మేకప్ ఎక్కువసేపు ఉండాలంటే!
పొడి చర్మం: వేసవిలో మేకప్‌కు ముందు మాయిశ్చరైజర్ రాయాల్సిన అవసరం ఉండదు. అయితే చెమట ప్రతాపానికి మేకప్ పోకుండా వాటర్‌ప్రూఫ్ మేకప్ వాడటం మేలు. లిక్విడ్ ఫౌండేషన్‌ని ఉపయోగించిన తర్వాత మస్కారా, లైనర్‌తో కళ్లను తీర్చిదిద్దుకోవాలి. తర్వాత పెదవులకు లిప్ లైనర్, గ్లాస్‌ను ఉపయోగించాలి. బుగ్గలకు బ్లష్‌ను అద్ది, టిష్యూ పేపర్‌తో టచ్ చేస్తూ అదనపు రంగును తీసేయాలి.
జిడ్డు చర్మం: వేసవిలో మరింత జిడ్డుగా మారుతుంది. అలాంటప్పుడు ముందుగా ఐస్‌తో ముఖమంతా రబ్ చేసి, తర్వాత ఫౌండేషన్‌ని ఉపయోగించాలి. మేకప్‌కు ముందు బేస్ కోసం ప్రైమర్‌లోషన్(మార్కెట్లో లభిస్తుంది)ను ఉపయోగించాలి. దాని మీద కాంపాక్ట్ , ఫౌండేషన్ వాడకుండా వాటర్ బేస్డ్ పాన్‌కేక్స్‌ను ఉపయోగించాలి. తర్వాత కళ్లు, పెదవులు, బుగ్గలు తీరుగా తీర్చిదిద్దుకోవాలి.
సాధారణ చర్మం: చాలామంది సాధారణ చర్మతత్వం గలవారని అంటుంటారు కానీ, వీరిది కాంబినేషన్ స్కిన్ అనవచ్చు. ముఖంలో నుదురు, గడ్డం జిడ్డు అవుతుంది. అందు కని వీరు కూడా మేకప్‌కు ముందు ఐస్‌తో ముఖమంతా రబ్‌చేయాలి. నుదురు, గడ్డానికి ప్రైమర్ లోషన్‌ని బేస్‌గా వాడి తర్వాత కళ్లు, పెదవులు, బుగ్గలను తీర్చిదిద్దుకోవాలి.