మెక్సికో మనదనుకో | Mexico country food special | Sakshi
Sakshi News home page

మెక్సికో మనదనుకో

Published Fri, Mar 4 2016 10:30 PM | Last Updated on Sun, Sep 3 2017 7:00 PM

మెక్సికో  మనదనుకో

మెక్సికో మనదనుకో

టొమాటో పోషకాల గురించి చిలవలు పలవలుగా వర్ణన కరక్టేనేమో! అందుకే మనం చారు కాస్తాం. మెక్సికన్లు సూప్ చేస్తారు. మెక్సికోలో అయినా మనదేశంలోనైనా చీజ్, చిప్స్, చికెన్, చిల్లీస్... కాంబినేషన్ కుదిరితే... పాకం ముదరడం, రుచి అదరడం ఖాయం. అడ్డుగోడ కట్టేసి వంట ఘుమఘుమల్ని ఆపడం కష్టం. ఆపడమూ, ఆగడమూ ఎందుకు? చలో కిచెన్... ప్రిపేర్ మెక్సికన్!
 
 ట టార్టిల్లా సూప్
కావల్సినవి: టొమాటోలను ఉడికించి, గుజ్జు చేసి,
తీసిన రసం - 1 1/2 కప్పు, నల్ల చిక్కుడు గింజలు/బొబ్బెర్లు(ఉడికించినవి) - టీ స్పూన్
టొమాటో, ఉల్లిపాయల తరుగు - టేబుల్ స్పూన్
ఉడికించిన స్వీట్ కార్న్ (మొక్కజొన్న గింజలు) -
టేబుల్ స్పూన్ పనీర్ (మాంసాహారం కావాలనుకునేవారు ఉడికించిన చికెన్ ముక్కలను సన్నగా తరిగి వాడచ్చు) - టేబుల్ స్పూన్
ఉప్పు - తగినంత
 
అలంకరణకు...
పాల మీగడ - టీ స్పూన్, కొత్తిమీర - 4 ఆకులు
టార్టిల్లా చిప్స్ (ఏ చిప్స్ అయినా వాడుకోవచ్చు) - 10-15
తయారీ:     టొమాటో రసాన్ని మరిగించాలి.
ఒక గిన్నెలో ఉడికించిన ఉలవలు, పనీర్ తరుగు లేదా చికెన్ ముక్కలు, టొమాటో, ఉల్లి తరుగు, ఉడికించిన మొక్కజొన్న, పనీర్ లేదా చికెన్ తరుగు, ఉప్పు వేయాలి.దీనిపైన మరిగించిన టొమాటో రసం పోయాలి. పైన పాల మీగడ, కొత్తిమీర,టార్టిల్లా చిప్స్ వేసి సర్వ్ చేయాలి.
 
ఎన్‌చిలడాస్
కావల్సినవి: ఫ్లోర్ టార్టిల్లా - 2  (4 కప్పుల మైదా, టీ స్పూన్ ఉప్పు, టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ల వెన్న, నీళ్లు తగినన్ని. ఇవన్నీ కలిపి ముద్ద చేసి, 10 నిమిషాలు అలాగే ఉంచాలి. పిండి మృదువుగా అవుతుంది. దీన్ని చిన్న చిన్న ముద్దలు తీసుకొని, చపాతీలా చేసి, పెనం మీద రెండు వైపులా కాల్చుకోవాలి. వీటిని ఫ్లోర్ టర్టిలా అంటారు)
 
ఫిల్లింగ్‌కు...

ఎన్‌చిలడా సాస్ - టేబుల్ స్పూన్ (2 టేబుల్ స్పూన్ల మైదా, కప్పు టొమాటో గుజ్జు, టేబుల్ స్పూన్ కారం, వాము, వెల్లుల్లి, ఉల్లి, పంచదార టీ స్పూన్ చొప్పున, ఉప్పు, మిరియాల పొడి తగినంత. 2 టేబుల్ స్పూన్ల నూనెను వేడి చేసి, పై పదార్థాలన్నీ బాగా వేసి, వేయించి వాడుకోవాలి), పనీర్, క్యారెట్, క్యాబేజీ తరుగు - 2 టేబుల్ స్పూన్లు, ఛీజ్ - టేబుల్‌స్పూన్
 
అలంకరణకు... పాల మీగడ (గిలకొట్టినది) - 2 టేబుల్ స్పూన్లు, కారం - పావు టీ స్పూన్, ఉప్పు - తగినంత
 
తయారీ:  ఎన్‌చిలడా సాస్‌ను ఫ్లోర్ టార్టిల్లా అంతా రాయాలిదాంట్లో క్యారెట్, క్యాబేజీ, సాస్, ఛీజ్ తరుగు వేసి రోల్ చేయాలి  వెడల్పు, మందం ఉన్న గిన్నెలో అడుగున స్పూన్ బటర్ వేసి, రోల్ చేసిన టార్టిల్లాలను ఉంచి, సన్నని మంట మీద ఉడికించాలి. మాడకుండా ఛీజ్ కరిగేంతవరకు ఉంచి, తీయాలి  పాలమీగడ వేసి, టొమాటో, క్యాబేజీ, ఉల్లి, కొత్తిమీర  తరుగుతో వడ్డించాలి.
నోట్: ఫిల్లింగ్ కోసం... చికెన్, మటన్ తరుగులను వాడచ్చు.
 
ఫ్రైడ్ ఐస్ క్రీమ్

కావల్సినవి: వెనిలా లేదా నచ్చిన ఐస్ క్రీమ్ - 1 స్కూప్
బ్రౌన్ బ్రెడ్ - 2 స్లైసులు
కాస్టర్ సుగర్ (గిన్నెలో పంచదార వేసి, సన్నని మంట మీద కరిగించినది) - 1/3 కప్పు
దాల్చిన చెక్కపొడి/ ఇలాచీ పొడి - టీ స్పూన్,
చాక్లెట్ సిరప్/ తేనె (ఒక చిన్న గిన్నెలో చాక్లెట్ బార్ వేసి, వేడి నీళ్లలో పెట్టి కరిగించినది. లేదంటే మార్కెట్లో చాక్లెట్ సిరప్ లభిస్తుంది) -
కావల్సినంత

తయారీ:ఐస్ క్రీమ్ స్కూప్‌ను (2 గంటలు డీప్ ఫ్రిజ్‌లో ఉంచాలి){బెడ్ చివర్లను కత్తితో కట్ చేయాలి.  {బెడ్‌ను గుండ్రంగా స్వీట్ కప్‌లా రోల్ చేయాలి.ఐస్ క్రీమ్‌ను రోల్ చేసిన బ్రెడ్ మీద పెట్టి, చుట్టూ బ్రెడ్‌తోనే అదిమి, బాల్‌లా చేసుకోవాలి. (పూర్ణం బూరెలా)       మరుగుతున్న నూనెలో వేసి, 8-10 సెకండ్లలోపు తీసేయాలి.కరిగించిన పంచదారలో దాల్చిన చెక్క/ఇలాచీ పొడి కలపాలి.దీంట్లో ఐస్‌క్రీమ్ ఉన్న బ్రెడ్ ఉండను దొర్లించాలి.చివరగా చాక్లెట్ సాస్, లేదంటే తేనె పైన వేసి, సర్వ్ చేయాలి. చెర్రీ పండు, వాల్‌నట్స్‌ను అలంకరణకు వాడుకోవచ్చు.
 
నోట్: అవెన్‌లో అయితే, 175 డిగ్రీల వేడిలో 15 సెకన్లు ఉంచి, వెంటనే తీయాలి
 
సిజ్లింగ్ ఫజిట
కావల్సినవి:ఎరుపు, పచ్చ బెంగుళూరు మిర్చి తరుగు (పొడవుగా కట్ చేయాలి) - 1 1/2 టీ స్పూన్ చొప్పున
ఉల్లిపాయ - 1, టొమాటో -1
ఫ్లోర్ టార్టిల్లా- 5
రొయ్యలు - 200 గ్రా.లు (శాకాహారులు పనీర్‌ను వాడచ్చు)
నూనె - టేబుల్ స్పూన్
ఉప్పు, మిరియాల పొడి - రుచికి తగినంత
సోయా సాస్(పనీర్ లేదా చికెన్ మ్యారినేషన్‌కు) - టేబుల్ స్పూన్

తయారీ:ఇనుప మూకుడును వేడి చేయాలి. అందులో నూనె వేసి మిర్చి, ఉల్లిపాయ తరుగు, ఉప్పు, మిరియాల పొడి వేసి 3-4 నిమిషాలు వేయించాలి.చికెన్‌ను బొగ్గుల మీద కాల్చి, ప్లేట్‌లో తీసుకోవాలి. సాస్ వేసి 10 నిమిషాలు  ఉంచాలి. 2 టర్టిలాలను తయారుచేసుకొని, పక్కన ఉంచాలి.వేయించిన కూరగాయ ముక్కలను పెట్టి, దాని పైన రొయ్యలను లేదా పనీర్ ముక్కలను ఉంచాలి.వాటి పైన కరిగించిన బటర్ లేదా నెయ్యి వేయాలి. దీనిని వేడి వేడిగా టార్టిల్లా, టొమాటో సూప్, ప్రైడ్ రైస్.. వంటి కాంబినేషన్‌తో వడ్డించాలి.  
 
గమనిక
: సిజ్లర్ ప్లేట్‌ను ఇనుముతో తయారుచేస్తారు. అందులోనే పదార్థాలను  వండి, ఆ ప్లేట్‌ను చెక్కమీద పెట్టి వడ్డిస్తారు. దీని వల్ల పదార్థం వేడి తొందరగా తగ్గదు.
 
కరె్టిసీ: జావేద్, షెఫ్
లా మెక్సికన్
కె.పి.హెచ్.బి, హైదరాబాద్
ఫొటోలు: శివ మల్లాల
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement