అరికల వంటలు | 100 grams of grains are nutrients and fiber? | Sakshi
Sakshi News home page

అరికల వంటలు

Published Sun, Dec 30 2018 12:28 AM | Last Updated on Sun, Dec 30 2018 12:28 AM

100 grams of grains are nutrients and fiber? - Sakshi

అరికలు (Kodo Millet)  
నియాసిన్‌ (Niacin)mg (B3)    2.0
రిబోఫ్లావిన్‌ (Rivoflavin)mg (B2)     0.09
థయామిన్‌(Thiamine) mg (B1)    0.33
ఐరన్‌ (Carotene)ug        0
కాల్షియం  (Calcium)g        0.04
ఫాస్పరస్‌ (Phosphorous)g    0.24
ప్రొటీన్‌  (Protein)g        6.2
ఖనిజాలు (Minerals) g        2.6
పిండిపదార్థం(Carbo Hydrate) g    65.6
పీచు పదార్థం (Fiber) g        9.0
పిండిపదార్థము/పీచు నిష్పత్తి (Carbo Hydrate/Fiber Ratio)    7.28

కొర్ర బ్రెడ్‌
కావలసినవి: కొబ్బరి పాలు – అర కప్పుకొర్ర పిండి – ఒక కప్పుఈస్ట్‌ – అర టీ స్పూను, నీళ్లు – అర కప్పుబెల్లం పొడి – 2 టీ స్పూన్లు.ఉప్పు – తగినంతబ్రెడ్‌ ఇంప్రూవర్‌ – 0. 05 గ్రా. గోధుమ పిండి –  ఒకటిన్నర కప్పులు

తయారీ: స్టౌ మీద బాణలిలో నీళ్లు పోసి వేడి చేయాలి. గోరు వెచ్చగా ఉండగానే అందులో ఈస్ట్, బెల్లం పొడి, ఉప్పు వేసి కలిపి దింపేయాలి. కొబ్బరి పాలు జత చేయాలి. కొర్ర పిండి, గోధుమ పిండి, బ్రెడ్‌ ఇంప్రూవర్‌ మూడింటినీ కలుపుకుని, అప్పడాల పీట మీద వేసి బాగా కలపాలి. ఒక గిన్నెకు నూనె పూసి, ఈ తయారైన పిండి ముద్దను అందులో పెట్టి, మూత పెట్టి, రెండు గంటలపాటు నాననివ్వాలి. అప్పుడు అది పొంగుతుంది. అవెన్‌ను 180 డిగ్రీల దగ్గర వేడి చేయాలి. బన్‌ పాన్‌ తీసుకుని దానికి నూనె పూయాలి. ఈ తయారైన ముద్దను మళ్లీ పది నిమిషాల పాటు బాగా కలపాలి. ఆ తరవాత ట్రే లో ఉంచి, అవెన్‌లో పెట్టి పావు గంట సేపు బేక్‌ చేసి తీసేయాలి.

అరికల అట్టు
కావలసినవి: అరికలు – అర కప్పు, కంది పప్పు – పావు కప్పు, పచ్చి సెనగ పప్పు – పావు కప్పు, పెసర పప్పు – ఒక టీ స్పూను, మినప్పప్పు – ఒక టీ స్పూను, ఎండు మిర్చి – 2 సోంపు – ఒక టీ స్పూను, ఉల్లి తరుగు – పావు కప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను కొత్తిమీర తరుగు – ఒక టేబుల్‌ స్పూను, పుదీనా తరుగు – ఒక టేబుల్‌ స్పూను ఉప్పు – తగినంత

తయారీ: ఒక పెద్ద గిన్నెలో అరికలు, కంది పప్పు, మినప్పప్పు, పచ్చి సెనగ పప్పు, పెసర పప్పు వేసి తగినన్ని నీళ్లు జత చేసి నాలుగు గంటల పాటు నానబెట్టాక, నీళ్లు ఒంపేసి గ్రైండర్‌లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. మిక్సీలో ఎండు మిర్చి, సోంపు జత చే సి మరోమారు గ్రైండ్‌ చేసి, ఇడ్లీపిండికి, దోసెల పిండికి మధ్యరకంగా రుబ్బి, పిండిని గిన్నెలోకి తీసుకోవాలి. ఉల్లి తరుగు, కొత్తిమీర తరుగు, ఉప్పు జత చేసి, మూత పెట్టి సుమారు గంటసేపు పిండిని నాననివ్వాలి. స్టౌ మీద పెనం ఉంచి వేడయ్యాక, కొద్దిగా నూనె వేసి కాగాక, గరిటెతో పిండి తీసుకుని పెనం మీద దోసె మాదిరిగా వేయాలి. అంచులు గోధుమరంగులోకి వచ్చాక ఉల్లి తరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద వేయాలి. పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు వేసి అలంకరించి దోసెను మధ్యకు మడత వేసి తీసేయాలి. కొబ్బరి చట్నీ లేదా అల్లం పచ్చడితో వేడివేడిగా అందించాలి.

అరికల పులావు
కావలసినవి:  అరికల బియ్యం – ఒక కప్పు, ఉల్లి తరుగు – ఒక కప్పు, నిలువుగా తరిగిన పచ్చి మిర్చి – 4అల్లం వెల్లుల్లి ముద్ద – 2 టీ స్పూన్లు, కూరగాయ ముక్కలు – ఒక కప్పు (క్యారట్, బఠాణీ, బీన్స్, క్యాప్సికమ్‌)షాజీరా – అర టీ స్పూను, ధనియాల పొడి – ఒక టీ స్పూను, నిమ్మ రసం – ఒక టీ స్పూను నెయ్యి/నూనె –  2 టేబుల్‌ స్పూన్లు, షాజీరా – అర టీ స్పూను, పుదీనా తరుగు – పావు కప్పుఉప్పు – తగినంత, బిర్యానీ మసాలా దినుసులు, బిర్యానీ ఆకులు – 2, దాల్చిన చెక్క – చిన్న ముక్క లవంగాలు – 4, ఏలకులు – 2, మిరియాలు – అర టీ స్పూను సోంపు – అర టీ స్పూను, జాపత్రి – కొద్దిగా

తయారీ: అరికల బియ్యాన్ని రెండుమూడు సార్లు కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి రెండు గంటలపాటు నానబెట్టుకోవాలి. బిర్యానీ మసాలా దినుసులన్నీ రెండున్నర కప్పుల నీళ్లలో మరిగించి, వడకట్టి పక్కన ఉంచాలి. స్టౌ మీద మందపాటి గిన్నెలో నెయ్యి/నూనె పోసి వేడి అయిన తరవాత షాజీరా, పచ్చి మిర్చి తరుగు, ఉల్లి తరుగు, కూరగాయ ముక్కలు ఒకదాని తరవాత ఒకటి వేస్తూ దోరగా వేయించుకోవాలి. పుదీనా, అల్లం వెల్లుల్లి ముద్ద చేర్చుకుని పచ్చి వాసన పోయేవరకు కలియబెట్టాలి. వడకట్టుకున్న నీళ్లు, ఉప్పు జత చేసి మరగనివ్వాలి. నానబెట్టుకున్న అరికల బియ్యంలో నీళ్లు ఒంపేసి, అరికలను మరుగుతున్న నీటిలో వేసి మూతపెట్టి, సన్నటి మంట మీద పులావు వండుకోవాలి. మధ్యలో ఒకటిరెండుసార్లు గరిటñ తో కలిపి మూత ఉంచి ఉడికించాలి. దించే ముందు ధనియాల పొడి, నిమ్మ రసం, నెయ్యి వేసి పూర్తిగా కలియబెట్టి దింపేయాలి. పుదీనా చల్లి, వేడివేడిగా అందించాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement