
సాధారణంగా ఆకుకూరలు తెచ్చిన గంటకే వాడిపోతుంటాయి. అలా వాడిపోకుండా, తాజాగా ఉండేందుకు అనువుగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ సంస్థ ఒక బాక్సుని కనిపెట్టింది. ఈ బాక్సులో 98 శాతం దాకా తేమ ఉంటుంది. అందువల్ల ఆకుకూరలు రెండు రోజుల పాటు సాధారణ గదిలో కూడా పాడవకుండా నిల్వ ఉంటాయి. ఈ బాక్సులోని సాంకేతికత ఆకుకూరలలోని పోషకాలు పోకుండా భద్రపరుస్తుంది. ఆకు కూరలను అప్పటికప్పుడు కోసినప్పుడు ఎంత తాజాగా ఉంటాయో, రెండు రోజుల తర్వాత కూడా అంతే తాజాగా ఉంటాయి.
సుమారు 12– 15 కిలోల ఆకుకూరలు నిల్వ ఉంచుకోవచ్చు. బాక్సు ధర ఆన్‌లైన్‌లో 10 వేల రూపాయల వరకు ఉంది. వీటి తయారీలో మంచి నాణ్యత కలిగిన పాలిమర్‌ను ఉపయోగిస్తారు. అందువల్ల మామూలు ప్లాస్టిక్‌ల నుంచి వచ్చే వాసన వీటి నుంచి రాదు. ప్రాంతాలను బట్టి, ఎక్కువ వేడిమి ఉన్న ప్రాంతాలలో జెల్ ప్యాక్‌లను ఉపయోగించి 6 – 8 డిగ్రీల వరకు వేడిని తగ్గించవచ్చు. బావుంది కదూ.