోధకులు చెబుతున్నారు. బ్రహ్మజెముడు, నాగజెముడు వంటి ఎడారి మొక్కల్లో పుష్కలంగా విటమిన్లు, ఖనిజలవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు, పీచుపదార్థాలు ఉంటాయని, వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే, మధుమేహం, స్థూలకాయం, గుండెజబ్బులు వంటి చాలారకాల వ్యాధులు దరిచేరవని న్యూయార్క్‌కు చెందిన న్యూట్రిషన్ నిపుణురాలు షాపిరో చెబుతున్నారు.
ఎడారి మొక్కల పైభాగంలో కనిపించే ముళ్లతో నిండే తొక్కలను తొలగించి, గుజ్జుతో నిండిన భాగాన్ని జ్యూస్, జామ్, సలాడ్ వంటి వంటకాల తయారీలో భేషుగ్గా ఉపయోగించుకోవచ్చని ఆమె అంటున్నారు.