జామపండులో ‘విటమిన్–సి’తో పాటు రోగనిరోధకశక్తిని పెంచే గుణం ఉంది. ఇంకా అనేక పోషకాలు ఉన్నాయి. వీటన్నింటి ఫలితంగా జామపండు ఎన్నో జబ్బులను అవి రాకముందే నిరోధిస్తుందని అనేక అధ్యయనాల్లో తేలింది. ∙జామ అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. జామలోని యాంటీ ఆక్సిడెంట్స్ ఇందుకు దోహదం చేస్తాయి.
ముఖ్యంగా ప్రోస్టేట్, రొమ్ముక్యాన్సర్ల నివారణకు బాగా ఉపయోగపడుతుంది. జామపండు డిమెన్షియా, అలై్జమర్స్ వంటి జబ్బులను నివారించడంలో తోడ్పడుతుంది. ∙రక్తంలో కొలెస్ట్రాల్ పాళ్లను జామపండు తగ్గిస్తుంది. అలాగే అధిక రక్తపోటును నివారిస్తుంది. ∙జామపండ్లను తినేవారిలో చిగుర్లు, పంటి వ్యాధులు చాలా తక్కువగా కనిపిస్తాయి.
జబ్బులను నివారణకు జామ!
Published Thu, Jan 18 2018 11:41 PM | Last Updated on Thu, Jan 18 2018 11:41 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment