హెయిర్ డై
జుట్టుకు రంగు వేసుకునేటప్పుడు చర్మానికి తగలకూడదు. ముందుగా ముఖానికి, చెవులకు మాయిశ్చరైజర్ రాసుకొని తర్వాత డై వేసుకోవాలి. డై ఎంపికలో నాణ్యత విషయంలో రాజీపడకూడదు. జుట్టు సువాసనలు వెదజల్లాలంటే హెయిర్ సీరమ్ లేదా హెయిర్ స్ప్రే వాడచ్చు. జుట్టు సిల్కీగా మారాలనుకుంటే స్ట్రెయిటనింగ్ షాంపూ, కండిషనర్ వాడితే కొంతవరకు ఫలితం ఉంటుంది.
స్టీమ్
ఫేషియల్ చేసే సమయంలో ముఖానికి ఆవిరి పట్టడం చూస్తుంటాం. అధికంగా ఆవిరిపట్టడం వల్ల చర్మంలోని పోర్స్ ఓపెన్ అయ్యి, చర్మం వదులయ్యే అవకాశాలు ఉన్నాయి. అమితంగా స్క్రబ్ చేయడం, స్టీమ్ పట్టడం వంటివి చర్మంలోని సహజతేమను పోగొడతాయి. అప్పటికి కాంతిగానే అనిపించినా, తర్వాత చర్మం జీవం కోల్పోయినట్టు తయారవుతుంది. అందుకని వీలైనంత వరకు స్టీమ్‌ను తగ్గించడం మేలు.
Comments
Please login to add a commentAdd a comment