
మ్యాంగో కుల్ఫీ ...
మామిడిపండు పై తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్‌చేసుకోవాలి. లోపలి టెంక తీసేయాలి.
హెల్దీ ట్రీట్
కావలసినవి: మామిడిపండు – 1, కండెన్స్‌డ్ మిల్క్ – 1 కప్పు, పాలపొడి – పావు కప్పు, పంచదార – 3 టీ స్పూన్లు, ఏలకులపొడి – పావు టీ స్పూన్, కుంకుమ పువ్వు – కొద్దిగా, చెర్రీ ముక్కలు – 2 టీ స్పూన్లు.
తయారి:
1. మామిడిపండు పై తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్‌చేసుకోవాలి. లోపలి టెంక తీసేయాలి.
2. మామిడి పండు ముక్కలు, పంచదార, కండెన్స్‌డ్ మిల్క్, పాల పొడి వెడల్పాటి పాన్‌లో వేసి కలుపుతూ దగ్గరగా అయ్యేంతవరకు మరిగించాలి. ఆ తర్వాత దించి చల్లార్చాలి.
3. ఫ్రీజర్‌లో గట్టిపడేంత వరకు ఉంచి ఐస్‌క్రీమ్ కప్పులో వేసి సర్వ్ చేయాలి.
నోట్: ఈ మిశ్రమం ఒకరికి సరిపోతుంది. వ్యక్తులను బట్టి పదార్థాల క్వాంటిటీని పెంచుకోవాలి. వేసవి తాపానికి పిల్లలు ఐస్‌క్రీమ్ కావాలని గొడవ చేస్తుంటారు. వారి అల్లరి మానిపించడానికి పోషకాలు గల ఈ కుల్ఫీ పైన కావలిస్తే జీడిపప్పు అలంకరించి చల్లగా అందించవచ్చు.
పోషకాలు:
క్యాలరీలు – 275 కె.సి.ఎ.ఎల్
ప్రొటీన్ – 11.1గ్రా.
కార్బోహైడ్రేట్లు – 41.88గ్రా.
ఫ్యాట్ – 7.08గ్రా.
ఐరన్ – 1 గ్రా.
కాల్షియం – 389.5 గ్రా.