చలికాలంలో చర్మం పొడిబారే సమస్య దాదాపుగా అందరూ ఎదుర్కొనేదే. ఎన్ని క్రీములు రాసినా ఏమాత్రం ఉపయోగం లేదని చాలామంది వాపోతుంటారు. ఈ సమస్యలకు పరిష్కారం కావాలంటే ముందు మన చర్మ తత్త్వాన్ని తెలుసుకోవాలి. కొందరికి ఆయిల్ స్కిన్ ఉంటుంది. వీరికి సమస్య పెద్దగా ఉండకపోవచ్చు. కానీ, ఈ కాలంలో పొడి చర్మం గల వారికి పెద్ద సమస్యగా ఉంటుంది. వారి చర్మతత్వాన్ని బట్టి మాయిశ్చరైజర్లు రాసుకోవాలి.
గోరువెచ్చని నీళ్లు
ఫుల్‌క్రీమ్ లేదా అయిల్ బేస్డ్ మాయిశ్చరైజర్లు వాడాలి. స్నానం చేశాక కనీసం పది నిమిషాల్లోపు మాయిశ్చరైజర్ రాసుకోవాలి. చలిని తట్టుకోవడానికి చాలామంది వేడినీళ్లతో స్నానం చేస్తుంటారు. దీనివల్ల చర్మంపై సహజ నూనెలను కోల్పోతాం. అందుకని, స్నానానికి గోరువెచ్చని నీళ్లు వాడాలి. నిమ్మ, చందనంతో తయారైనవి కాకుండా గ్లిజరిన్, అలోవెరా, ఓట్‌మిల్క్ బేస్డ్ సోప్స్ స్నానానికి ఎంచుకోవాలి. వింటర్‌లోనూ సన్‌స్క్రీన్‌ను ఉపయోగించాలి.
రుద్దకూడదు..
డ్రై స్కిన్ ఉన్నవాళ్లు క్లెన్సింగ్ మిల్క్‌ని రోజుకు ఒకసారైనా ఉపయోగించాలి. స్క్రబ్స్ వంటివి ఎక్కువ ఉపయోగించకూడదు.
కొందరు స్నానానికి మైత్తటి కాయిర్‌ను వాడుతుంటారు. ఈ కాలం దానిని వాడక΄ోవడం ఉత్తమం.
పాదాలను రాత్రివేళ శుభ్రపరుచుకొని, ఫుట్ క్రీమ్ లేదా పెట్రోలియమ్ జెల్లీ రాసుకోవాలి. కాలి పగుళ్ల సమస్య ఉన్నవారు సాక్సులు వేసుకోవాలి.
కొందరు సీరమ్స్ వాడుతుంటారు. వీటిలో యాసిడ్ కంటెంట్ చాలా తక్కువగా ఉన్నవి ఎంచుకోవాలి.
ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్లు జెల్ లేదా లోషన్ బేస్డ్ మాయిశ్చరైజర్లు ఉపయోగించుకోవాలి.
సోరియాసిస్, వంటి చర్మ సమస్యలు ఉన్నవారు ముందుగానే వైద్యులను సంప్రదించి మందులు తీసుకోవాలి.
మేకప్‌కి ముందు మాయిశ్చరైజర్
మేకప్ చే సుకోవడానికి ముందు క్లెన్సింగ్ మిల్క్ ఉపయోగించి, తర్వాత మాయిశ్చరైజర్ వాడాలి. మేకప్ తీసేసాక మళ్లీ క్లెన్సింగ్ మిల్క్‌ను ఉపయోగించాలి.
డ్రైస్కిన్ వాళ్లు ఆయిల్ బేస్డ్ ఫౌండేషన్స్ వాడాలి.
సూప్‌లు, జ్యూస్‌లు..
ఆకుకూరలు, కూరగాయలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. నట్స్, నువ్వులు వంటివి ఈ కాలంలో ఆహారంలో చేర్చుకోవడం, ఉపయోగించడం మంచిది. సాధారణంగా చలికాలంలో చాలామంది తక్కువ నీళ్లు తాగుతారు. కానీ, మన శరీరానికి 3–4 లీటర్ల నీళ్లు అవసరం. నీళ్లు తాగలేక΄ోయినా సూప్‌లు, జ్యూస్‌ల రూపంగా తీసుకోవచ్చు.
– డా. స్వప్నప్రియ, డెర్మటాలజిస్ట్
Comments
Please login to add a commentAdd a comment