
శరీరంలో పోషకాలు లోపిస్తే నోటి పూత తరచూ బాధిస్తుంటుంది. ఇందుకు గాను తాజా సంత్రా జ్యూస్‌ని తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో ‘సి’ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. తాజా కొబ్బరిపాలు నోటిపూతకు మంచి ఔషధంగా పనిచేస్తాయి. రోజులో కనీసం మూడు లేదా నాలుగు సార్లు కొబ్బరి పాలను నోట్లో పోసుకుని పుకిలించి తర్వాత మంచినీటితో శుభ్రం చేసుకోవాలి. కొబ్బరిపాలు అందుబాటులో లేకపోతే నోరు భరించేంత వేడి ఉన్న గ్లాస్ నీటిలో టీ స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు వేసి కలపాలి.
ఈ నీటితో నోరు పుకిలించి శుభ్రం చేసుకుంటే ఉపశమనం కలగడమే కాకుండా రెండు, మూడు రోజుల్లో నోటిపూత తగ్గుతుంది. నోటి పూత వల్ల కలిగే ఇబ్బంది, నొప్పికి మిరియాల నూనె త్వరిత ఉపశమనం కలుగజేస్తుంది. ఉసిరికవేరు పొడి ఒక టీ స్పూన్, టేబుల్ స్పూన్ తేనెతో కలపాలి. ఆ పేస్ట్‌ని నేరుగా నోటిపూతపై రాస్తే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.